E-Paper
Advertisement

Papaya Benefits: రాత్రి పూట బొప్పాయి తింటే ఏమవుతుంది? ఆరోగ్య నిపుణులు చెబుతున్న ఆసక్తికర విషయాలు !

Papaya Benefits: రాత్రి పూట బొప్పాయి తింటే ఏమవుతుంది? ఆరోగ్య నిపుణులు చెబుతున్న ఆసక్తికర విషయాలు !
Advertisement

Papaya Benefits: బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. అయితే.. చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే..రాత్రి పూట బొప్పాయి తినొచ్చా?” కొందరు ఇది జీర్ణక్రియకు మంచిదని చెబితే.. మరికొందరు రాత్రిపూట తింటే జలుబు చేస్తుందని భయపడుతుంటారు. రాత్రి పూట బొప్పాయి తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయిని అంటున్నారు. ఇంతకీ రాత్రి పూట బొప్పాయి తినడం వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలను గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

రాత్రిపూట బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

1. మెరుగైన జీర్ణక్రియ: 

Advertisement

బొప్పాయిలో ‘పాపైన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలోని ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేస్తుంది. రాత్రి భోజనం తర్వాత కొద్దిగా బొప్పాయి ముక్కలు తినడం వల్ల మరుసటి రోజు ఉదయం మలబద్ధకం సమస్య లేకుండా.. విసర్జన సాఫీగా జరుగుతుంది.

2. బరువు తగ్గడానికి సహకారం:

బరువు తగ్గాలనుకునే వారికి బొప్పాయి ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటుంది. వీటిలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది. రాత్రి పూట అనవసరమైన స్నాక్స్ లేదా జంక్ ఫుడ్ తినే బదులు.. ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే కడుపు నిండుగా అనిపిస్తుంది.

3. కంటి నిండా నిద్ర:

బొప్పాయిలో విటమిన్-సి , ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఒత్తిడిని తగ్గించడంలో సహాయ పడతాయి. శరీరానికి విశ్రాంతి లభించడం వల్ల రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది. అందుకే తరచుగా బొప్పాయి డైట్ లో భాగంగా చేర్చుకోవడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి.

4. గుండె ఆరోగ్యానికి మేలు:

ఇందులోని పొటాషియం, ఫైబర్ రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడతాయి. ఇది రాత్రి వేళ శరీరంలోని సోడియం ప్రభావాన్ని తగ్గించి.. గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా బొప్పాయి ఎంతగానో మేలు చేస్తుంది.

ఎదురయ్యే ఇబ్బందులు:

ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. అందరికీ రాత్రిపూట బొప్పాయి పడకపోవచ్చు.

జలుబు, దగ్గు: ఆయుర్వేదం ప్రకారం.. బొప్పాయి శరీరానికి చలువ చేస్తుంది. కాబట్టి.. ఇప్పటికే సైనస్, ఉబ్బసం లేదా త్వరగా జలుబు చేసే తత్వం ఉన్నవారు రాత్రిపూట దీనికి దూరంగా ఉండటమే మంచిది.

అతిసారం: ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల.. అతిగా తింటే రాత్రి వేళ కడుపులో అసౌకర్యం లేదా లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంది.

గర్భిణీలు: పండని లేదా సగం పండిన పొప్పాయిలో ‘లేటెక్స్’ ఉంటుంది. ఇది గర్భాశయ సంకోచాలకు దారితీస్తుంది. కాబట్టి గర్భిణీలు రాత్రిపూట మాత్రమే కాదు, ఎప్పుడైనా డాక్టర్ సలహా మేరకే బొప్పాయి తీసుకోవాలి.

Also Read: వృద్ధాప్యాన్ని వేగవంతం చేసే నిద్రలేమి.. దీని నుంచి ఎలా బయటపడాలి ?

ఆరోగ్య నిపుణుల సలహాలు:

సమయం ముఖ్యం: పడుకోవడానికి కనీసం 2-3 గంటల ముందే బొప్పాయిని తినాలి. తిన్న వెంటనే పడుకోవడం వల్ల కొందరికి యాసిడ్ రిఫ్లక్స్ (గుండెల్లో మంట) వచ్చే అవకాశం ఉంటుంది.

పరిమితంగా తినండి: ఏ ఆహారమైనా అతిగా తింటే నష్టమే. ఒక చిన్న కప్పు (సుమారు 100-150 గ్రాములు) బొప్పాయి ముక్కలు సరిపోతాయి.

పూర్తిగా పండిన పండు: రాత్రి వేళ కేవలం బాగా పండిన బొప్పాయిని మాత్రమే తీసుకోవాలి. పచ్చి బొప్పాయి జీర్ణం కావడం కష్టం.

సారాంశం ఏమిటంటే.. సాధారణ ఆరోగ్యవంతులు రాత్రిపూట బొప్పాయిని నిరభ్యంతరంగా తినవచ్చు. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరిచి, శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. అయితే.. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు లేదా అలర్జీలు ఉన్నవారు మాత్రం జాగ్రత్త వహించాలి

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×