E-Paper
Advertisement

Castor Oil for Skin: శీతాకాలంలో డ్రై స్కిన్‌కు చెక్‌.. ఆముదంతో న్యాచురల్ గ్లో ఎలా తెచ్చుకోవాలంటే?

Castor Oil for Skin: శీతాకాలంలో డ్రై స్కిన్‌కు చెక్‌.. ఆముదంతో న్యాచురల్ గ్లో ఎలా తెచ్చుకోవాలంటే?
Advertisement

Castor Oil for Skin: సాధారణంగా శీతాకాలం వచ్చిందంటే చర్మం తేమను కోల్పోకపోవడం, పొడిగా మారడం, ముఖంపై ముడతలు ఏర్పడటం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. అయితే.. ఇలాంటి ససమ్య మరీ ఎక్కువగా ఉంటే మాత్రం చూడటానికి అందవిహీనంగా కనిపిస్తుంటాం. అందుకే వింటర్లో స్కిన్ ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా, సహజ మెరుపును కోల్పోకుండా చూసుకోవడం ముఖ్యం.

ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఖర్చుపెట్టి రకరకాల కాస్మొటిక్స్ వాడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే ‘ఆముదం నూనె’తో వింటర్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ ఆయిల్ వలన చర్మానికి తేమ, ప్రకాశవంతమైన మెరుపు అందుతుంది. అందుకే శతాబ్దాలుగా మన పెద్దలు ఆరోగ్య పరిరక్షణతో పాటు అందానికి దీన్ని ఉపయోగిస్తూ, చర్మాన్ని నాజూకుగా, సున్నితంగా, ప్రకాశవంతంగా ఉంచుకునేవారు.

Advertisement

Also Read: ఒక్క నిమిషంలో మనసుకు ప్రశాంతత.. స్ట్రెస్ తగ్గించడంలో ‘భ్రమరి ప్రాణాయామం’ ఎలా పనిచేస్తుందంటే?

ముడతలు మాయం:

ఆముదం నూనెలో ఫ్యాటీ యాసిడ్స్, ముఖ్యంగా రిసినోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాల్లోకి లోనికి చేరి తేమను అందిస్తాయి. కాబట్టి.. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసి, మృదువుగా మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల చర్మం బిగుతుగా మారి, వయసుతో వచ్చే ముడతలు తగ్గుతాయి.

చర్మం ఎల్లప్పుడూ తాజాగా:

Advertisement

ఆముదం నూనె యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మొటిమలు, మచ్చలను తగ్గించడంలో, వాపును నయం చేసుకోవడంలో సహాయపడుతుంది. అలాగే, జుట్టు రాలడం తగ్గి, కుదుళ్లు బలపడతాయి. చర్మం రంధ్రాలను శుభ్రపరచి, ముఖం ఎల్లప్పుడూ తాజా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.

ముఖం నుంచి పాదాల వరకు:

కళ్ల కింద నల్లటి వలయాలు, పగిలిన మడమలు వంటి సమస్యల పరిష్కారంలో ఆముదం కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రిపూట మడమలకు నూనె రాసి సాక్స్ ధరించడం వల్ల చర్మం మృదువుగా మారి గాయాలు త్వరగా తగ్గుతాయి. కాబట్టి ముఖానికి మాత్రమే కాకుండా, కనుబొమ్మలు, కనురెప్పలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నూనెను అప్లై చేసుకోవాలి. అలాగే మీ చర్మం ప్రకాశవంతంగా మెరవాలంటే మాత్రం.. ఆముదం నూనెను క్రమంగా ఉపయోగించాలి. ముఖ్యంగా శీతాకాలంలో మీ చర్మం మృదువుగా.. హైడ్రేటెడ్‌గా.. ప్రకాశవంతంగా ఉండాలంటే ఇదే బెస్ట్ రెమిడీ.

Also Read: వారాల తరబడి బ్రాలను ఉతక్కుండా వాడితే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరికలు ఇవే!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×