E-Paper
Advertisement

Causes Of Back Pain: గంటల కొద్దీ కూర్చోవడం.. శరీరానికి స్లో పాయిజన్ లాంటిదా?

Causes Of Back Pain: గంటల కొద్దీ  కూర్చోవడం.. శరీరానికి స్లో పాయిజన్ లాంటిదా?
Advertisement

Causes Of Back Pain: ప్రస్తుత లైఫ్ స్టైల్ మనకు సౌకర్యాలను అందించినప్పటికీ.. ఆరోగ్యపరంగా ముఖ్యంగా వెన్నెముకకు తీరని నష్టాన్ని కలిగిస్తోంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, స్మార్ట్‌ఫోన్లు వాడటం మన శరీర ఆకృతిని దెబ్బతీస్తున్నాయి. ప్రముఖ న్యూరో సర్జన్లు హెచ్చరిస్తున్నట్లుగా.. మన “డెస్క్ లైఫ్” వెన్నునొప్పి, మెడ బిగుసుకుపోవడం, వెన్నెముక సమస్యలకు ప్రధాన కారణమవుతోంది. ఈ అలవాట్లను మార్చుకోకపోతే.. దీర్ఘకాలిక వైకల్యానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుత కాలంలో దాదాపు 70-80 శాతం ఉద్యోగాలు కంప్యూటర్ ఆధారితమైనవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే చోట కూర్చోవడం వల్ల శరీర కదలికలు తగ్గిపోతున్నాయి. న్యూరో సర్జన్ల ప్రకారం..మన శరీరం గంటల తరబడి కదలకుండా కూర్చోవడానికి అతగా సహకరించదు. దీని వల్ల కలిగే ప్రధాన నష్టాలు ఇవే..

Advertisement

1. మెడ బిగుసుకుపోవడం :
మనం సిస్టమ్ చూస్తున్నప్పుడు లేదా ఫోన్ వాడుతున్నప్పుడు మెడను ముందుకు వంచుతాము. దీనిని “టెక్ నెక్” అంటారు. సాధారణంగా మన తల బరువు 5 కేజీలు ఉంటుంది. కానీ మెడను 60 డిగ్రీల కోణంలో వంచినప్పుడు, వెన్నెముకపై సుమారు 27 కేజీల ఒత్తిడి పడుతుంది. ఇది మెడ కండరాల వాపుకు, నరాల ఒత్తిడికి దారితీస్తుంది.

2. వెన్నునొప్పి, డిస్క్ సమస్యలు:
తప్పుగా కూర్చోవడం వల్ల వెన్నెముకలోని ఎముకల మధ్య ఉండే ‘డిస్క్’లపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. క్రమంగా ఈ డిస్క్‌లు అరిగిపోవడం లేదా పక్కకు తప్పుకోవడం జరుగుతుంది. ఇది తీవ్రమైన వెన్నునొప్పికి, కాళ్లలోకి వెళ్లే సయాటికా నొప్పికి దారితీస్తుంది.

Advertisement

3. కండరాల బలహీనత:
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పొత్తికడుపు, వీపు కండరాలు బలహీనపడతాయి. బలమైన కండరాలు లేకపోతే.. శరీర బరువు అంతా నేరుగా వెన్నెముకపై పడుతుంది. దీనివల్ల వెన్నెముక సహజమైన వంపును కోల్పోతుంది.

4. తప్పుడు భంగిమ:
కుర్చీలో వంగి కూర్చోవడం లేదా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చోవడం వల్ల వెన్నెముక నిర్మాణం దెబ్బతింటుంది. ఇది భుజాల నొప్పికి, తలనొప్పికి కూడా కారణమవుతుంది.

Also Read: మీ డైట్‌లో ఈ 3 ఉంటే.. గ్యాస్, ఎసిడిటీకి చెక్ పెట్టొచ్చు!

నిపుణుల సూచనలు, పరిష్కారాలు:

20-20-20 నియమం: ప్రతి 20 నిమిషాలకోసారి సీటు నుంచి లేచి, కనీసం 20 అడుగుల దూరం నడవండి.

ఎర్గోనామిక్స్ : మీ కుర్చీ కంప్యూటర్ స్క్రీన్ మీ కంటి చూపుకు సమాంతరంగా ఉండేలా చూసుకోండి. పాదాలు నేలకు ఆని ఉండాలి.

స్ట్రెచింగ్ వ్యాయామాలు: ప్రతిరోజూ మెడ, వెన్నుకు సంబంధించిన తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి.

నీరు: డిస్క్‌లు హైడ్రేటెడ్‌గా ఉండటానికి పుష్కలంగా నీరు తాగాలి.

సూర్యరశ్మి: విటమిన్-డి లోపం వల్ల కూడా ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి రోజులో కొంత సమయం ఎండలో గడపండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×