E-Paper
Advertisement

Summer Morning Drinks: డీహైడ్రేషన్‌కు చెక్.. సమ్మర్‌లో ఖాళీ కడుపుతో తీసుకోవాల్సిన బెస్ట్ డ్రింక్స్

Summer Morning Drinks: డీహైడ్రేషన్‌కు చెక్.. సమ్మర్‌లో ఖాళీ కడుపుతో తీసుకోవాల్సిన బెస్ట్ డ్రింక్స్
Advertisement

Summer Morning drinks: ఎండలు ముదురుతున్న కొద్దీ శరీరంలో వేడి పెరిగి నీరసం, అలసట రావడం సహజం. మన శరీరం సుమారు 70% నీటితో నిర్మితమై ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే మనం తీసుకునే మొదటి డ్రింక్ మన జీర్ణక్రియను , శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది. రాత్రంతా నిద్రపోయిన తర్వాత మన శరీరం స్వల్పంగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమయంలో కెఫీన్ ఉన్న కాఫీ, టీలకు బదులుగా సహజసిద్ధమైన చలువ చేసే డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా.. టాక్సిన్స్ బయటకు పోతాయి.

శరీరాన్ని చల్లబరిచే బెస్ట్ మార్నింగ్ డ్రింక్స్:

Advertisement

1. సబ్జా గింజల నీరు:
సబ్జా గింజలు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన కూలెంట్. ఇవి శరీర ఉష్ణోగ్రతను వెంటనే తగ్గించగలవు.

తయారీ: ఒక స్పూన్ సబ్జా గింజలను రాత్రి లేదా తాగడానికి 15 నిమిషాల ముందు నీటిలో నానబెట్టాలి.

Advertisement

ప్రయోజనం: ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుండెల్లో మంటను తగ్గిస్తాయి. అంతే కాకుండా శరీరానికి అవసరమైన ఫైబర్‌ను అందిస్తాయి.

2. రాగి అంబలి :
రాగులు చలవ చేయడంలో నెంబర్ వన్.గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ దీనినే ఎండాకాలం అమృతంగా భావిస్తారు.

తయారీ: రాగి పిండిని నీళ్లలో ఉడికించి.. చల్లారిన తర్వాత అందులో మజ్జిగ, కొద్దిగా ఉప్పు కలిపి తాగాలి.

ప్రయోజనం: ఇది కేవలం చలువ చేయడమే కాకుండా.. శరీరానికి కావాల్సిన కాల్షియం, ఐరన్‌ను అందిస్తుంది. రోజంతా ఆకలి వేయకుండా శక్తిని ఇస్తుంది.

3. కొబ్బరి నీళ్లు:
ప్రకృతి సిద్ధమైన ఎలక్ట్రోలైట్స్ కొబ్బరి నీళ్లలో పుష్కలంగా ఉంటాయి.

ప్రయోజనం: ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని పీహెచ్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతే కాకుండా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

4. సోంపు గింజల నీరు:
సోంపు గింజలు చలువ చేయడమే కాకుండా జీర్ణకోశ సమస్యలను దూరం చేస్తాయి.

తయారీ: ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ సోంపు వేసి రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగాలి.

ప్రయోజనం: ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా నోటి దుర్వాసనను నివారిస్తుంది.

5. జీరా, ధనియాల కషాయం:
జీలకర్ర , ధనియాలు రెండూ చలువ చేసే గుణం కలిగినవే.

తయారీ: ఒక గ్లాసు నీటిలో అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ధనియాలు వేసి మరిగించి.. చల్లారిన తర్వాత వడకట్టి తాగాలి.

ప్రయోజనం: ఇది మెటబాలిజంను పెంచుతుంది. అంతే కాకుండా ఎండ వల్ల వచ్చే కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

Also Read: సమ్మర్‌ బెస్ట్ డ్రింక్స్.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం

6. పుదీనా , నిమ్మరసం:
పుదీనా ఆకులు సహజంగానే మనల్ని రీఫ్రెష్ చేస్తాయి.

తయారీ: గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, పుదీనా ఆకుల రసం కలిపి తాగాలి.

ప్రయోజనం: ఇది లివర్‌ను శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా శరీరానికి విటమిన్ సి అందించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఎండాకాలంలో మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం, నీటిపైనే ఆధారపడి ఉంటుంది. పైన పేర్కొన్న డ్రింక్స్ లో మీకు నచ్చిన దానిని మీ లైఫ్‌లో భాగం చేసుకోండి. ముఖ్యంగా చక్కెర కలిపిన డ్రింక్స్ కు బదులుగా సోడాలకు దూరంగా ఉండండి. సహజమైన డ్రింక్స్‌తో మీ శరీరాన్ని లోపలి నుంచి చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×