E-Paper
Advertisement

వడదెబ్బ తగలకుండా ఉండాలా? అయితే.. ఈ 5 డ్రింక్స్ మిస్ అవ్వకండి

వడదెబ్బ తగలకుండా ఉండాలా? అయితే.. ఈ 5 డ్రింక్స్ మిస్ అవ్వకండి
Advertisement

Summer Drinks: ఎండలు ముదురుతున్నాయి. బయట అడుగుపెడితే సెగలు చిమ్ముతున్నాయి. ఇలాంటి సమయంలో మన శరీరంలోని ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎండ దెబ్బ అనేది ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు. కాబట్టి.. ముందస్తు జాగ్రత్తగా మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే.. ముందు కొన్ని రకాల  డ్రింక్స్ తాగడం అలవాటు చేసుకోండి.

1. మజ్జిగ:
మజ్జిగ వేసవిలో.. ఒక అమృతం లాంటిది. ఇందులో.. ఉండే ప్రొబయోటిక్స్, విటమిన్లు శరీరానికి చలువ చేస్తాయి. మజ్జిగలో కొద్దిగా అల్లం,  జీలకర్ర పొడి, కరివేపాకు, సైంధవ లవణం కలిపి తాగితే.. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటమే కాకుండా.. జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుంది. ఇది ఎండ వల్ల కలిగే నీరసాన్ని తక్షణమే తగ్గిస్తుంది.

Advertisement

2. రాగి అంబలి:
మన పూర్వీకుల కాలం నుంచి రాగి అంబలి వేసవికి అత్యుత్తమ ఆహారం. రాగులు సహజంగానే.. చలువ చేసే గుణం కలిగి ఉంటాయి. రాగి పిండిని నీటిలో ఉడికించి.. అది చల్లారిన తర్వాత మజ్జిగ లేదా పెరుగు కలుపుకుని తాగాలి. ఇది శరీరానికి కావాల్సిన కాల్షియం, ఐరన్  అందించడమే కాకుండా.. ఎండలో తిరిగినా తల తిరగడం వంటి సమస్యలు రాకుండా చూస్తుంది.

3. కొబ్బరి నీళ్లు:
కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండ వల్ల శరీరం కోల్పోయే.. లవణాలను ఇది తిరిగి భర్తీ చేస్తుంది. బయటకు వెళ్లే.. అరగంట ముందు ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే.. అది మీ శరీరానికి ఒక రక్షణ కవచంలా పని చేస్తుంది.

Advertisement

4. సబ్జా గింజల నీరు:
సబ్జా గింజలకు శరీర వేడిని లాగేసే గుణం ఉంది. వీటిని పది నిమిషాలు నీటిలో.. నానబెట్టి, ఆ నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. దీనిని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.

5. బార్లీ నీరు:
వేసవిలో వచ్చే కిడ్నీ సమస్యలు, శరీర వేడిని తగ్గించడానికి బార్లీ నీరు అద్భుతంగా పని చేస్తుంది. బార్లీ గింజలను ఉడికించి.. ఆ వడకట్టిన నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి. ఇది శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపించి, చల్లదనాన్ని ఇస్తుంది.

6. చెరకు రసం, నిమ్మరసం:
తక్షణ గ్లూకోజ్ కావాలంటే చెరకు రసం బెస్ట్. అయితే ఇది శుభ్రమైన చోట మాత్రమే తీసుకోవాలి. అలాగే.. నిమ్మరసంలో చిటికెడు ఉప్పు, చక్కెర కలిపి తాగడం వల్ల బాడీలో షుగర్, సాల్ట్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి.

Also Read: కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే.. లివర్‌ను రక్షించే సూపర్ ఫుడ్స్ ఇవే!

కొన్ని ముఖ్యమైన సూచనలు:
నీటి శాతం: కేవలం డ్రింక్స్ మాత్రమే.. కాకుండా రోజుకు కనీసం 4-5 లీటర్ల నీరు తాగాలి.

కూల్ డ్రింక్స్ వద్దు: అధిక చక్కెర ఉండే.. కార్బోనేటెడ్ డ్రింక్స్ (కూల్ డ్రింక్స్) తాత్కాలికంగా దాహం తీర్చినప్పటికీ.. అవి డీహైడ్రేషన్‌ను పెంచుతాయి. వీటికి దూరంగా ఉండటమే మంచిది.

బట్టలు: పాటు లేత రంగు కాటన్ బట్టలు ధరించడం, గొడుగు లేదా టోపీ వాడటం మర్చిపోవద్దు.

ఈ సహజ సిద్ధమైన డ్రింక్స్‌ను మీ లైఫ్ స్టైల్‌లో.. భాగంగా చేసుకోవడం ద్వారా.. భానుడి భగభగల నుంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గుర్తుంచుకోండి.. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×