E-Paper
Advertisement

ఒడిస్సీ సినిమా.. తామర పువ్వు తింటే జ్ఞాపకశక్తి పోతుందా? నిపుణులు ఏమంటున్నారు?

ఒడిస్సీ సినిమా.. తామర పువ్వు తింటే జ్ఞాపకశక్తి పోతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Advertisement

Lotus flower: హాలీవుడ్ మూవీ ది ఒడిస్సీ. ప్రపంచవ్యాప్తంగా కాకుండా ఇండియాలో ఇటీవల విడుదలైంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కాకపోతే తామర పువ్వు తినడం వల్ల హీరో గతాన్ని పూర్తిగా మర్చిపోతాడు. ఇది నిజమేనని చాలామంది సినీ లవర్స్ ఓ అంచనాకు వచ్చారు. దీన్ని గమనించిన వైద్య నిపుణులు నిజ జీవితంలో అది నిజం కాదని చెబుతున్నారు. తామర పువ్వు తింటే మనిషి జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేస్తుందనడానికీ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు.

ద ఒడిస్సీ మూవీ-క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన మూవీ ద ఒడిస్సీ. మాట్ డామన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం. ఈ సినిమా విడుదలైన మొదటి వారం బాక్సాఫీస్‌కు కాసుల పంట పడించింది. ఇప్పటివరకు 80 నుంచి 100 కోట్ల మార్క్‌ని టచ్ చేసినట్టు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నమాట. క్రిస్టోఫర్ నోలన్ రచన, దర్శకత్వం వహించారు. మాట్ డామన్ రాజు ఒడిస్సస్ పాత్రలో నటించాడు.

Advertisement

తామర పువ్వు తింటే జ్ఞాపకశక్తి పోతుందా? ఆయనతోపాటు టామ్ హాలండ్, యాన్ హాత్వే, రాబర్ట్ పాటిన్సన్, చార్లీజ్ థెరాన్, లుపిటా, జెండయా వంటివారు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రంలో తామర పువ్వు తినడంతో హీరో జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. దీన్ని వైద్య నిపుణులు తప్పుబడుతున్నారు. గ్రీకు పురాణాలలో తామర పువ్వుని వైరాగ్యంగా చెబుతున్నాయి. ప్రాచీన గ్రీకు దేవుడు.. సంతానోత్పత్తికి అధిపతి డయోనిసస్‌కు తామర పువ్వును సమర్పించేవారని చెబుతారు.

వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? ఇది దేవతల రాణి హేరాతో ముడిపడి ఉంటుంది. ఆమె రాజదండం కొనపై అదే పువ్వుతో చిత్రీకరించబడింది. హిందూ పురాణాల ప్రకారం.. హిందూ మతంలో తామరపువ్వు ఆధ్యాత్మిక స్వచ్ఛత, జ్ఞానోదయానికి చిహ్నంగా చెబుతారు. తామర గింజలు , కాండం, రేకులు అనేక ప్రాంతాల్లో ఆహారంగా ఉపయోగించిన సందర్భాలు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. తామర పువ్వు తినడం జ్ఞాపకశక్తి పూర్తిగా పోతుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదంటున్నారు వైద్య నిపుణులు.

Advertisement

తామర పువ్వు వ్యవహారంపై గురుగ్రామ్‌లోని మారెంగో ఆసియా హాస్పిటల్స్‌కు ఓ డాక్టర్ మీడియాతో మాట్లాడారు. సాధారణంగా తామర పువ్వులు ఒక వ్యక్తి జ్ఞాపకశక్తిని తుడిచిపెడుతుందని చెప్పడానికి ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవన్నారు. జ్ఞాపకశక్తి అనేది ఒకే ప్రక్రియ కాదని, కొత్త సమాచారాన్ని సంకేతపరచడం, జ్ఞాపకాలను పటిష్టం చేసుకోవడం, నిల్వ చేసిన సమాచారాన్ని తిరిగి పొందడం వంటి అనేక ప్రక్రియలు ఉంటాయన్నారు.

ALSO READ: గోళ్లు-కనుబొమ్మలు-కాలివేళ్లు.. ఇవే ఓ వ్యక్తి సంపద రహస్యం

గతంలో జరిగిన విషయాలు మనిషి మరిచిపోయేలా చేసే స్వభావం తామర పువ్వుకు లేదని పేర్కొంటున్నారు. విషపూరిత మొక్కలు, రసాయన పదార్థాలు వల్ల తాత్కాలిక జ్ఞాపక లోపానికి కారణమవుతారని చెబుతున్నారు. వాటిని తామర పువ్వుతో పోల్చడం సరికాదని చెబుతున్నారు. మార్కెట్లో దొరికే కొన్ని బ్లూ లోటస్ ఉత్పత్తుల వాదనలను పూర్తిగా నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×