E-Paper
Advertisement

మీ ఫ్రిజ్ తెరిస్తే ‘దుర్వాసన’ వస్తోందా? సబ్బుతో కడిగినా పోని ఆ వాసనను 10 నిమిషాల్లో తరిమికొట్టే ‘మ్యాజిక్’ చిట్కాలు!

మీ ఫ్రిజ్ తెరిస్తే ‘దుర్వాసన’ వస్తోందా? సబ్బుతో కడిగినా పోని ఆ వాసనను 10 నిమిషాల్లో తరిమికొట్టే ‘మ్యాజిక్’ చిట్కాలు!
Advertisement

Fridge Cleaning: కరీ మిగిలిందా ..ఫ్రిడ్జ్ లోకి తోసెయ్ ..
పాలు మిగిలాయా.. ఫ్రిడ్జ్ లో పెట్టెయ్ ..
వాటర్ చల్లగా ఉండాలా.. ఫ్రిడ్జ్ లో నెట్టేయ్..

ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టడానికి కాదేదీ అనర్హం అంటూ ఉదయం నుండి రాత్రి వరకు ఫ్రిడ్జ్ ని ఎంత విచ్చల విడిగా వాడతామో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.మరి ఆ రకంగా వాడుతున్న ఫ్రిడ్జ్ ఎంత నీట్ గా ఉండాలి. సో ..ఇలా .. మీ వంటింట్లోనే ఉండే ఈ చిన్న చిన్న వస్తువులతో కేవలం 10 నిమిషాల్లో ఫ్రిజ్‌ను ‘ఫ్రెష్’ గా మార్చేయండి.

Advertisement

వాసన పోగొట్టడంలో ఇది నంబర్-1

చాలామంది నారింజ పళ్ళని తినేసి తొక్కాలని పారేస్తుంటారు. కానీ ఇది ఫ్రిజ్ వాసన పోగొట్టడంలో ఇది నంబర్-1 అని మీకు తెలుసా ..యస్ ..తొక్కే కదాని తీసి పడేయకుండా ఒక చిన్న గిన్నెలో ఫ్రెష్ గా ఉన్న నారింజ తొక్కను ఉంచి, దానిపై అర టీస్పూన్ ఉప్పు చల్లండి. దీన్ని అలాగే ఫ్రిజ్ మూలలో పెడితే.. ఉప్పు లోపలి తేమను పీల్చుకుని కేవలం 10 నిమిషాల్లోనే అద్భుతమైన సువాసనను ఇస్తాయి.

Advertisement

ఆ బాల్స్ ని ఫ్రిజ్ అరల్లో పెట్టారంటే చాలు

ఒకవేళ మీ ఇంట్లో నారింజ పళ్ళు లేవా.. ఏం ప్రాబ్లం లేదు . ఒక పాత న్యూస్ పేపర్ ని చిన్న చిన్న బాల్స్ లా చుట్టి, దానిపై కొంచెం వెనిగర్ చల్లండి. అలా చేసిన బాల్స్ ని ఫ్రిజ్ అరల్లో పెట్టారంటే చాలు. వెనిగర్ లోని ఎసిడిక్ గుణాలు బ్యాక్టీరియాను చంపేసి , బూజు వాసనను పూర్తిగా లాగేస్తాయి.

also read:అమ్మ నమ్మకం వర్సెస్ నాస్తికుడి ప్రేమ! అంత్యక్రియల రచ్చపై ప్రకాష్ రాజ్ ‘విశ్వరూపం’.. ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

ఘాటైన వాసనలు ఫ్రిజ్ నుండి పోవాలంటే

ఇక మనం ఫ్రిజ్‌లో చేపలు లేదా మాంసంని కూడా పెడుతూనే ఉంటాం. వీటి ఘాటైన వాసనలు ఫ్రిజ్ నుండి పోవాలంటే రెండు స్పూన్ల కాఫీ పొడిని ఒక ప్లేటులో వేసి లోపల పెట్టండి.కాఫీలో ఉండే నైట్రోజన్ ఆ వాసనలను పోయేలా చేస్తుంది. ఒకవేళ కాఫీ పొడి వద్దు అనుకుంటే, ఒక చిన్న బొగ్గు ముక్కను పల్చని క్లాత్‌లో కట్టి ఉంచినా సరే రిజల్ట్ అధ్బుతంగా ఉంటుంది.

ఇంకా సింపుల్ గా స్మెల్ పోవాలనుకుంటున్నారా..

ఇక ఇవన్నీ కాదు ఇంకా సింపుల్ గా స్మెల్ పోవాలనుకుంటున్నారా ..అయితే ఒక గిన్నెలో బేకింగ్ సోడా వేసి ఫ్రిజ్‌లో పెట్టేయండి. ఇది గాలిలోని చెడు వాసనలను పూర్తిగా పీల్చుకుని ఫ్రిజ్‌ను ఫ్రెష్ గా ఉంచడంలో సహాయం చేస్తుంది. ఇక కేవలం ఫ్రిజ్ మాతమే కాదండోయ్ .. లోపల ఉండే రబ్బరు గాస్కెట్లను (Rubber Beading)కూడా వారానికి ఒకసారి తడి గుడ్డతో తుడుస్తూ ఉంటె మంచి రిజల్ట్ కనిపిస్తుంది.

ఎంత క్లీన్ చేసినా లాభం ఉండదు 

అయితే ఎన్ని రకాలుగా క్లీన్ చేసినా మళ్ళీ ఎప్పట్లాగే కాలం చెల్లినవి, డేట్ ఎక్స్పైర్ అయినవి, బాగా పాడైపోయినవి అలాగే తీయకుండా ఉంచితే ఎంత క్లీన్ చేసినా లాభం ఉండదని గుర్తుపెట్టుకోండి !

also read:ఆది సాయి కుమార్‌తో హాస్య మూవీస్ 10వ సినిమా.. రేపే గ్రాండ్ ఓపెనింగ్

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×