E-Paper
Advertisement

రోజూ ఉదయాన్నే కరివేపాకు నమిలితే జరిగే అద్భుతం ఇదే!

రోజూ ఉదయాన్నే కరివేపాకు నమిలితే జరిగే అద్భుతం ఇదే!
Advertisement

Curry Leaves Benefits: మన వంటగదిలో కరివేపాకు లేని పోపును ఊహించలేము. కేవలం సువాసన కోసమే అనుకుని చాలామంది తినేటప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తుంటారు. కానీ, ఆ చిన్న ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. రోజూ ఉదయాన్నే పరగడుపున కొన్ని తాజా కరివేపాకులను నమలడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పోషకాల గని:

కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి, ఇ లతో పాటు ఐరన్, కాల్షియం, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. కణాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ దీన్ని తీసుకోవడం వల్ల సహజంగానే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

Advertisement

Also Read: ఏంటీ.. పానీపూరి తింటే బరువు తగ్గుతారా? నిపుణులు చెబుతున్న ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే..

జుట్టు సంరక్షణకు వరం:

చాలామంది జుట్టు రాలడం, చుండ్రు సమస్యలతో బాధపడుతుంటారు. కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్, ప్రోటీన్లు జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా.. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడకుండా (అకాల నరపు) కాపాడుకోవచ్చు.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది:

Advertisement

గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి కరివేపాకు ఒక మంచి ఔషధం. ఇది జీర్ణ ఎంజైములను ప్రేరేపించి తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. మజ్జిగలో కరివేపాకు వేసుకుని తాగినా లేదా పరగడుపున నమిలినా కడుపులో అసౌకర్యం తగ్గి జీర్ణవ్యవస్థ సాఫీగా సాగుతుంది.

షుగర్, గుండె ఆరోగ్యానికి:

కరివేపాకులోని కొన్ని ప్రత్యేక గుణాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. అలాగే, ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె, కాలేయం (లివర్) పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యం మన సొంతం అవుతుంది.

Also Read: వావ్.. వాషింగ్ మిషన్లలో ఈ రేంజ్ AI టెక్నాలజీనా? బట్టలు ఉతకడం, ఆరబెట్టడం ఇక చిటికెలోనే!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×