E-Paper
Advertisement

Subhanshu Shukla: అంతరిక్షానికి వెళ్లొచ్చిన శుభాన్షు శుక్లా జీతం ఎంతో తెలుసా? షాక్ అవుతారు

Subhanshu Shukla: అంతరిక్షానికి వెళ్లొచ్చిన శుభాన్షు శుక్లా జీతం ఎంతో తెలుసా? షాక్ అవుతారు
Advertisement

శుభాన్షు  శుక్లా అంతరిక్ష కేంద్రం నుండి భూమికి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఈ మిషన్ పూర్తవడంతో పాటు అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించి పరిశోధన చేసిన మొదటి భారతీయుడిగా శుభాన్షు శుక్లా గుర్తింపు పొందారు. ఆక్సియం 4 మిషన్లో భాగంగా శుక్లా అంతరిక్ష ప్రయాణాన్ని చేశారు. అయితే ఇప్పుడు శుభాన్షు శుక్లా గురించి వివరాలను తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అంతరిక్షానికి వెళ్ళొచ్చిన శుభాన్షు శుక్లాకు జీతం ఎంత ఇస్తారు? అనేది చాలామందికి ఉన్న సందేహం.

శుభాన్షు శుక్లా జూలై 15న తన బృందంతో కలిసి భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష కేంద్రంలో దాదాపు 18 రోజులు ఆయన నివసించారు. నిజానికి మొదటి 14 రోజులు మాత్రమే షెడ్యూల్ చేశారు. కానీ శాస్త్రీయ పరిశోధనలు, కొన్ని అవాంతరాల వల్ల మరొక నాలుగు రోజులు పాటు అదనంగా అక్కడ ఉండాల్సి వచ్చింది. జూన్ 25న ఆయన అంతరిక్ష యాత్రను ప్రారంభించారు.0

Advertisement

జీతం ఎంత ఇస్తారు?

భారత వైమానిక దళంలో పైలెట్ గా పనిచేసిన శుభాన్షు శుక్లాకు 200 గంటల విమానయాన అనుభవం ఉంది. అయితే అంతరిక్షంలో 18 రోజులు పాటు ఉన్నందుకు ఆయనకు ఎంత జీతం ఇస్తారో తెలుసా? అసలు అతనికి జీతమే ఇవ్వరు. దాదాపు మూడు వారాలు అంతరిక్షంలో గడిపిన కూడా శుభాంశు శుక్లాకు ఎలాంటి జీతము అందదు. ఈ మిషన్ కు వెళ్లే ముందే శుభాన్షు శుక్లాకు ఇస్రో ఈ విషయాన్ని తెలియజేసింది. రాబోయే మిషన్లలో సహాయపడే అనుభవాన్ని పొందడం కోసమే శుభాన్షు శుక్లాను పంపిస్తున్నట్టు ముందే వివరించింది. శుభాంశు శుక్లాను అంతరిక్ష యాత్రకు పంపించేందుకు అతనికి శిక్షణ ఇచ్చేందుకు శాస్త్రీయ పరిశోధన కోసం ఇస్రో 548 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కాబట్టి శుభాంశు శుక్లాకు జీతం రూపంలో ఇస్రో ఏమీ ఇవ్వదు.

Advertisement

శుభాంశుకు ఎలాంటి జీతం లభించక పోయినా అతనికి వచ్చిన అనుభవం మాత్రం ఎంతో అపారమైనది. 2027 లో భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత మిషన్ అయినా గగనయాన్ కు అతను అనుభవం, జ్ఞానం, సమాచారం ఎంతో అవసరం. ఆ కార్యక్రమంలో శుక్లా ప్రత్యేక పాత్ర పోషించే అవకాశం ఉంది. అతని శిక్షణ కోసమే 500 కోట్లకు పైగా ఖర్చు చేసింది.. కాబట్టి ఇస్రో అతనికి ఎలాంటి జీతభత్యాలు చెల్లించలేదు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×