E-Paper
Advertisement

షుగర్ లేదు కదా అని గుడ్డిగా తాగుతున్నారా? ఈ తేడాలు తెలుసుకోకపోతే క్యాన్సర్ ముప్పు తప్పదు!

షుగర్ లేదు కదా అని గుడ్డిగా తాగుతున్నారా? ఈ తేడాలు తెలుసుకోకపోతే క్యాన్సర్ ముప్పు తప్పదు!
Advertisement

Diet Coke vs Coke Zero: బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ లెవెల్స్ చూసుకునే వారు కూల్ డ్రింక్స్ తాగాల్సి వస్తే మొదట వెతికేవి డైట్ కోక్ లేదా కోక్ జీరో. ఈ రెండూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది తాగే పాపులర్ డ్రింక్స్. కంపెనీ రికార్డుల ప్రకారం 2025లో కోక్ జీరో అమ్మకాలు ఏకంగా 14 శాతం పెరిగాయి. అయితే, అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? వీటి వల్ల నిజంగా బరువు తగ్గుతారా? ఆరోగ్యంపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

టేస్ట్‌లో తేడా ఏంటి?

చాలామందికి వచ్చే మొదటి డౌట్ ఇదే. కంపెనీ చెప్తున్న దాని ప్రకారం.. ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా రుచిలోనే ఉంది. కోక్ జీరో అనేది మన రెగ్యులర్ కోకాకోలా ఒరిజినల్ టేస్ట్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. కానీ, డైట్ కోక్ రుచి కాస్త డిఫరెంట్‌గా, లైట్‌గా ఉంటుంది. అందుకే కొంతమంది తమకు రెగ్యులర్ కోక్ టేస్టే కావాలనుకుని కోక్ జీరో వైపు మొగ్గు చూపితే.. డైట్ కోక్ అభిమానులు మాత్రం ఆ ప్రత్యేకమైన రుచినే ఇష్టపడతారు.

వాడే పదార్థాల్లో మార్పులు..

Advertisement

పైకి చూస్తే రెండింటిలోనూ షుగర్, క్యాలరీలు, ఫ్యాట్ ఏమీ ఉండవు. కానీ, వీటిని తయారుచేసే కెమికల్స్‌లో తేడాలు ఉన్నాయి. రెండింటిలోనూ అస్పర్టేమ్, ఎసిసల్ఫేమ్ కె లాంటి కృత్రిమ తీపి పదార్థాలు (ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్) వాడతారు. అయితే, కోక్ జీరోలో వీటితో పాటు ‘స్టెవియోల్ గ్లైకోసైడ్స్’ అనే మరో స్వీట్నర్, అలాగే అసిడిటీని కంట్రోల్ చేయడానికి సోడియం సిట్రేట్స్ కూడా వాడుతుంటారు.

Also Read: ఉప్పుకు ప్రత్యామ్నాయంగా పుట్టిన వంటకం.. అస్సామీల సాంప్రదాయ ‘కోలాఖార్’ రుచి చూశారా?

బరువు తగ్గుతారా.. పెరుగుతారా?

Advertisement

ఇలాంటి జీరో క్యాలరీ డ్రింక్స్ తాగితే బరువు తగ్గుతామని చాలామంది నమ్ముతారు. కానీ, పరిశోధకులు మాత్రం దీనిపై పెదవి విరుస్తున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణుల ప్రకారం.. ఇలాంటి డ్రింక్స్ తాగడం వల్ల శరీరానికి క్యాలరీలు అందకపోయినా, మెదడులో మరింత తీపి తినాలనే కోరిక పెరుగుతుందట. దీనివల్ల తెలియకుండానే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినే ప్రమాదం ఉంది. ఫలితంగా బరువు తగ్గడానికి బదులు పెరిగే అవకాశం కూడా ఉందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి.

ఆరోగ్యంపై వీటి ప్రభావం..

ఒక్క గ్రాము షుగర్ కూడా లేదు కదా అని వీటిని గుడ్డిగా నమ్మడానికి వీల్లేదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. ఇందులో వాడేవన్నీ ల్యాబ్‌లలో తయారుచేసిన కెమికల్స్, అల్ట్రా ప్రాసెస్డ్ పదార్థాలే. ఇవి లాంగ్ రన్‌లో మన జీర్ణవ్యవస్థపై, గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వీటి వల్ల క్యాన్సర్ రిస్క్, మెటబాలిక్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని కొందరు వైద్యులు చెప్తున్నప్పటికీ.. దీనిపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది.

రెండింటిలో ఏది బెస్ట్?

డైట్ కోక్, కోక్ జీరోలలో ఏది బెటర్ అనేది పూర్తిగా మీ వ్యక్తిగత రుచిపై ఆధారపడి ఉంటుంది. మీకు ఒరిజినల్ కోకాకోలా టేస్ట్ కావాలంటే కోక్ జీరో.. లేదు కాస్త లైట్ టేస్ట్ కావాలనుకుంటే డైట్ కోక్ ఎంచుకోవచ్చు. అయితే ఆరోగ్యం పరంగా చూస్తే మాత్రం.. రెండింటినీ పరిమితంగా తాగడమే ఎప్పుడైనా మంచిది.

Also Read: రెండూ ఒకటే అనుకుంటే పొరపాటే.. అరటిపండు-అరటికాయ మధ్య ఇంత తేడా ఉందా!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×