E-Paper
Advertisement

AI Stethoscopes: ఏఐ స్టెతస్కోప్‌తో గుండె జబ్బులను ముందే పసిగట్టవచ్చు తెలుసా ?

AI Stethoscopes: ఏఐ స్టెతస్కోప్‌తో గుండె జబ్బులను ముందే పసిగట్టవచ్చు తెలుసా ?
Advertisement

AI Stethoscopes: గుండె సమస్యలు ప్రాణాంతకమైనవి. కానీ వీటిని ప్రాథమిక దశలో గుర్తించడం సవాలుతో కూడుకున్న పని. సాధారణంగా డాక్టర్లు వాడే సంప్రదాయ స్టెతస్కోప్‌లు అన్ని రకాల శబ్దాలను పట్టుకోలేవు. అయితే.. ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకారం, AI సాంకేతికతతో కూడిన డిజిటల్ స్టెతస్కోప్‌లు 94% నుంచి 98% ఖచ్చితత్వంతో గుండె సమస్యలను పసిగడుతున్నాయి. ఇవి మనిషి చెవికి వినబడని అతి సూక్ష్మమైన మార్పులను కూడా గుర్తించి, ప్రాథమిక స్థాయిలోనే రోగులను అప్రమత్తం చేయగలవు. ఇది మెడికల్  రంగంలో ఒక పెద్ద ముందడుగు.

మన శరీరంలో రక్త ప్రసరణను నియంత్రించే గుండె కవాటాలు సరిగ్గా పనిచేయకపోవడాన్ని ‘వాల్వ్యులర్ హార్ట్ డిసీజ్’ అంటారు. ఇది ప్రధానంగా రెండు రకాలు.

Advertisement

స్టెనోసిస్: కవాటాలు గట్టిపడటం వల్ల రక్త ప్రసరణకు అడ్డుపడటం.

రిగర్జిటేషన్ : కవాటాలు సరిగ్గా మూసుకోకపోవడం వల్ల రక్తం వెనక్కి లీక్ అవ్వడం.

Advertisement

వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా 75 ఏళ్లు పైబడిన వారిలో ఎనిమిది మందిలో ఒకరికి ఈ సమస్య ఉండే అవకాశం ఉంది. చాలా మందిలో లక్షణాలు తీవ్రమయ్యే వరకు బయటపడవు. అందుకే దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అని కూడా అంటారు.

AI స్టెతస్కోప్ ఎలా పనిచేస్తుంది?
సాధారణ స్టెతస్కోప్‌తో గుండె చప్పుళ్లను వినడం అనేది డాక్టర అనుభవంపై ఆధారపడి ఉంటుంది. కానీ AI స్టెతస్కోప్ అలా కాదు. పరిశోధకులు వేల సంఖ్యలో రోగుల గుండె చప్పుళ్లను ఎకోకార్డియోగ్రామ్ ఫలితాలతో కలిపి AI కి శిక్షణ ఇచ్చారు. దీని వల్ల.. గుండె చప్పుడులో వచ్చే అతి చిన్న మార్పులను కూడా ఈ సాఫ్ట్‌వేర్ పసిగట్టగలదు.

పరిశోధన ఫలితాలు:
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అమెరికాలోని ప్రముఖ వైద్య సంస్థలు నిర్వహించిన అధ్యయనాల్లో ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడయ్యాయి.

ఖచ్చితత్వం: AI సిస్టమ్ 98% తీవ్రమైన ‘అయోర్టిక్ స్టెనోసిస్’ కేసులను .. 94% ‘మిట్రల్ రిగర్జిటేషన్’ కేసులను కచ్చితంగా గుర్తించింది.

సెన్సిటివిటీ: సాధారణ స్టెతస్కోప్‌లు కేవలం 46% కేసులను మాత్రమే గుర్తించగలిగితే.. ఏఐ స్టెత స్కోప్‌లు 92.3% కేసులను గుర్తించాయి. అంటే సంప్రదాయ పద్ధతి కంటే ఇది రెండింతలు మెరుగ్గా పని చేస్తోంది.

Also Read: నిద్రలేమితో బాధపడుతున్నారా? మీ కడుపులో సమస్య ఉండొచ్చు!

డాక్టర్లకు సహాయకారి:
ఏఐ అనేది డాక్టర్లకు ప్రత్యామ్నాయం కాదు. ఒక శక్తివంతమైన ఆయుధం. ప్రాథమిక చికిత్స అందించే డాక్టర్లు బిజీగా ఉన్నప్పుడు లేదా క్లినికల్ వాతావరణంలో శబ్దాలు ఎక్కువగా ఉన్నప్పుడు గుండె గొణుగుడు వినడం కష్టమవుతుంది. అలాంటి సమయంలో ఏఐ సెన్సార్లు సెకన్ల వ్యవధిలోనే ఫలితాన్ని అందిస్తాయి. ఇది అనవసరమైన ఖరీదైన పరీక్షలను తగ్గిస్తుంది.అంతే కాకుండా నిజంగా అవసరమైన వారికి త్వరగా చికిత్స అందేలా చేస్తుంది.

పెరుగుతున్న వయసు, మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఏఐ ఆధారిత స్టెత స్కోప్‌లు తక్కువ ఖర్చుతో.. వేగంగా రోగ నిర్ధారణ చేయడానికి ఉపయోగ పడతాయి. ఇది భవిష్యత్తులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటు లోకి వస్తే.. ఎందరో ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×