E-Paper
Advertisement

Acne and Fish: చేపలు తింటే మొటిమలు తగ్గిపోతాయా?

Acne and Fish: చేపలు తింటే మొటిమలు తగ్గిపోతాయా?
Advertisement

యువతలో ఎక్కువగా కనిపించే చర్మ సమస్యల్లో మొటిమలు ఒకటి. హార్మోన్ల మార్పులు, అధిక జిడ్డు, చెడు ఆహారం, మానసిక ఒత్తిడి, కాలుష్యం వంటి అనేక కారణాలు మొటిమలకు దారి తీస్తాయి. అయితే కొంత మంది చేపలు తింటే మొటిమలు తగ్గుతాయి అని చెబుతుంటారు. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం.

చేపల్లో ఉన్న ఆరోగ్యకరమైన పోషకాలు
చేపలలో ముఖ్యంగా ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం, చర్మానికి అవసరమైన పోషణను అందించడం వంటి అనేక ప్రయోజనాలు ఇస్తాయి. ముఖ్యంగా సాల్మన్, సార్డిన్, మ్యాకరెల్, ట్యూనా వంటి చేపల్లో ఈ ఓమెగా-3 ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా చేపల్లో విటమిన్ D, ప్రోటీన్, జింక్, అయోడిన్ వంటి చర్మ ఆరోగ్యానికి అవసరమైన పదార్థాలు ఉంటాయి.

Advertisement

చేపలు తింటే మొటిమలు తగ్గుతాయా?
చర్మ నిపుణుల అభిప్రాయం ప్రకారం చేపలు తినడం మొటిమలు పోవు. అయితే మొటిమలను పెంచే ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో చేపలలో ఉన్న ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సహాయపడుతాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గితే మొటిమలు రావడం తగ్గుతుంది. చర్మం మృదువుగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.మొటిమల వల్ల వచ్చే రెడ్‌నెస్, వాపు, పెయిన్ తగ్గుతాయి. అంటే చేపలు తినడం ద్వారా మొటిమలు తగ్గే అవకాశం ఉంది.. అలా అని పూర్తిగా మొటిమలు రావు అని చెప్పలేము.

మొటిమలు ఎందుకు వస్తాయి?
టీనేజీ వయసులో జరిగే హార్మోన్ మార్పుల వల్ల, చక్కెర అధికంగా ఉండే ఆహారం, చర్మం సెబమ్ ను అధికంగా ఉత్పత్తి చేయడం, స్ట్రెస్, నిద్రలేమి, చర్మ పరిశుభ్రత లేకపోవడం, కొన్ని మేకప్ ఉత్పత్తులు, జన్యుపరమైన కారణాలు… వీటన్నింటి వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉంది. ఒమెగా-3 ఎక్కువగా ఉన్న చేపలు మొటిమలకు మంచివిగా భావిస్తారు. కాబట్టి సాల్మన్, సార్డిన్స్, మ్యాకరెల్, ట్యూనా వంటి చేపలు తినాలి. ఇక మన దేశంలో దొరికే రోహు, బొచ్చు, బంగారు చేప, బొంకి వంటి చేపలు కూడా మంచి ప్రోటీన్ అందిస్తాయి. వారానికి 2–3 సార్లు చేపలు తీసుకోవడం మంచిదని అంటారు.

Advertisement

ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి?
చేపలు అందరికీ సరిపడాలని లేదు. చేపలకు అలర్జీ ఉన్నవారు తీసుకోకూడదు. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసిన చేపలు కాకుండా గ్రిల్, స్టీమ్, బాయిల్ చేసిన చేపలు మంచివి. కలుషితమైన నీటిలో పెరిగిన చేపల్లో హానికరమైన లోహాలు ఉండే అవకాశం ఉంటుంది. వాటిని తినకూడదు. చేపలు అధికంగా తినడం వల్ల అయోడిన్ శాతం పెరిగిపోయి థైరాయిడ్ సమస్యలు వస్తాయి . కనుక మితంగానే తీసుకోవాలి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×