E-Paper
Advertisement

Guava Fruits: వింటర్ స్టార్ట్.. జామపండు తినకుండా వీళ్లని ఆపాల్సిందే!

Guava Fruits: వింటర్ స్టార్ట్.. జామపండు తినకుండా వీళ్లని ఆపాల్సిందే!
Advertisement

Guava Fruits: చలికాలం మెల్ల మెల్లగా మొదలవుతోంది.. ఈ కాలంలో ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో జామపండ్లు పెద్ద మొత్తంలో లభిస్తాయి. ఈ పండులో సోడియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే జామపండుని ‘పోషకాల గని’ అని కూడా పిలుస్తారు. కాబట్టి.. దీనిని సూపర్ ఫుడ్‌గానూ పరిగణిస్తారు. జామ జీర్ణ సమస్యలు, శారీరక బలహీనతను తగ్గిస్తుంది. దాని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని హానికరమైన కణాల నుంచి సంరక్షిస్తాయి. ఫలితంగా అనేక తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు. అయితే,
పోషకాల పవర్ హౌస్ అయిన ఈ జామపండు కొంతమందికి హాని చేస్తాయి. వీటిని అలాంటి వాళ్లు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. జామపండ్లను ఎలాంటి వారు తీసుకోకూడదంటే..

అలర్జీ సమస్యలుంటే:

జామపండుపై ఉండే రసాయనాలు అలెర్జీ సమస్యల్ని కలిగిస్తాయి. కాబట్టి.. అలర్జీ సమస్యలున్న వారు జామను తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. ఇప్పటికే చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు జామను ఎక్కువగా తీసుకుంటే.. చర్మంపై దుద్దర్లు, మంట, వాపు వంటి లక్షణాలు కనిపించే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు జామపండును మితంగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

గ్యాస్ట్రిక్ సమస్యలుంటే:

Advertisement

గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారు జామపండును ఎక్కువగా తినకూడదట. పైగా శీతాకాలంలో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు జామపండును ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే.. జామపండు జీర్ణమవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి.. జీర్ణక్రియ వేగంగా లేనివారు జామపండును మితంగా తీసుకోవాలి. పైగా పొట్ట ఉబ్బరం, విరేచనాలు, గ్యాస్, గుండెల్లో మంట, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు జామపండును అస్సలే తినకూడదు.

జలుబు, దగ్గుంటే:

చలికాలంలో జలుబు, దగ్గుతో ఇబ్బంది పడేవారు రాత్రిపూట జామను తినకపోవడమే మంచిది. జామలోని విత్తనాలు, ఫైబర్ జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తాయి. పైగా జామ జలుబు స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి.. చలికాలంలో అధికంగా తీసుకుంటే గొంతు నొప్పి, జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు ఎక్కువ. జామలో విటమిన్ సి, ఫ్రక్టోజ్ అధికంగా ఉండటంతో.. ఇది జీర్ణ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.

వీళ్లు కూడా జాగ్రత్త:

Advertisement

జామపండ్లను గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే అమ్మలు తినకపోవడమే ఉత్తమం. జామ పండులో, ఆకులలో ఉండే రసాయనాలు కొన్ని సందర్భాల్లో చర్మంపై చికాకు కలిగిస్తాయి. ఎగ్జిమా వంటి చర్మ సంబంధిత సమస్య ఉన్నవారిలో ఇది ఎక్కువగా జరుగుతుంది. వీళ్లు కూడా జామ పండు తినే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఒకవేళ పోషకాల కోసం గర్భిణులు జామ తీసుకోవాల్సి వస్తే.. వైద్యుల సలహా మేరకు తీసుకోవచ్చు.  అయితే, ఇప్పటికే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు జామపండుకు దూరంగా ఉండాలి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×