E-Paper
Advertisement

Ghee Benefits: ప్రతిరోజూ నెయ్యి తింటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు మీ దరిచేరవు!

Ghee Benefits: ప్రతిరోజూ నెయ్యి తింటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు మీ దరిచేరవు!
Advertisement

Ghee Benefits: చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతులో మంట వంటి సీజనల్ ఇన్ఫెక్షన్స్ నుంచి తప్పించుకోవాలంటే రోజూ ఒక చెంచా నెయ్యి తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే.. శీతాకాలంలో నెయ్యి తీసుకుంటే.. శరీరం లోపల నుంచి వెచ్చగా ఉంటుంది. దీంతో దగ్గు, జలుబు, ఫ్లూ లాంటి ఆరోగ్య సమస్యలు మీ దగ్గరికి కూడా రావు. నెయ్యిలో విటమిన్ ఏ, డి, ఈ, కే పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందిస్తాయి. దీంతో అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ క్రమంలో ప్రతిరోజూ ఒక చెంచా నెయ్యి తీసుకోవడం వలన కలిగే లాభాలు ఏమిటో చూద్దాం.

⇒ నెయ్యి మన జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడి జీర్ణక్రియ సజావుగా జరిగేలా చూస్తుంది. మలబద్ధకం సమస్య తగ్గడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నెయ్యి కలిపి తాగితే జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది.

Advertisement

Also Read: కంటి ఆరోగ్యాన్ని కాపాడే నల్లని ఎండు ద్రాక్ష.. ఆ సూపర్ బెనిఫిట్స్ ఏంటో మీరూ తెలుసుకోండి!

⇒ నెయ్యిలో విటమిన్ A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని రోగాల నుంచి కాపాడే శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా విటమిన్ A, E యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తాయి. దీని వల్ల కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.

Advertisement

⇒ ఎముకల ఆరోగ్యానికి నెయ్యి చాలా ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్న విటమిన్ K శరీరానికి కాల్షియం సరిగ్గా శోషించుకునేలా చేస్తుంది. దీని వల్ల ఎముకలు బలంగా మారుతాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎముకల సాంద్రత తగ్గకుండా కాపాడుకోవడంలో నెయ్యి సహాయపడుతుంది.

⇒ నెయ్యి శరీరానికి అవసరమైన తేమను అందిస్తుంది. దీనిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాన్ని మృదువుగా, సహజంగా మెరుస్తూ ఉంచుతాయి. అలాగే జుట్టు వేర్లను బలపరచి, చుండ్రు సమస్యను తగ్గించడంలో కీలకంగా పనిరచేస్తుంది.

⇒ అయితే నెయ్యి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ.. మితంగా తీసుకోవడం చాలా అవసరం. రోజుకు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్య ఆహారంతో పాటు సరైన పరిమాణంలో నెయ్యిని తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.

Also Read: నోటి పుండ్లు మహిళల్లోనే ఎందుకు ఎక్కువగా వస్తాయి? హార్మోన్లు, ఒత్తిడి, పోషకాహార లోపమే కారణమా?

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×