// // Papaya - ఖాళీ పొట్టతో నెలరోజులు బొప్పాయి తింటే… శరీరంలో జరిగే మార్పులు ఇవే -->
E-Paper
Advertisement

Papaya: ఖాళీ పొట్టతో నెలరోజులు బొప్పాయి తింటే… శరీరంలో జరిగే మార్పులు ఇవే

Papaya: ఖాళీ పొట్టతో నెలరోజులు బొప్పాయి తింటే… శరీరంలో జరిగే మార్పులు ఇవే
Advertisement

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఖాళీ పొట్టతో బొప్పాయి తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఒక నెలపాటు ఇలా తినడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. మన రోజువారీ ఆహారంలో సులభంగా లభించే ఈ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది. మొదటగా, బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ఆహారాన్ని త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అందువల్ల గ్యాస్, బ్లోటింగ్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. చాలామందికి ఉండే మలబద్ధకం సమస్య కూడా క్రమంగా తగ్గిపోతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే బావెల్ మూమెంట్ సాఫీగా జరుగుతుంది.

బరువు తగ్గేందుకు
బరువు తగ్గాలని భావించే వారికి ఇది బెస్ట్ ఆహారం. బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువసేపు ఆకలి వేయదు. ఫలితంగా అనవసరంగా తినే అలవాటు తగ్గి, బరువు నియంత్రణలో ఉంటుంది. ఒక నెలపాటు దీన్ని అలవాటుగా చేసుకుంటే కాస్త బరువు తగ్గినట్లు గమనించవచ్చు.

Advertisement

చర్మానికి మెరుపు
చర్మం అందంగా కనిపించడంలో కూడా బొప్పాయి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ A, C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపల నుంచి శుభ్రపరచి, మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. క్రమంగా చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. అందుకే చాలా మంది బ్యూటీ నిపుణులు కూడా బొప్పాయి తినాలని సూచిస్తుంటారు.

Also read: Kerala Fish Curry: కేరళ స్టైల్లో చేపల ఇగురు వండారంటే ఎవరికైనా నచ్చాల్సిందే, రెసిపీ ఇదిగో

Advertisement

బొప్పాయి తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. బొప్పాయిలో ఉన్న విటమిన్ C శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. దీని వల్ల సాధారణ జలుబు, దగ్గు వంటి సమస్యలు తక్కువగా వస్తాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా బొప్పాయి మంచిదే. ఇందులో ఉండే ఫైబర్, పొటాషియం కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

బొప్పాయి ఎంత మంచిదైనా అతిగా తింటే సమస్యలు వస్తాయి. బొప్పాయిని ఎక్కువగా తింటే కడుపులో అసౌకర్యం కలగవచ్చు. కొంతమందికి డయ్యేరియా వంటి సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా గర్భిణీలు బొప్పాయి తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఒక నెలపాటు ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటం నుంచి చర్మం మెరుగు పడటం వరకు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. పరిమితంగా తింటే శరీరానికి తగ్గట్టు అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం.

Also read: Sleep with Lights on: రాత్రిపూట లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? మీకెంత డ్యామెజ్ అవుతుందో తెలుసా?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×