E-Paper
Advertisement

Christmas 2025: క్రిస్మస్ స్పెషల్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే 5 రకాల టేస్టీ కేకులివే!

Christmas 2025: క్రిస్మస్ స్పెషల్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే 5 రకాల టేస్టీ కేకులివే!
Advertisement

Christmas 2025: డిసెంబరు నెల చివరి దశకు రాగానే.. ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడే కనిపిస్తుంటుంది. వీధులు, ఇల్లు రంగురంగుల లైట్లతో జిగేల్ జిగేల్ మంటూ మెరుస్తుంటాయి. అలాగే కుటుంబ సభ్యులు,స్నేహితులతో గడిపే మధురమైన క్షణాలు, రుచికరమైన వంటకాలతో మన చుట్టూ పండగ వాతావరణం అలుముకుంటుంది. ఈ ఆనందానికి మరింత మధురతను చేకూర్చేది ఏదైనా ఉందంటే.. అది క్రిస్మస్ కేక్ మాత్రమే. అసలు కేక్ లేకుండా క్రిస్మస్‌ను ఊహించుకోగలమా చెప్పండి! అయితే ఈసారి కేక్ కోసం బేకరీల చుట్టూ తిరగకుండా.. ఇంట్లోనే చాలా సులభంగా, తక్కువ ఖర్చుతో  తయారు చేసుకోగల ఐదు రకాల కేక్ ఐడియాలు మీ కోసం..

క్రిస్మస్ ప్లమ్ కేక్:

క్రిస్మస్ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది ప్లమ్ కేక్. ఇది పండుగలలో సంప్రదాయంగా తయారు చేసే కేక్. డ్రై ఫ్రూట్స్, నట్స్‌తో చాలా కలర్‌ఫుల్‌గా తయారయ్యే ఈ కేక్‌ను ఆల్కహాల్‌తో లేదా ఆల్కహాల్ లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారుచేస్తే రుచి కూడా ఎక్కువగా ఉంటుంది, ఖర్చు కూడా తక్కువే.

వైట్ చాక్లెట్ చీజ్ కేక్:

Advertisement

మృదువైన టెక్చ్సర్, స్వీట్ టేస్ట్‌తో వైట్ చాక్లెట్ కేక్ అందరినీ ఆకట్టుకుంటుంది. చీజ్ కేక్‌లలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫ్లేవర్‌ను ఎంచుకుని, క్రిస్మస్ రోజున ప్రత్యేకంగా ఆస్వాదించవచ్చు.

మార్బుల్ కేక్:

నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే మార్బుల్ కేక్‌ను చిన్న పిల్లల దగ్గరి నుంచి ఏ వయసు వారైనా ఇష్టపడతారు. వెనిల్లా, కోకో, చాక్లెట్ ఫ్లేవర్లు కలిపి ఈ కేక్‌ను తయారు చేస్తారు. గుడ్లు అవసరం లేకుండానే చేయగలిగే ఈ కేక్ భోజనం తర్వాత డెజర్ట్‌గా అద్భుతంగా ఉంటుంది.

రిచ్ చాక్లెట్ కేక్:

Advertisement

చాక్లెట్ కేక్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇది ఫేవరెట్ స్వీట్. క్రిస్మస్ సందర్భంగా పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా తయారు చేయాలనుకుంటే.. ఈ రిచ్ చాక్లెట్ కేక్ బెస్ట్ ఆప్షన్. దీనిని చూడగానే వారి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది.

చాక్లెట్ బనానా కేక్:

సాధారణంగా చాక్లెట్ కేక్ తయారీ విధానం చాలా కష్టం అనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ నిజానికి చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. అరటిపండ్లు, పీనట్ బట్టర్, కోకో పౌడర్ వంటి సాధారణ పదార్థాలతో నోరూరించే చాక్లెట్ బనానా కేక్ సిద్ధం చేయవచ్చు.

ఈ క్రిస్మస్‌కు బయట దొరికే చిరుతిళ్లకు బదులుగా ఇంట్లోనే కేక్‌లు తయారు చేసుకుంటే, రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అలాగే మీ చేతులతో తయారైన కేక్‌తో పండుగ ఆనందాన్ని మరింత పెంచుకునే అవకాశమూ దొరికినట్లు అవుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×