E-Paper
Advertisement

varieties of silk sarees: మన దేశంలో ఎన్ని రకాల పట్టుచీరలు ఉన్నాయో తెలుసా..? అసలు లెక్క పెట్టడం ఎవరి తరం కాదేమో..?

varieties of silk sarees: మన దేశంలో ఎన్ని రకాల పట్టుచీరలు ఉన్నాయో తెలుసా..? అసలు లెక్క పెట్టడం ఎవరి తరం కాదేమో..?
Advertisement

varieties of silk sarees: భారతదేశం పట్టు చీరలకు పుట్టినిల్లు. ఇక్కడ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకమైన శైలి, నేత విధానం ఉన్నాయి. ప్రధానంగా ప్రసిద్ధి చెందిన కొన్ని రకాల పట్టు చీరల గురించి అలాగే అవి లభించే ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 కంచిపట్టు: దీనిని పట్టుచీరల రాణి అంటారు. ఈ పట్టుచీరలు తమిళనాడులోని కంచి అనే పట్టణ కేంద్రంగా తయారవుతాయి. బంగారు జరీ, వెండి పోగులతో ఈ చీరలను నేస్తారు. పెళ్లిళ్లకు కంచి పట్టు చీరలు  అత్యంత ప్రసిద్ధి చెందినవి.

Advertisement

బనారసి పట్టు: ఈ చీరలు ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసిలో తయారవుతాయి. ఇవి ముఖ్యంగా మొఘల్ శైలి డిజైన్లలో తయారవుతాయి. వీటిలో పూల తీగలు, బంగారు/వెండి బ్రోకేడ్ వర్క్ వీటి ప్రత్యేకత.

ధర్మవరం పట్టు చీరలు: డబుల్‌ షేడ్‌ అంటే రెండు రంగుల మిశ్రమం, అలాగే వెడల్పైన బోర్డర్లకు ఈ చీరలు పెట్టింది పేరు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం పట్టణ కేంద్రంగా తయారవుతుంటాయి.

Advertisement

పోచంపల్లి (ఇక్కత్) పట్టు చీరలు: ఇవి  తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ప్రసిద్ది చెందిన పోచంపల్లి ఏరియాలో తయారవుతాయి.  టై అండ్ డై పద్ధతిలో రంగులు అద్ది  రేఖాగణిత (Geometric) డిజైన్లతో వీటిని నేస్తారు. వీటికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ మంచి డిమాండ్‌ ఉంటుంది.

మైసూర్ సిల్క్: కర్ణాటక రాష్ట్రంలో ఈ చీరలు తయారవుతాయి. చాలా మృదువుగా, తేలికగా ఉంటాయి. వీటి తయారిలో స్వచ్ఛమైన పట్టు మరియు బంగారు జరీని ఉపయోగిస్తారు.

గద్వాల్ పట్టు చీరలు: బాడీ కాటన్ లేదా పట్టుతో ఉండి, బోర్డర్ మరియు పల్లు మాత్రం ప్యూర్ పట్టుతో ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి తెలంగాణలోని గద్వాల ప్రాంతంలో నేస్తారు.

ఉప్పాడ (జామ్దానీ) పట్టు చీరలు: చేత్తో నేసే అతి సన్నని డిజైన్లు, తక్కువ బరువు ఉండటం వల్ల ఇవి చాలా ప్రాచుర్యం పొందాయి. ఇవి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కాకినాడ ప్రాంతంలో నేస్తారు.

పైథానీ పట్టు చీరలు: ఈ చీరలు మహారాష్ట్రలో తయారవుతాయి. ఈ చీరల కొంగులపై నెమలి డిజైన్లు, పూల బొమ్మలు చాలా కళాత్మకంగా ఉంటాయి. ఇవి మధ్య భారతంలో చాలా ప్రాచుర్యం పొందిన పట్టు చీరలు.

పటోల పట్టు చీరలు: డబుల్ ఇక్కత్ నేత చీరలు ఇవి. ఈ చీరలు రెండు వైపులా ఒకేలా కనిపిస్తుంటాయి. ఇది చాలా ఖరీదైన పట్టురకం చీరలు. ఇవి గుజరాత్ రాష్ట్రంలో లభ్యమవుతాయి.

ముగా సిల్క్: సహజమైన బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటాయి ఈ చీరలు. ఇవి చాలా మన్నికైనవి.. ఇవి అస్సాంలో తయారవుతాయి.  తూర్పు భారతంలో వీటికి మంచి డిమాండ్‌ ఉంటుంది.

నారాయణపేట పట్టు చీరలు: తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ చీరలు చెక్ డిజైన్లు, సరళమైన బోర్డర్లకు ప్రసిద్ధి చెందినవి. ఇవి ఎక్కువగా నారాయణపేట పట్టణంలో తయారవుతాయి.

వెంకటగిరి: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఈ చీరలు తేలికపాటి నేతకు ప్రసిద్ధి చెందినవి.

చందేరి: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇవి సిల్క్ మరియు కాటన్ మిశ్రమంతో చాలా పారదర్శకంగా ఉంటాయి.

తుస్సార్ సిల్క్:  బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో లభించే ఈ పట్టు సహజమైన ఆకృతిని (Texture) కలిగి ఉంటుంది.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ నేతన్నలు చెప్పిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో బిగ్‌ టీవీ సొంతంగా కల్పించి రాసింది ఏమీ లేదని గమనించగలరు.

ALSO READ: వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉంటే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా..?

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×