E-Paper
Advertisement

Biscuit cake recipe: బిస్కెట్లతో ఇలా సింపుల్ గా టేస్టీ కేక్ చేసేయండి, రెసిపీ ఇదిగో

Biscuit cake recipe: బిస్కెట్లతో ఇలా సింపుల్ గా టేస్టీ కేక్ చేసేయండి, రెసిపీ ఇదిగో
Advertisement

ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతో, ఒవెన్ అవసరం లేకుండా తక్కువ సమయంలో తయారుచేసుకునే రుచికరమైన స్వీట్ ఏదైనా ఉందంటే అది బిస్కెట్ కేక్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన ఈ కేక్‌ను ఎంతో సులువుగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పుట్టినరోజులు, చిన్నపాటి వేడుకలు లేదా అకస్మాత్తుగా అతిథులు వచ్చినప్పుడు ఈ బిస్కెట్ కేక్ మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది. ఇప్పుడు ఈ బిస్కెట్ కేక్‌ను ఎలా చేయాలో తెలుసుకోండి.

బిస్కెట్ కేక్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బిస్కెట్లు – 10 నుంచి 15
పాలు – అర కప్పు
కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు
పంచదార పొడి – 3 టేబుల్ స్పూన్లు
చాక్లెట్ ముక్కలు – పావు కప్పు
బటర్ – 1 టేబుల్ స్పూన్

Advertisement

బిస్కెట్ కేక్ రెసిపీ
1. ముందుగా ఒక చిన్న పాత్రలో కోకో పౌడర్, షుగర్ పౌడర్ వేసుకోవాలి. అందులో పాలు పోసి గరిటెతో బాగా కలపాలి. కొంచెం బటర్ కూడా వేసుకోవాలి.
2. ఈ మిశ్రమాన్ని గ్యాస్ మీద పెట్టి తక్కువ మంటలో 3 నుంచి 5 నిమిషాలు వేడి చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మిశ్రమం కొంచెం చిక్కగా మారిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేయాలి.
3. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి. పాలను ఒక చిన్న గిన్నెలో పోసి పక్కన పెట్టాలి. ఒక బిస్కెట్‌ను పాలలో స్వల్పంగా ముంచి తీసి ప్లేట్ మీద ఉంచాలి.
4. ఎక్కువసేపు ముంచితే బిస్కెట్ విరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా చేయాలి.
5. ఇప్పుడు ఆ బిస్కెట్ మీద ముందుగా తయారు చేసిన కోకో మిశ్రమాన్ని స్పూన్‌తో పలుచగా రాయాలి.
6. ఇదే విధంగా మరో బిస్కెట్‌ను పాలలో ముంచి, పైపైగా పెట్టి మళ్లీ కోకో మిశ్రమం రాయాలి. ఇలా 3 నుంచి 4 లేయర్లు వచ్చేలా బిస్కెట్లు అమర్చుకోవాలి.
7. అన్ని బిస్కెట్ లేయర్లు పూర్తయ్యాక చివరి దశలో చాక్లెట్ కోటింగ్ చేయాలి.
8. ఇందుకోసం చాక్లెట్ ముక్కలను ఒక స్టీల్ బౌల్‌లో వేసి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో కరిగించాలి. అంటే ఒక పాత్రలో నీళ్లు మరిగించి, అందులో మరో పాత్ర పెట్టి చాక్లెట్ కరిగేలా చేయాలి.
9. చాక్లెట్ పూర్తిగా కరిగిన తర్వాత దాన్ని బిస్కెట్ లేయర్లపై పై నుంచి పోయాలి. స్పూన్ సహాయంతో అన్ని వైపులా సమానంగా పాకేలా చేయాలి.
10. ఇలా సిద్ధం చేసిన బిస్కెట్ కేక్‌ను ఫ్రిజ్‌లో కనీసం 30 నిమిషాలు నుంచి ఒక గంట వరకు ఉంచాలి. అలా ఉంచడం వల్ల కేక్ లాగా ఇది సెట్ అవుతుంది.
11. ఫ్రిజ్ నుంచి బయటకు తీసి మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే టేస్టీ కేక్ రెడీ అయినట్టే.

బిస్కెట్ కేక్‌లో డ్రై ఫ్రూట్స్, నట్స్, చెర్రీలు లేదా కొబ్బరి తురుము వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. పిల్లల కోసం చేస్తే పైభాగంలో కలర్ స్ప్రింకిల్స్ కూడా వేసుకోవచ్చు. ఇది చాలా సులువుగా తయారయ్యే కేక్.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×