E-Paper
Advertisement

Stair Workout: జిమ్‌ అవసరం లేదు.. రోజూ మెట్లు ఎక్కితే చాలు, ఫిట్‌నెస్ ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు!

Stair Workout: జిమ్‌ అవసరం లేదు.. రోజూ మెట్లు ఎక్కితే చాలు, ఫిట్‌నెస్ ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు!
Advertisement

Stair Workout: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ సవాలుతో కూడుకున్న పని. ముఖ్యంగా ఊబకాయం సమస్య రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో చాలామంది బరువు తగ్గడానికి అనేక మార్గాలను వెతుకుతున్నారు. అయితే ఈ బిజీ లైఫ్‌లో జిమ్‌‌కు వెళ్లడం, కఠినమైన డైట్‌లు పాటించడం, క్రమశిక్షణతో కూడిన వ్యాయామాలు చేయడం అందరికీ సాధ్యపడటం లేదు. అందుకే సులభంగా చేయగలిగేలా.. ప్రభావవంతమైన ఒక వ్యాయామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్న అలవాటు-పెద్ద మార్పు:

ఇంట్లోనైనా, అపార్ట్‌మెంట్‌లోనైనా మెట్లు అందరికీ సులభంగా అందుబాటులో ఉంటాయి. లిఫ్ట్‌కి అలవాటు పడిపోయిన మనం.. మెట్లు ఎక్కడం అనే అలవాటును మళ్లీ జీవితంలోకి తీసుకొస్తే ఆరోగ్యంలో మంచి మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మెట్లు ఎక్కడం అనేది సాధారణమైన చర్యలా అనిపించినా, శరీరంపై దాని ప్రభావం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది.

Advertisement

Read Also: శరీర రంగును మార్చే సత్తా సబ్బుకు ఉందా?.. నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే!

కండరాలకు బలం:

మెట్లు ఎక్కడం శరీరంలోని పలు కండరాలను ఒకేసారి పనిచేసేలా చేస్తుంది. ముఖ్యంగా కాళ్లు బలంగా మారుతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు క్రమంగా తగ్గుతుంది. సాధారణ నడకతో పోలిస్తే.. మెట్లు ఎక్కడం అనేది శక్తిని ఖర్చు చేసే వ్యాయామం. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి, చురుకుదనం పెంచుకోవాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.

రోజుకు 30 నిమిషాలు:

Advertisement

కొన్ని అధ్యయనాల ప్రకారం.. కేవలం ఆరు నిమిషాల పాటు కంటిన్యూగా మెట్లు ఎక్కడం వలన శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నాయి. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవాళ్లు రోజుకు సుమారు 30 నిమిషాలు మెట్లు ఎక్కే అలవాటు చేసుకుంటే.. 250 నుంచి 300 కేలరీల వరకు ఖర్చు చేయొచ్చు.

లిఫ్ట్‌కు బదులు మెట్లు:

ప్రత్యేకంగా వ్యాయామానికి సమయం కేటాయించలేని బిజీ వ్యక్తులు, రోజువారీ పనుల్లో భాగంగా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకుంటే.. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీనికోసం లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎంచుకోవాలి. ఇది చిన్న మార్పులా కనిపించినా.. దీర్ఘకాలంలో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Read Also: శరీరంలో నీరు తగ్గితే ఈ ప్రమాదాలు తప్పవు.. రోజుకు ఎంత నీరు తాగాలో తెలుసా?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×