// // Body fitness: జిమ్‌కు వెళ్లకుండానే ఈ మూడు పనులు చేయండి! -->
E-Paper
Advertisement

Body fitness: జిమ్‌కు వెళ్లకుండానే ఈ మూడు పనులు చేయండి.. బాడీ ఫిట్‌నెస్ ఎందుకు రాదో చూద్దాం!

Body fitness: జిమ్‌కు వెళ్లకుండానే ఈ మూడు పనులు చేయండి.. బాడీ ఫిట్‌నెస్ ఎందుకు రాదో చూద్దాం!
Advertisement

Body fitness: కరోనా తర్వాత యువతలో ఆరోగ్యంతో పాటు బాడీ ఫిట్‌నెస్ మీద కూడా శ్రద్ధ పెరిగింది. అయితే, ఫిట్‌నెస్ మెయింటైన్ చెయ్యాలనే తపన ఆలోచనల్లోనే ఉంటే సరిపోదు. దానిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తేనే మీరు అనుకున్న శరీరాకృతిని పొందగలరు. అయితే నేటి బిజీ ప్రపంచంలో జిమ్‌కెళ్లి గంటల తరబడి వర్కౌట్స్ చేసే సమయం అందరికీ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్లు ప్రశాంతమైన నిద్ర, రోజులో అర్ధగంట వ్యాయామం, మంచి పౌష్టికాహారం తీసుకుంటే చాలు. ఏ వయసు వారైనా బాడీ ఫిట్‌నెస్ పొందొచ్చని చెబుతున్నారు ఫిట్‌నెస్ నిపుణులు.

7 నుంచి 8 గంటల నిద్ర:

రోజంతా ఎంత బిజీగా ఉన్నా సరే.. ప్రతి మనిషికి రోజూ 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. దీనికోసం రాత్రి పడుకోవడానికి, ఉదయం లేవడానికి సరైన ప్రణాళిక తయారుచేసుకోవాలి. ఇలా సమయాన్ని పాటించడం ద్వారా మీకు నచ్చినట్టుగా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. నాణ్యమైన నిద్ర మాత్రమే మిమ్మల్ని రోజంతా ఆరోగ్యంగా ఉంచగలదు. కాబట్టి.. గంటల తరబడి స్మార్ట్‌ఫోన్, గ్యాడ్జెట్స్‌కు అతుక్కుపోకుండా సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.

Advertisement

Read Also: ఇంట్లోనే మినీ వ్యాయామశాల.. బాడీ ఫిట్‌నెస్‌పై దిగులేలా!

రోజూ 30 నిమిషాలు వ్యాయామం:

ప్రతి ఒక్కరూ వారానికి మూడు లేదా నాలుగు రోజుల తప్ప కుండా వ్యాయామం చేయాలి. అంటే.. వాకింగ్, రన్నింగ్ చేయడం వంటివి. దీని కోసం ఉదయం లేదా సాయంత్రం 20 నుంచి 30 నిమిషాల పాటు సమయం కేటాయించుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేసే వ్యాయామం మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతుంది. రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో రక్తసరఫరా మెరుగవుతుంది. రోజూ సైక్లింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా దరిచేరవు. ఈ వ్యాయామాల వల్ల శరీరంలో ఉన్న అనవసర కొవ్వు తగ్గడమే కాకుండా.. ఎముకలు కూడా గట్టి పడతాయి. వీలైతే వారానికి ఒకసారి పనిచేసే ఆఫీసుకు నడిచివెళ్లండి. లిఫ్ట్ మీద ఆధారపడకుండా మెట్లు ఎక్కడానికి ప్రయత్నించాలి. ఇలాంటి చిన్న చిన్న త్యాగాలు కూడా మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతుంది.

పోషకాలు కలిగిన ఆహారం:

Advertisement

బయట దొరికే జంక్ ఫుడ్ తింటూ ఫిట్‌గా ఉండాలనుకుంటే కుదరదు. శరీరాకృతిని మెరుగుపరచుకోవాలంటే.. సమతుల ఆహారం తీసుకోవడం ఎంతైనా అవసరం. దీని కోసం విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉండే.. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. అలాగే తక్కువ కొవ్వు ఉండే మాంస పదార్థాలను కూడా తీసుకోవాలి. అలాగే ఆయిల్, డీప్ ఫ్రై ఐటమ్స్, వేపుళ్లకు దూరంగా ఉండాలి. వీటితో పాటు బరువు తగ్గడానికి, శరీరం ఫిట్‌గా ఉండటానికి నీళ్లు చాలా అవసరం. కాబట్టి.. శరీరానికి సరిపడా మంచి నీళ్లు తీసుకోవడం ముఖ్యం. ఇలాంటి నియమాలు పాటిస్తే.. చక్కటి శరీరాకృతిని పొందడం అంత కష్టమేమీ కాదని చెబుతున్నారు నిపుణులు.

Read Also: నాలుగు పదుల వయసులోనూ ఫిట్‌నెస్.. ఆ కిటుకు మన చేతుల్లోనే ఉందన్న నిపుణులు!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×