E-Paper
Advertisement

Avoid Almonds: ఈ సమస్యలు ఉన్నవారు బాదం పప్పులు తినకూడదని తెలుసా?

Avoid Almonds: ఈ సమస్యలు ఉన్నవారు బాదం పప్పులు తినకూడదని తెలుసా?
Advertisement

ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో బాదం పప్పులు ముఖ్యమైనవి.ప్రతిరోజూ కొన్ని బాదం గింజలు తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. గుండెకు మేలు జరుగుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్ E, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం వంటి పోషకాలూ లభిస్తాయి. అయితే అందరూ బాదం తినకూడదు. కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు వీటిని తినేముందు జాగ్రత్తగా ఉండాలి.
ఎవరు బాదం పప్పులు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు
కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి బాదం ప్రమాదకరమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వారికి బాదం ఏమాత్రం అనుకూలం కాదు. బాదంలో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల రాళ్లు మరింత పెరిగే ప్రమాదం ఉంది. రోజూ ఎక్కువ బాదం తింటే ఈ ప్రమాదం తీవ్రమవుతుంది. కాబట్టి కిడ్నీ సమస్యలున్నవారు బాదం పప్పులు పరిమితంగా తీసుకోవాలి.

Advertisement

అధిక రక్తపోటు ఉన్నవారు
అధిక రక్తపోటు ఉన్నవారు బాదం పప్పును తిన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బాదంలో పొటాషియం అధికంగా ఉంటుంది. రక్తపోటు మందులు వాడేవారిలో ఇది ఎలక్ట్రోలైట్ సమతుల్యతను ప్రభావితం చేయవచ్చు. అధిక పొటాషియం గుండె స్పందన మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటం వల్ల హైబీపీ ఉన్నవారు ఒకేసారి ఎక్కువ బాదం తినడం మంచిది కాదు.

జీర్ణ సమస్యలున్నవారు
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి బాదం పప్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్తి ఉన్నవారికి బాదంలో ఉన్న ఫైబర్ వల్ల ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యంగా నానబెట్టకుండా బాదం తినడం ఏమాత్రం మంచిది కాదు. ఇది జీర్ణ వ్యవస్థలకు భారం కలుగుతంది.

Advertisement

యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవారు
యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు ఉన్న వారికి బాదం పూర్తిగా ఆరోగ్యకరం కాదు. బాదంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఆమ్ల రిఫ్లక్స్‌ను మరింత పెంచే అవకాశం ఉంది. కొంతమందికి బాదం తిన్న తరువాత ఛాతీలో మంట వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అలెర్జీ ఉన్నవారు
కొంతమందికి బాదం లేదా ఇతర నట్‌లతో అలెర్జీ ఉంటుంది. అలాంటి వారు బాదం తింటే చర్మంపై దద్దుర్లు, గొంతు బిగుసుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ళు వాపు వంటి తీవ్రమైన అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి వారు పూర్తిగా దూరంగా ఉండడం మంచిది.

బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు
బాదం పప్పులు ఆరోగ్యకరం అయినప్పటికీ ఇందులో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఒక్క బాదం పప్పులోనే చాలా క్యాలరీలు ఉంటాయి. డైట్‌లో ఉన్నవారు బాదం పప్పును అధికంగా తింటే బరువు పెరిగిపోతారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×