E-Paper
Advertisement

Cabbage Leaves: మోకాళ్ల నొప్పులకు క్యాబేజీ ఆకులు చుడితే తగ్గుతాయా? డాక్టర్లు చెబుతున్న అసలు నిజాలివే!

Cabbage Leaves: మోకాళ్ల నొప్పులకు క్యాబేజీ ఆకులు చుడితే తగ్గుతాయా? డాక్టర్లు చెబుతున్న అసలు నిజాలివే!
Advertisement

Cabbage Leaves: సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈ మధ్య కాలంలో వంటింటి చిట్కాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వచ్చిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేమిటంటే.. మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాతంతో బాధపడేవారు మోకాళ్ల చుట్టూ క్యాబేజీ ఆకులను కట్టుకుంటే నొప్పి, వాపు తగ్గుతాయని ఆ పోస్ట్ ద్వారా తెలిపారు. దీంతో ఈ క్యాబేజీ థెరపీ వెనుక ఉన్న అసలు నిజమేంటో బెంగళూరులోని ఆస్టర్ సిఎమ్ఐ హాస్పిటల్ సీనియర్ రుమటాలజిస్ట్ డాక్టర్ చేతన వివరించారు. ఆ వివరాల్లోకి వెళ్లిపోదాం రండి..

అసలు లాజిక్ ఇదే..

క్యాబేజీలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీంతో వీటిని నేరుగా చర్మంపై ఉంచడం వల్ల కీళ్ల వాపు తగ్గుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. డాక్టర్ చేతన అభిప్రాయం ప్రకారం.. ఈ పద్ధతి వల్ల కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది కానీ, ఇది శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. క్యాబేజీ ఆకులు చల్లగా ఉన్నప్పుడు వాటిని మోకాళ్లపై కట్టడం వల్ల అది ఒక కోల్డ్ కంప్రెస్ లాగా పనిచేస్తుంది. దీంతో రక్త ప్రసరణలో మార్పులు వచ్చి, తాత్కాలికంగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Advertisement

Also Read: అసలు ఏంటి ఈ బ్లూ టర్మరిక్? మనకు తెలిసిన పసుపు కంటే ఇది భిన్నమైందా?

ఇది శాశ్వత పరిష్కారం కాదు..

కీళ్లవాతం అనేది కేవలం బయటికి కనిపించే వాపు మాత్రమే కాదు. ఇది ఎముకల మధ్య ఉండే మృదులాస్థి అరిగిపోవడం లేదా రోగనిరోధక శక్తిలో వచ్చే మార్పుల వల్ల కలిగే దీర్ఘకాలిక సమస్య. క్యాబేజీ ఆకులు పైపైన కొంత హాయిని ఇవ్వగలవే తప్ప, లోపల ఉన్న సమస్యను పూర్తిగా నయం చేయలేవు. ఫిజియోథెరపీ, బరువు తగ్గడం, డాక్టర్లు సూచించే వ్యాయామాలకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని డాక్టర్ స్పష్టం చేశారు.

ఇన్ఫెక్షన్లు సోకొచ్చు..

Advertisement

చాలామంది ఇది సహజ సిద్ధమైన పద్ధతి కదా అని ప్రయత్నిస్తుంటారు. కానీ, పచ్చి క్యాబేజీ ఆకులను ఎక్కువ సేపు చర్మంపై ఉంచడం వల్ల చర్మం ఎర్రబడటం లేదా దురద రావడం వంటి ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపరిశుభ్రమైన ఆకుల వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మొత్తానికి చెప్పేదేమంటే.. క్యాబేజీని సలాడ్‌గా తింటే ఆరోగ్యానికి మంచిదే. కానీ, మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం సోషల్ మీడియా చిట్కాలపై ఆధారపడకుండా వైద్యులను సంప్రదించాలి.

Also Read: మీకు నచ్చినవాళ్లందరూ దూరం అవుతున్నారా? అయితే ఈ అలవాట్లే కారణం కావచ్చు!

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×