E-Paper
Advertisement

Chilli Paneer Recipe: చైనీస్ స్టైల్‌లో చిల్లి పనీర్ రెసిపీ, దీన్ని ఎలా చేయాలంటే

Chilli Paneer Recipe: చైనీస్ స్టైల్‌లో చిల్లి పనీర్ రెసిపీ, దీన్ని ఎలా చేయాలంటే
Advertisement

ఇండో చైనీస్ వంటకాల్లో చిల్లి పనీర్ ఒకట. రెస్టారెంట్‌లలో ఎక్కువగా ఆర్డర్ చేసే ఈ స్టార్టర్ కూడా ఇదే. పనీర్‌తో చేసే ఈ డిష్ టేస్టీగా ఉండటమే కాదు..ప్రోటీన్ కూడా అందిస్తుంది. దీన్ని చాలా సులువుగా ఇంట్లోనే వండేయచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ నచ్చే ఈ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకోండి.

చిల్లి పనీర్ కు కావాల్సిన పదార్థాలు
పనీర్ ముక్కలు– 250 గ్రాములు
మైదా – 3 టేబుల్ స్పూన్లు
మొక్కజొన్న పిండి – రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
మిర్చి పొడి లేదా బ్లాక్ పెప్పర్ – కొద్దిగా
పచ్చిమిర్చి – 3 లేదా 4
ఉల్లిపాయ – ఒకటి పెద్దది
క్యాప్సికం – ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
సోయా సాస్ – ఒక టేబుల్ స్పూన్
చిల్లీ సాస్ – ఒక టేబుల్ స్పూన్
టమోటా సాస్ – ఒక టేబుల్ స్పూన్
నూనె – వేయించేందుకు సరిపడా
స్ప్రింగ్ ఆనియన్స్ – రెండు స్పూన్లు తరుగు

Advertisement

Also read: Ginger Prawns: జింజర్ ప్రాన్స్.. ఇలా చేస్తే ప్లేటు ఖాళీ అవ్వాల్సిందే, రెసిపీ ఇదిగో

చిల్లి పనీర్ తయారీ విధానం
1. ముందుగా ఒక గిన్నెలో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. అందులో కొద్దిగా నీరు పోసి ముద్దలేకుండా గట్టిగా కాకుండా అలాగని పలుచగా కాకుండా కలుపుకోవాలి.
2. ఇప్పుడు పనీర్ ముక్కలను ఈ మిశ్రమంలో వేసి మ్యారినేట్ చేయాలి. స్టవ్ పై ఒక కళాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి.
3. నూనె వేడయ్యాక పనీర్ ముక్కలను నెమ్మదిగా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వేయించిన పనీర్‌ను పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు మరో కళాయి తీసుకుని రెండు స్పూన్లు నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.
5. మంచి వాసన వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికం పెద్ద ముక్కలు వేసి వేయించాలి.
6. ఇప్పుడు సోయా సాస్, చిల్లీ సాస్, టమోటా సాస్ వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు.
7. ఈ సాస్‌లో ముందుగా వేయించిన పనీర్ ముక్కలను వేసి రెండు మూడు నిమిషాలు బాగా కలపాలి.
8. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన చిల్లీ పనీర్ రెడీ అయినట్టే.

Advertisement

చిల్లీ పనీర్ నుస్టార్టర్‌గా గానీ, సైడ్ డిష్‌గా తినవచ్చు. వెజ్ ఫ్రైడ్ రైస్, నూడుల్స్, షెజ్వాన్ రైస్‌తో కాంబినేషన్ అదిరిపోతుంది. ఇంట్లో అతిథులు వచ్చినప్పుడు లేదా పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా ఇవ్వడానికి ఇది మంచి ఎంపిక. పనీర్ ఎక్కువగా వేయించకూడదు. అలా చేస్తే గట్టిగా మారుతుంది. గ్రేవీ కావాలంటే చివర్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ నీటిలో కలిపి పోసుకోవచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×