E-Paper
Advertisement

మామూలు జంట కాదు.. కేవలం 30 సెకన్లలో ఆ పని చేశారు, ఆపై గిన్నీస్ రికార్డు

మామూలు జంట కాదు.. కేవలం 30 సెకన్లలో ఆ పని చేశారు, ఆపై గిన్నీస్ రికార్డు
Advertisement

Brazilian couple: జీవితంలో ఏదో సాధించాలని కొందరు కలలు కంటారు. కొందరు మాత్రమే వాటిని నిజం చేసుకుంటారు. మరికొందరు ఉన్నదాంట్లో సాధిస్తారు.. అలా సాధించిన వాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న జంట ఒకటి. కేవల 30 సెకన్లలో ఆ పని చేశారు, ఆపై గిన్నీస్ రికార్డులకు ఎక్కేశారు. ఏంటి? ఎక్కడ? మేటరేంటి?

బ్రెజిల్ జంట కొత్త రికార్డు-బ్రెజిల్‌కు చెందిన రెనాటో బేమా గియా-అతని ప్రియురాలు నయారా రాబర్టా రిబీరో డి మారిన్స్. జీవితంలో ఏదో సాధించాలని కోరుకున్నారు. తమకు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకున్నారు.  చేసే పనిలో ప్రేమని వెతికారు.. సక్సెస్ అయ్యారు. ఈ జంట ఏకంగా రికార్డు సృష్టించింది. కేవలం 30 సెకన్ల వ్యవధిలో దాదాపు 195 ముద్దులు ఇచ్చిపుచ్చుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

Advertisement

అర నిమిషంలో 195 ముద్దులు-అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం సందర్భంగా ఈ ఫీట్ సాధించింది ఆ జంట.  30 సెకన్లలో అత్యధిక ముద్దులు అనే కేటగిరీలో ఈ రికార్డు సాధించింది.  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ప్రపంచంలో అత్యుత్తమ జంట కావడం వల్ల ఈ రికార్డు కలిసి సాధించాలని ఆ జంట చెప్పుకొచ్చింది.

రెనాటో-నయారా ఎవరు? వృత్తి రీత్యా వీరిద్దరు డాక్టర్లు. ఏడాది కాలంగా లవ్‌లో ఉన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఫ్రంట్‌లైన్ యోధులుగా పని చేసిన అనుభవం వీరి సొంతం. తాము సాధించిన ఘనత జాబితాలో గిన్నిస్ రికార్డు ఎక్కేశారు. రికార్డు‌కు సంబంధించిన వీడియోలో రెనాటో తన అభిమాన ఫుట్‌బాల్ జట్టు ధరించే జెర్సీ వేసుకున్నాడు.

Advertisement

రెనాటో పేరిట చాలా రికార్డులు- నయారా బుగ్గపై వేగంగా ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ క్షణాలను ఆమె చిరునవ్వుతో ఆస్వాదిస్తూ కనిపించింది.  రెనాటోకు రికార్డులు సృష్టించడం సాధారణమే. ఇప్పటికే పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.  10 పుస్తకాలను వరుసలో పెట్టి పడగొట్టడం,  పాదాన్ని అత్యధికంగా తిప్పడం వంటి రికార్డులు ఉన్నాయి.

ఇప్పుడు బ్రెజిల్‌లో అత్యధిక ప్రపంచ రికార్డులు సాధించిన వ్యక్తిగా నిలిచినట్టు తెలిపాడు. ఈసారి రికార్డుల ట్రావెల్‌లో ప్రియురాలు నయారా పేరు రావాలనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రయత్నం చేసినట్లు మనసులోని మాట చెప్పాడు. రెనాటో మామూలేమీ కాదు.  టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ హోల్డర్. గెలవడం ఒక వ్యసనం లాంటిదని చెబుతున్నాడు.

ALSO READ: అమెరికా టార్గెట్ ఫిక్స్ .. ఈసారి 500 శాతం సుంకాలు,  చమురు కొనుగోలు చేసే దేశాలకు

తాను అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ తో బాధపడుతున్నానని, ఆ తరహా వ్యక్తులు అనుకున్నది ఏదైనా సాధిస్తారని తాను నిరూపించానని తెలిపారు. తమను చూసి చాలామంది గిన్నిస్ రికార్డుల వైపు ఆకర్షితులవుతారని చెప్పుకొచ్చాడు. ఈ జంట మరో పోటీకి రెడీ అవుతోంది.

నిమిషంలో అత్యధిక ముద్దుల రికార్డును బద్దలు కొట్టేందుకు రెడీ అవుతోంది. జపాన్‌కు చెందిన చెర్రీ యోషితాకే-కుమికో షిరటోరి పేరిట 277 ముద్దులతో రికార్డు ఉంది. మా రికార్డులు తమ బంధం-సవాళ్లను స్వీకరించే తత్వం-ప్రేమను కలిపి ఓ మధుర జ్ఞాపకంగా ఉంటుందని ఆ జంట చెబుతోంది. నిమిషం రికార్డును రెనాటో-నయారా  బద్దలు కొట్టాలని ఆశిద్దాం.

 

 

 

 

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×