E-Paper
Advertisement

Chicken Rasam: చలికాలంలో వేడి వేడి చికెన్ రసం, దీన్ని ఇలా వండేయండి

Chicken Rasam: చలికాలంలో వేడి వేడి చికెన్ రసం, దీన్ని ఇలా వండేయండి
Advertisement

చికెన్ సూపు తాగే ఉంటారు.. అన్నంలో కలుపుకునేందుకు చికెన్ రసం కూడా వండుకోవచ్చు. ఇది మంచి రుచితో తినాలనిపించేలా ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రసంలో చిన్న చిన్న చికెన్ ముక్కలు కూడా వేస్తాము. కాబట్టి అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇక చికెన్ రసం రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

చికెన్ రసం రెసిపీకి కావలసిన పదార్థాలు
చికెన్ ముక్కలు – 300 గ్రాములు
ఉల్లిపాయ – ఒకటి
టమోటాలు – రెండు
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి – నాలుగు రెబ్బలు
మిరియాలు – నాలుగు
జీడిపప్పులు – గుప్పెడు
జీలకర్ర – ఒక స్పూన్
కరివేపాకులు – గుప్పెడు
పసుపు – అర స్పూను
కారం – ఒకటిన్నర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – రెండు లీటర్లు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

Advertisement

చికెన్ రసం రెసిపీ
1. చికెన్ ముక్కలను చిన్న ముక్కలుగా కత్తిరించి నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు మిక్సీలో మిరియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి అందులో నీరు వేయాలి.
4. ఆ నీరు వేడెక్కాక చికెన్ ముక్కలు ఉల్లిపాయలు తరుగు, టమోటో తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా ఉడికించాలి.
5. చికెన్ బాగా సాఫ్ట్ గా ఉడికే వరకు ఉంచాలి. ఆ తర్వాత ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ ను కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి.
6. ఉప్పు, పసుపు, కారం కూడా వేసి బాగా కలపాలి. ఇది రసం లాగా మందంగా అయ్యేవరకు ఉంచాలి.
7. తర్వాత కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.
8. అవసరమైతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. టేస్టీ చికెన్ రసం రెడీ అయినట్టే.
9. దీన్ని సూప్ లాగా డైరెక్ట్ గా తాగినా కూడా అద్భుతంగా ఉంటుంది. లేదా అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది.

వేడివేడి అన్నంలో ఈ చికెన్ రసం కలుపుకొని తిని చూడండి. ఆ రుచి మర్చిపోలేరు. మీకు మిరియాల ఘాటు కావాలంటే మరి కొంచెం ఎక్కువగా మిరియాలను వేసుకుంటే సరిపోతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×