E-Paper
Advertisement

మీ జీవిత భాగస్వామికి నాలుగు లక్షణాలు తప్పదు, జీవితాంతం పశ్చాత్తాపం తప్పదా? చాణక్యుడి సలహాలు

మీ జీవిత భాగస్వామికి నాలుగు లక్షణాలు తప్పదు, జీవితాంతం పశ్చాత్తాపం తప్పదా? చాణక్యుడి సలహాలు
Advertisement

Chanakya Niti: దేశంలో అసలే అమ్మాయిలు దొరక్క పెళ్లికాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతోంది. ఆపై చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు. పెద్దలకు తెలియకుండా మన జీవిత భాగస్వామిని మనమే ఎంపిక చేసుకుంటున్న ప్రస్తుత రోజుల్లో కేవలం నాలుగు లక్షణాలు ఉండాలి. లేకుంటే జీవితాంతం పశ్చాత్తాపపడవలసి రావచ్చని చాణక్య నీతి చెబుతోంది.

జీవిత భాగస్వామి విషయంలో చాణక్యుడి సలహాలు

చాణక్యుని గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ ఈ నేతలు, కుటుంబసభ్యులు ఆయన మార్గదర్శకంలో నడుస్తారు.. ఆయన చెప్పిన సూచనలు-సలహాలు పాటిస్తుంటారు కూడా. పరిపూర్ణమైన జీవిత భాగస్వామి ఎంపిక చేసుకుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకునే ముందు ఆచార్య చాణక్యుని నుండి ఈ నాలుగు ముఖ్యమైన విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. దానివల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా అడుగులు వేయవచ్చు. ఫలితంగా వైవాహిక జీవితాన్ని ఆహ్లాదకరంగా, సంతోషంగా, ఒత్తిడి లేకుండా చేసుకోవచ్చు.

Advertisement

ఆ పొరపాటు చేయవద్దు

కష్టసుఖాల్లో తోడుగా నిలిచే భాగస్వామి లేకుంటే ఆ వ్యక్తి జీవిత ప్రయాణం అసంపూర్ణం. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు. రెండు కుటుంబాలు-రెండు జీవితాల కలయిక. జీవిత భాగస్వామిని ఎంచుకొనేటప్పుడు ప్రజలు తరచుగా అందానికి లేకుంటే ఆర్థిక స్థితికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఇచ్చే రోజులు కూడా. ఆచార్య చాణక్యుని ప్రకారం అదొక పెద్ద పొరపాటు కావచ్చు.

Advertisement

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి అనే గ్రంథంలో జీవిత భాగస్వామికి ఉండవలసిన గుణాలను వివరించారు. మీరు కూడా తగిన భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే ఈ నాలుగు విషయాలను గుర్తుంచుకోండి. ఈ గుణాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో పశ్చాత్తాపానికి దారి తీసే అవకాశం ఉంది.

ఈ సూత్రాలు గుర్తు పెట్టుకోవాలి

1. అందం అనేది కాలంతోపాటు క్షీణిస్తుంది. కానీ విలువలు శాశ్వతంగా నిలిచి ఉంటాయని బలంగా నమ్మిన వ్యక్తి చాణక్యుడు. జీవిత భాగస్వామి సంబంధాల పరిమితులను అర్థం చేసుకుని కుటుంబ విలువలను నిలబెట్టాలని ప్రస్తావించారు. స్వచ్ఛమైన వ్యక్తి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కుటుంబాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుతారు.

2. జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోవడం సహజం. ఆచార్య చాణక్యుని మాటల ప్రకారం.. జీవిత భాగస్వామికి సహనం ఉండటం చాలా ముఖ్యమన్నారు. వివేకం-సహనం ఉన్న భాగస్వామి కష్ట సమయాల్లో భర్తకు అండగా నిలవడమే కాకుండా తమ తెలివితేటలతో కుటుంబ సమస్యలను పరిష్కరించగలరని ప్రస్తావించారు. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకునేవారు తరచుగా పశ్చాత్తాపం పడతారని పేర్కొన్నారు.

3. వ్యక్తి మధురమైన మాటలు, మంచి స్వభావం వారి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయన్నది చాణక్యుడి మాట. మధురంగా ​​మాట్లాడే మహిళలు ఎవరి హృదయాలనైనా గెలుచుకుంటారు. మృదుభాషి అయిన జీవిత భాగస్వామి ఇంటికి శాంతిని, సంతోషాన్ని తీసుకువస్తారు. కఠినంగా మాట్లాడే భాగస్వామి కుటుంబ వాతావరణాన్ని దెబ్బతీసి మానసిక ఒత్తిడిని పెంచుతారు.

4. మరొక కీలకమైన పాయింట్. ధర్మం-విధులకు విశ్వసనీయంగా ఉండే వారే ఉత్తమ భాగస్వామి అవుతారని పేర్కొన్నారు. తమ బాధ్యతలను అర్థం చేసుకుని వాటిని పూర్తి నిజాయితీతో నెర వేర్చేవారితో కలిసి జీవించడం సులభం, ఆపై ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×