E-Paper
Advertisement

Coconut Milk: కొబ్బరిపాలతో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? తగ్గుతుందా? ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి!

Coconut Milk: కొబ్బరిపాలతో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? తగ్గుతుందా? ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి!
Advertisement

Coconut Milk: సాధారణ పాలను తాగడానికి ఇష్టపడని చాలామంది కొబ్బరి పాలను రోజూ తమ డైట్‌లో భాగం చేసుకుంటుంటారు. కొబ్బరి తురుము నుండి తీసే ఈ పాలు కేవలం రుచికరమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలకు నిలయం కూడా. ముఖ్యంగా ఇందులో ఉండే లారిక్ యాసిడ్, ట్రైగ్లిజరాయిడ్స్ శరీర జీవక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, వీటిని అమృతంలా భావించి అతిగా తీసుకుంటే మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గుండె ఆరోగ్యానికి తోడ్పాటు:

కొబ్బరిపాలు తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్(HDL) పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దాదాపు 8 వారాల పాటు పరిమితంగా కొబ్బరిపాలను ఆహారంలో భాగం చేసుకున్న వారిలో మంచి కొలెస్ట్రాల్ 18 శాతం వరకు పెరిగినట్లు పరిశోధనలు వెల్లడించాయి. ఇది గుండె జబ్బుల ముప్పును తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

Advertisement

Also Read: విటమిన్ B12 లోపాన్ని గుర్తిండమెలా? ఈ సమస్య తగ్గాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?

అతిగా తీసుకుంటే ముప్పే:

మంచి చేస్తుంది కదా అని కొబ్బరిపాలను ఎక్కువగా తీసుకుంటే రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. వీటిలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అతిగా తీసుకోవడం వల్ల శరీర బరువు పెరగడంతో పాటు, చెడు కొలెస్ట్రాల్(LDL) కూడా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. అందుకే కొబ్బరిపాలను ఆహారంలో ఒక భాగంగా మాత్రమే చూడాలి తప్ప, ప్రధాన ఆహారంగా తీసుకోకూడదు.

జీర్ణక్రియకు మేలు:

Advertisement

కొబ్బరిపాలు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. అయితే, బయట దొరికే ప్యాక్ చేసిన, చక్కెర కలిపిన కొబ్బరిపాల కంటే.. ఇంట్లో తయారు చేసుకున్న తాజా పాలను తాగటం ఉత్తమం.

ఎలా తీసుకోవాలి?

కొబ్బరిపాలను నేరుగా తాగడం కంటే కూరలు, సూప్‌లు లేదా స్మూతీల్లో పాలకు బదులుగా వాడుకోవడం మంచి పద్ధతి. రోజుకు కొన్ని టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.

Also Read: గుడ్డులోని పచ్చసొన తింటే గుండెపోటు వస్తుందా? అసలు నిజం ఏంటంటే?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×