E-Paper
Advertisement

Summer Tips: దీని ముందు ఏ రిఫ్రిజిరేటర్ అయినా వేస్టే..

Summer Tips: దీని ముందు ఏ రిఫ్రిజిరేటర్ అయినా వేస్టే..
Advertisement

summer hydration tips: సమ్మర్ వచ్చేసింది..ఇంకేం అందరూ ఫ్రిజ్ డోర్లు తెరిచి ఐస్ నీళ్ల కోసం ఎగబడటం కామన్. కానీ ఆ ఐస్ నీళ్లు మీ గొంతును గీరేస్తాయని , మీ జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తాయని మీకు తెలుసా? అందుకే అందుకే మన పాత కాలం నాటి ‘దేశీ ఫ్రిజ్’ అదేనండీ మట్టి కుండ ఇపుడు మళ్ళీ ట్రెండ్ లోకి వచ్చేసింది. ఒక్కసారి ఆ కుండలో నీళ్లు తాగితే వచ్చే ఆ తృప్తి, ఆ మట్టి వాసన.. ఏ బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్ కూడా ఇవ్వదంటే నమ్మండి. మరి అసలు ఆ కుండ నీళ్లు ఎందుకు తాగాలో, దాన్ని ఎలా ‘మెయింటైన్’ చేయాలో ఓసారి చూసేద్దామా  !

అలా చేస్తే కుండ త్వరగా పగిలిపోతుంది

 మన దగ్గర చాలా మంది  కుండ కొన్న వెంటనే ఏం చేస్తారో తెలుసా ..నీళ్లు పోసేస్తారు. కాని అలా అస్సలు చేయకూడదు. అలా చేస్తే కుండ త్వరగా పగిలిపోతుంది. అందుకే  కొత్త కుండను కనీసం ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి.దీంతో మట్టి వాసన పోయి, కుండ గట్టిపడుతుంది.ఇక కుండలో గంజి నీళ్లు పోసి, ఒక మూడు రోజుల పాటు రోజుకోసారి మారుస్తూ ఉంటే.. కుండకు పగుళ్లు అనేవే రావు, పైగా  నీళ్లు ఐస్ లా చల్లగా ఉంటాయి కూడా.

Advertisement

also read:Palm Toddy vs Date Toddy: తాటికల్లు Vs ఈతకల్లు:ఏది తాగితే మీ బాడీ ఏసీలా మారుతుందో తెలుసా!

మీ డైజేషన్ పవర్ పెంచేస్తుంది

 ఇక మట్టి కుండకు ఉండే లక్షలాది చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా నీరు ఆవిరవుతూ, లోపల ఉన్న నీటిని సహజంగానే  చల్లబరుస్తాయి. ఇది గొంతుకు అస్సలు హాని చేయదు. పైగా మట్టిలో ఉండే క్షార (Alkaline) గుణం నీటిలోని ఆమ్లత్వాన్ని తగ్గించి, మీ డైజేషన్ పవర్ పెంచేస్తుంది.పైగా ఇది ప్లాస్టిక్ బాటిల్స్ లాగా  భూమికి హాని చేయదు.ఇక  కరెంటు బిల్లు అసలే పడదన్నది చెప్పక్కర్లేదేమో !

ఎట్టి పరిస్థితుల్లో అలా చేయొద్దు

Advertisement

 ఇక చాలా మంది చేసే మరో తప్పు ఏంటో తెలుసా ..మట్టి కుండను క్లిన్ చేయడానికి సబ్బు లేదా డిటర్జెంట్ తెగ వాడేస్తారు.ఎట్టి పరిస్థితుల్లో అలా చేయొద్దు. అందుకంటే ఆ కెమికల్స్ కుండ రంధ్రాల్లోకి వెళ్లి నీటి రుచిని మార్చేస్తాయి.సో బియ్యప్పిండి, శనగపిండి లేదా నిమ్మతొక్కతో నీట్ గా క్లీన్ చేసి గోరువెచ్చని నీళ్లతో కడిగి నీడలో ఆరబెట్టాలి. ఎందుకంటే  ఎండలో పెడితే పగుళ్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇక కుండలో నీళ్లు పోసిన తర్వాత కుండ చుట్టూ ఒక తడి గోనె సంచిని గానీ, కాటన్ వస్త్రాన్ని గానీ చుట్టి గాలి బాగా తగిలే చోట ఉంచండి. అలా చేస్తే మీ ఫ్రిజ్ కంటే వేగంగా నీళ్లు చల్లబడటం పక్కా !

నీళ్లు ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటాయి

 ఇక కుండలో నాచు పట్టకుండా ఉండాలంటే వారానికి ఒకసారి ఉప్పు లేదా నిమ్మరసంతో  గరుకుగా ఉండే కొబ్బరి పీచుతో రుద్ది, గోరువెచ్చని నీళ్లతో రుద్ది కడగాలి. ఇలా చేస్తే నీళ్లు ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటాయి.సో స్టైల్ కోసం ఫ్రిజ్ నీళ్లు తాగి హెల్త్ పాడుచేసుకోకుండా  ఈ సమ్మర్ లో మట్టి కుండను నమ్ముకోండి..మీ  బాడీని కూల్ అండ్ హెల్తీగా ఉంచుకోండి!

also read:దురంధర్ 2 మాయలో పడి చేతులు కాల్చుకుంటావా జక్కన్నా ?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×