E-Paper
Advertisement

Slow Aging: ముఖంలో వయసు ముదిరిన లక్షణాలు కనిపంచకూడదంటే ప్రతి ఉదయం ఇలా చేయండి

Slow Aging: ముఖంలో వయసు ముదిరిన లక్షణాలు కనిపంచకూడదంటే ప్రతి ఉదయం ఇలా చేయండి
Advertisement

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. చర్మం నిగారింపు తగ్గడం, జుట్టు రాలడం, శక్తి తగ్గిపోవడం, త్వరగా అలసిపోవడం… ఇవన్నీ మనలో చాలా మందికి తెలిసిన సమస్యలే. అయతే ప్రతి రోజు ఉదయాన్ని ఎలా ప్రారంభిస్తామన్నదే మన ఆరోగ్యంపై, చర్మంపై చాలా పెద్ద మార్పు తీసుకువస్తుంది. కొన్ని చిన్న చిన్న అలవాట్లు కాస్త క్రమంగా పాటిస్తే వృద్ధాప్యాన్ని సహజంగా నెమ్మదింప చేయవచ్చని తాజా అధ్యయనాలు కూడా చెపుతున్నాయి. ఖరీదైన క్రీములు, ట్రీట్‌మెంట్లు, మందులు అవసరం లేకుండా, ఇంట్లోనే పాటించగలిగే సింపుల్ అలవాట్లే ఇవి.

సూర్యోదయంతో రోజంతా ఎనర్జీ!
ఉదయాన్నే లేవగానే ఫోన్ స్క్రోల్‌ చేయడం చాలామందికి అలవాటు. కానీ అదే సమయం మీరు విండో తెరిచి బయట నుంచి సూర్యరశ్మిని తాకేలా చేస్తే శరీరానికి మంచిది. సూర్యరశ్మి మన ‘బాడీ క్లాక్’ను సెట్ చేస్తుంది. అంటే మన శరీరం ఎప్పుడు ఎనర్జీగా ఉండాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, ఎప్పుడు ఆహారం జీర్ణం చెయ్యాలి… అన్నీ ఈ ప్రకాశంతో సరిగ్గా అవుతాయి. దీని వల్ల మన నిద్ర బాగా పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. ఉదయం ఐదు నిమిషాలైనా సూర్యరశ్మిని ముఖానికి తగలనివ్వడం అలవాటు చేసుకుంటే చాలా ప్రయోజనం.

Advertisement

వేడి నీళ్లు, హర్బల్ టీ
ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం ఎంత మంచిది. అది వృద్ధాప్యాన్ని కూడా నెమ్మదింపజేస్తుంది. వేడి నీళ్లు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. శరీరం లోపల పేరుకుపోయిన టాక్సిన్లను బయటికి పంపిస్తాయి. అల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ హనీ టీ… ఇవి కూడా శరీరానికి శుభ్రతను, చురుకుదనాన్ని ఇస్తాయి. ఉదయం ఇలా తేలికైన డ్రింక్ తీసుకోవడం వలన కడపుబ్బరం తగ్గుతుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది.

ఇదికాకుండా ‘మొబిలిటీ మినిట్’ అనే అలవాటు కూడా చాలా మంచిది. అంటే నీళ్లు తాగాక లేదా లేవగానే శరీరంలోని మోకాళ్లు, చేతులు, మెడ, వెన్ను… ఇవన్నీ నెమ్మదిగా ఒకసారి అటు ఇటుగా కదుపుతూ ఉంటుంది. ఇది ఒక్క నిమిషం మాత్రమే పడుతుంది కానీ శరీరానికి మాత్రం బోలెడంత లాభం. స్టిఫ్ నెస్ తగ్గుతుంది. కండరాలు సడలుతాయి, శరీరం ఫ్రెష్‌గా ఉంటుంది.

Advertisement

రోజు ఎలా గడుస్తుందో మన బ్రేక్‌ఫాస్ట్‌పైనే ఆధారపడుతుంది. ఉదయాన్నే ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే శరీరం రోజంతా ఎనర్జీగా ఉంటుంది. గుడ్లు, పీనట్ బట్టర్, పెరుగు, బాదం, పులకాలు, ఓట్స్… ఇవి మంచి ఫుడ్స్. ఇవి రక్తంలో షుగర్ స్థాయిని కూడా కంట్రోల్‌లో ఉంచుతాయి. బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ శరీరానికి రాసుకున్నా మంచిది. చాలామంది ఈ విషయం లైట్‌గా తీసుకుంటారు కానీ చర్మం వృద్ధాప్యాన్ని తగ్గించే శక్తి దీనికి ఉంటుంది. సూర్యరశ్మి వల్ల వచ్చే ముడతలు, చర్మం కాంతి తగ్గిపోవడం, చర్మం రఫ్‌గా మారడం… ఇవన్నీ తగ్గడానికి ప్రతిరోజు సన్‌స్క్రీన్ అవసరం.

స్క్రీన్ టైమ్ తగ్గించాలి
లేవగానే చాలామంది మొదట చేసే పని ఫోన్ చెక్ చేయడం. కానీ ఈ పని అత్యంత హానికరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ స్క్రీన్‌ను లేవగానే చూస్తే మన బాడీ క్లాక్ కు అంతరాయం కలుగుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది,ఏకాగ్రత తగ్గుతుంది. అంతేకాకుంటే వృద్ధాప్యాన్ని వేగంగా తీసుకొచ్చే హార్మోన్లలో అసమతుల్యత వస్తుంది. కాబట్టి లేవగానే ఫోన్ చూసే ముందు 20 నిమిషాలు గ్యాప్ ఇవ్వడం మంచిది. ఆ సమయంలో నీళ్లు తాగండి. స్వల్ప వ్యాయామం చేయండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×