E-Paper
Advertisement

నో జిమ్.. నో వెయిట్స్! కేవలం వాకింగ్‌తో మీ బాడీని సెట్ చేసుకోండి బాస్ !

నో జిమ్.. నో వెయిట్స్! కేవలం వాకింగ్‌తో మీ బాడీని సెట్ చేసుకోండి బాస్ !
Advertisement

Brisk Walking: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడం చాలా మందికి సవాలుగా మారింది. అంతే కాకుండా స్థూలకాయం, ఒత్తిడి, గుండె సంబంధిత సమస్యలు చిన్న వయసులోనే చుట్టుముడుతున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే.. జిమ్‌కు వెళ్లి భారీ బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు. కేవలం రోజుకు 30 నిమిషాల పాటు వేగంగా నడవడం అలవాటు చేసుకుంటే చాలు. మన శరీరానికి, మనసుకు ఇది అద్భుతమైన ఔషధంలా పని చేస్తుంది. వాకింగ్ వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

 వాకింగ్  ప్రయోజనాలు: 

Advertisement

చాలా మంది వ్యాయామం అంటే కేవలం జిమ్‌లో వర్కౌట్స్ చేయడం లేదా కఠినమైన యోగాసనాలు వేయడం అనుకుంటారు. కానీ.. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. వాకింగ్ అనేది అన్ని వయస్సుల వారికి సరిపోయే.. అత్యుత్తమ వ్యాయామం. ముఖ్యంగా రోజుకు 30 నిమిషాల వాకింగ్ మీ ఆయుష్షును పెంచుతుంది.

1. గుండె ఆరోగ్యం భద్రం:
మనం వేగంగా నడిచినప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, రక్త పోటు అదుపులోకి వస్తుంది. రోజూ వేగంగా వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం దాదాపు 30% తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

Advertisement

2. బరువు తగ్గడానికి ఈజీ :
జిమ్ కు వెళ్లే టైం లేని వారికి వాకింగ్ బెస్ట్ అనే చెప్పాలి. ఒక అరగంట వేగంగా నడిస్తే శరీరంలో సుమారు 150 నుంచి 200 క్యాలరీలు ఖర్చవుతాయి. మీరు తీసుకునే ఆహారంతో.. పాటు ఈ వాకింగ్‌ను కూడా తోడు చేస్తే.. నెల రోజుల్లోనే మీ శరీరంలో మార్పును గమనించవచ్చు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగడానికి నడక బాగా సహాయ పడుతుంది.

3. షుగర్ వ్యాధికి అడ్డుకట్ట:
డయాబెటిస్ లేదా మధుమేహంతో బాధ పడేవారికి వాకింగ్ చాలా బెస్ట్ అనే చెప్పాలి. నడవడం వల్ల కండరాలు రక్తంలోని గ్లూకోజ్‌ను సమర్థవంతంగా వినియోగించుకుంటాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉన్నవారు రోజూ నడిస్తే ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

Also Read:  సమ్మర్‌లో.. ఫ్రిజ్‌‌లోని నీళ్లు తాగడం ఎంత డేంజరో తెలుసా ?

4. మానసిక ప్రశాంతత – ఒత్తిడి దూరం:
నడక కేవలం శరీరానికే కాదు. మనసుకు కూడా మంచిది. నడుస్తున్నప్పుడు మన మెదడులో ‘ఎండార్ఫిన్లు’ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మనసును ఉల్లాసంగా ఉంచుతాయి. పొద్దున్నే స్వచ్ఛమైన గాలిలో నడవడం వల్ల ఆ రోజంతా హుషారుగా ఉంటుంది.

5. ఎముకలు, కండరాల బలం:
వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడటం సహజం. అయితే.. రోజూ నడవడం వల్ల కీళ్లు, ఎముకలు గట్టిపడతాయి. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడమే కాకుండా.. శరీరానికి మంచి ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది.  ఎముకలు, కండరాలు బలంగా ఉండాలని అనుకునే వారు వాకింగ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×