E-Paper
Advertisement

Bluetoothing: బ్లూటూతింగ్.. ఎయిడ్స్‌కు కారణమవుతోన్న ఈ కొత్త ట్రెండ్ గురించి తెలుసా? ఆ దేశమంతా నాశనం!

Bluetoothing: బ్లూటూతింగ్.. ఎయిడ్స్‌కు కారణమవుతోన్న ఈ కొత్త ట్రెండ్ గురించి తెలుసా? ఆ దేశమంతా నాశనం!
Advertisement

పాడు పనులకు కూడా ఓ ట్రెండ్ ఉంటుందా? అవును కచ్చితంగా ఉంటుంది..? ఇప్పుడది బాగా పాపులర్ అవుతోంది. పైగా అలాంటి ట్రెండ్ లను ఫాలో అవడం ఇప్పుడు క్రేజ్ కూడా. వినాశనం తప్పదని తెలిసినా, చేస్తున్నది తప్పు అనే జ్ఞానం ఉన్నా కూడా అదే పని చేసి, కష్టాలు కొని తెచ్చుకోవడం ఇప్పుడు ట్రెండింగ్. అలాంటి సరికొత్త వినాశకారి ట్రెండ్ బ్లూటూతింగ్. మత్తులో తన జబ్బుని మరొకరికి తగిలించడం ఈ బ్లూటూతింగ్.

బ్లూ టూతింగ్..
డేటాని ఒక డివైజ్ నుంచి మరో డివైజ్ కి షేర్ చేసుకునే విషయంలో బ్లూటూత్, లేదా హాట్ స్పాట్ ని మనం వాడతాం. మత్తుమందుని కూడా ఇలాగే షేర్ చేసుకోవడాన్ని ఇప్పుడు హాట్ స్పాటింగ్ లేదా బ్లూటూతింగ్ అంటున్నారు. ఫిజీలో ఇది బాగా ఫేమస్. ఒకరి నుంచి మరొకరు డ్రగ్స్ తో పాటు రక్తాన్ని కూడా షేర్ చేసుకుంటున్నారు. ఒకరి నుంచి బయటకు తీసిన రక్తాన్ని మత్తులో మరొకరు ఎక్కించుకుంటున్నారు. ఇదే బ్లూటూతింగ్.

Advertisement

ఫిజిలో భారీగా పెరిగిన HIV కేసులు..
ఫిజి ఒక చిన్న దేశం. జనాభా మొత్తం 10 లక్షలు కూడా ఉండదు. 2014లో ఆ దేశంలో కేవలం 500 మాత్రమే HIV కేసులు ఉండేవి. 2024 నాటికి ఆ సంఖ్య 5,900కి చేరింది. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఏడాదిలోని ఫిజిలో 1,583 కొత్త కేసులు బయటపడ్డాయి. దీనికి కారణం డ్రగ్స్, అసురక్షిత లైంగిక సంబంధాలేనని తేల్చారు వైద్యాధికారులు. ముఖ్యంగా ఫిజిలో యువత డ్రగ్స్ కి బానిసలుగా మారారు. వారు డ్రగ్స్ తోపాటు రక్తాన్ని కూడా ఒకరి నుంచి మరొకరు మార్చుకుంటున్నారు. దీనివల్ల HIV సులభంగా వ్యాపిస్తోంది.

డ్రగ్స్ ని నరనరాల్లో ఎక్కించుకున్న వ్యక్తి, తననుంచి రక్తాన్ని తీసి మరొక వ్యక్తికి ఇస్తాడు. ఆ సిరంజితో ఆ రక్తాన్ని ఎక్కించుకున్న మరో వ్యక్తి, తన రక్తాన్ని తీసి మరొకరికి ఇస్తాడు. దీన్నే బ్లూటూతింగ్ గా వ్యవహరిస్తున్నారు. మత్తులో అసురక్షిత లైంగిక సంబంధాలకు వీరు అలవాటు పడుతున్నారు. దీని ద్వారా కూడా HIV సులభంగా వ్యాపిస్తోంది.

Advertisement

సిరంజిల కొరత.
ఫిజిలో సిరంజిలు, నీడిల్స్ పై నిషేధం ఉంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే సిరంజిలు అమ్ముతారు. నిషేధం అమలవడం వల్ల అక్కడ సిరంజిలకు విపరీతమైన కొరత ఉంది. దీంతో ఒకే సిరంజితో అందరు బ్లూటూతింగ్ కి పాల్పడుతున్నారు. దాని వల్ల నష్టం అని తెలిసినా కూడా వారు మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. ఒకరికొకరు ఎయిడ్స్ ని అంటించుకుంటున్నారు. అధికారులు ఎన్నిక కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. రోజు రోజుకీ పెరిగిపోతున్న ఎయిడ్స్ కేసులతో ఫిజి పెద్ద ప్రమాదంలో పడుతోంది. యువత నిష్క్రియాపర్వంలోకి వెళ్లిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కూడా పతనం దిశగా పయనిస్తోంది. ప్రపంచ దేశాలు కూడా ఫిజికి వెళ్లే పర్యాటకులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

Also Read: అద్దంలో ఎక్కువగా మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా..? అయితే ఇది మీకోసమే

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×