E-Paper
Advertisement

Beauty Drink: ఉదయాన్నే ‘టర్మరిక్ జింజర్ షాట్’ తాగితే చర్మం సహజంగా మెరిసిపోతుంది

Beauty Drink: ఉదయాన్నే ‘టర్మరిక్ జింజర్ షాట్’ తాగితే చర్మం సహజంగా మెరిసిపోతుంది
Advertisement

ప్రతి ఒక్కరూ మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం కావాలని కోరుకుంటారు. కానీ ఖరీదైన క్రీములు, ట్రీట్‌మెంట్లు వాడలేరు. నిజానికి ఇంటి చిట్కాలతోనే ముఖాన్ని మెరిపించుకోవచ్చు. కాకుండా మన ఇంట్లోనే ఉండే సహజ పదార్థాలతో చర్మాన్ని మెరిపించుకోవచ్చు. టర్మరిక్ జింజర్ షాట్ అనే చిన్న హెల్త్ డ్రింక్ ప్రతిరోజూ ఉదయం తాగితే చర్మానికి సహజ కాంతి వస్తుంది.

టర్మరిక్ జింజర్ షాట్ అంటే ఏమిటి?
ఇది పసుపు (టర్మరిక్), అల్లం (జింజర్)తో తయారుచేసే డ్రింక్. దీన్ని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. అందుకే టర్మరిక్ జింజర్ షాట్ అంటారు. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల మొటిమలు తగ్గి, చర్మం కాంతివంతంగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇందులో ఉండే అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సరిగా ఉంటే శరీరంలో టాక్సిన్లు తగ్గి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నిమ్మరసం కలపడం వల్ల విటమిన్-C లభిస్తుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో సహాయపడుతుంది.ఈ డ్రింకులో మిరియాల పొడి చిటికెడు వేయడం వల్ల పసుపులోని గుణాలు శరీరం శోషించుకుంటుంది.

Advertisement

ఎలా తయారు చేయాలి?
అర టీస్పూన్ పసుపు పొడి, ఒక అంగుళం తాజా అల్లం, అర నిమ్మకాయ రసం, చిటికెడు మిరియాల పొడి, అరకప్పు గోరువెచ్చని నీరు, రుచికి అర టీస్పూన్ తేనె దీనికి అవసరం. మొదట అల్లాన్ని చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసుకోవాలి. అందులో పసుపు, నిమ్మరసం, మిరియాల పొడి, నీరు వేసి బాగా గ్రైండ్ చేయాలి. తరువాత వడకట్టి చిన్న గ్లాస్‌లో తీసుకుని వెంటనే తాగాలి. తేనె వేయాలనుకుంటే చివర్లో కలిపి తాగవచ్చు.

ఎప్పుడు తాగాలి?
ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచిదని సూచిస్తున్నారు. కొంతమంది వ్యాయామానికి ముందు కూడా తీసుకుంటారు. కానీ రోజూ ఒక చిన్న మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మూడు నుంచి నాలుగు వారాలు క్రమంగా తీసుకుంటే మార్పు గమనించవచ్చని చెబుతున్నారు. అయితే అందరికీ ఇది సరిపోవచ్చు అనుకోవడం సరికాదు. గాల్‌బ్లాడర్ సమస్యలు ఉన్నవారు, బ్లడ్ థిన్నర్ మందులు వాడేవారు, తీవ్ర ఎసిడిటీ సమస్య ఉన్నవారు, గర్భిణీలు, బాలింతలు వైద్యుల సలహాతోనే తాగాలి. అలాగే దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపు మంట, అసౌకర్యం కలిగే అవకాశం ఉంది.

Advertisement

ఇప్పటి బిజీ జీవితంలో సహజ పదార్థాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. టర్మరిక్–జింజర్ షాట్ లాంటి పానీయాలు పెద్ద ప్రయోజనాలు ఇస్తాయి. అయితే ఇది ఒక్కరోజులో అద్భుత ఫలితం ఇస్తుందని మాత్రం కోరుకోకూడదు. సరైన ఆహారం, తగిన నిద్ర, తగినంత నీరు తాగడం, వ్యాయామం.. ఇవన్నీ చేస్తూ ఇంటి చిట్కాలను అదనంగా పాటిస్తే అప్పుడు ఉత్తమ ఫలితాలు వస్తాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×