E-Paper
Advertisement

Rose water: ఇంట్లో రోజ్ వాటర్ ఇలా తయరుచేసి వాడితే ముఖం మెరిసిపోతుంది

Rose water: ఇంట్లో రోజ్ వాటర్ ఇలా తయరుచేసి వాడితే ముఖం మెరిసిపోతుంది
Advertisement

వేసవిలో చర్మం త్వరగా ఎండిపోతుంది. బయటకి వెళ్లి వస్తే ముఖం అలసిపోయినట్టుగా కనిపిస్తుంది. ఈ సమస్యకు రోజ్ వాటర్ మంచి పరిష్కారం. అందుకే ఇంట్లోనే సహజంగా రోజ్ వాటర్ తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో, సులభంగా ఇది తయారు చేసుకోవచ్చు. ఈ రోజ్ వాటర్ తయారీకి తాజా గులాడీ పూల రేకులు అవసరం. సాధ్యమైనంత వరకు రసాయనాలు లేకుండా పెంచిన పూలు తీసుకోవాలి. ముందుగా పూల రేకులను శుభ్రంగా కడగాలి. దుమ్ము, మలినాలు తొలగేలా చూసుకోవాలి. తరువాత ఒక పాత్రలో ఈ రేకులు వేసి వాటిపై నీరు పోయాలి. డిస్టిల్డ్ నీరు ఉంటే మరింత మంచిది.

ఇలా తయారుచేయండి
ఇప్పుడు ఈ పాత్రను స్టవ్ మీద పెట్టి తక్కువ మంటపై మెల్లగా వేడి చేయాలి. నీరు మరిగేలా కాకుండా జాగ్రత్త పడాలి. కొంతసేపటికి పూల రంగు తగ్గి నీటిలో కలుస్తుంది. అప్పుడు మంట ఆపాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ఈ నీటిని వడకట్టి శుభ్రమైన స్ప్రే బాటిల్‌లో పోయాలి. ఇంతకంటే సులభంగా రోజ్ వాటర్ ఫేస్ మిస్ట్ రెడీ అవుతుంది.

Advertisement

Also read: Salt: ఉప్పును స్టీవ్ డబ్బాల్లో స్టోర్ చేయకూడదా? నిల్వ చేస్తే ఏమవుతుంది?

ఈ రోజ్ వాటర్ చర్మానికి సహజ టోనర్‌లా పనిచేస్తుంది. ముఖంపై స్ప్రే చేస్తే వెంటనే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఎండలో తిరిగి వచ్చినప్పుడు వాడితే చల్లదనం లభిస్తుంది. చర్మం తేమగా ఉంటుంది. రోజంతా హైడ్రేషన్ నిల్వ ఉంటుంది. చర్మ రకం ఆధారంగా ఈ రోజ్ వాటర్లో కొన్ని పదార్థాలు కలిపితే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది. చర్మం పొడిగా ఉంటే కొద్దిగా గ్లిసరిన్ కలపాలి. ఇది తేమ నిల్వ ఉంచుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారు విచ్ హేజల్ కలిపితే ఆయిల్ తగ్గుతుంది. సన్‌బర్న్ సమస్య ఉంటే అలొవెరా జ్యూస్ కలపాలి. ఇది చర్మానికి చల్లదనం ఇస్తుంది. విటమిన్ E ఆయిల్ కొన్ని చుక్కలు వేసినా చర్మం మృదువుగా ఉంటుంది.

Advertisement

Also read: Beetroot juice: వారం రోజులు బీట్ రూట్ జ్యూస్ తాగితే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే

రోజ్ వాటర్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ కణాలను రక్షించడంలో సహాయపడతాయి. ఎర్రదనం, ఇర్రిటేషన్ తగ్గుతుంది. చర్మం సాఫ్ట్‌గా, కాంతివంతంగా కనిపిస్తుంది. చిన్న చిన్న మొటిమలు తగ్గేందుకు కూడా సహాయం ఉంటుంది. ఈ వాటర్ నిల్వపై కూడా శ్రద్ధ అవసరం. ప్రిజర్వేటివ్‌లు ఉండవు. అందుకే ఫ్రిజ్‌లో ఉంచాలి. మూడు నుంచి నాలుగు వారాల లోపు వాడటం మంచిది. ఎక్కువ రోజుల పాటు ఉంచితే నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే చిన్న పరిమాణంలో తయారు చేసుకోవడం మంచిది. రోజులో ఎప్పుడైనా దీన్ని వాడచ్చు. బయట నుంచి ఇంటికి వచ్చాక స్ప్రే చేస్తే వెంటనే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. మేకప్ ముందు వాడితే చర్మం సిద్ధమవుతుంది. మేకప్ తరువాత వాడితే లుక్ నేచురల్‌గా కనిపిస్తుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×