E-Paper
Advertisement

Best Foods for Kids Height: పిల్లల ఎత్తు పెరగాలంటే.. వెంటనే ఈ 5 ఆహారాలు ఇస్తున్నారో లేదో చెక్ చేసుకోండి!

Best Foods for Kids Height: పిల్లల ఎత్తు పెరగాలంటే.. వెంటనే ఈ 5 ఆహారాలు ఇస్తున్నారో లేదో చెక్ చేసుకోండి!
Advertisement

Best Foods for Kids Height: చాలామంది పేరెంట్స్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్య.. పిల్లలు సరైన ఎత్తు పెరగకపోవడం. పిల్లల ఎత్తు అనేది కేవలం వాళ్ల పుట్టుకతో వచ్చే జీన్స్‌ మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని మనం అనుకుంటాం. కానీ అది పూర్తిగా నిజం కాదు. మనం ఇచ్చే పౌష్టికాహారం, మంచి జీవనశైలి కూడా పిల్లల ఎముకలు, కండరాల ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే పిల్లలు చక్కగా ఎదగాలంటే వారి డైట్‌లో కొన్ని మార్పులు చేయాలి. పిల్లల ఎత్తు పెరగడానికి సహాయపడే ఆ 5 రకాల సూపర్‌ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

⇒ పాలకూర, క్యాబేజీ వంటి ఆకుకూరల్లో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎముకలను బలంగా తయారు చేస్తాయి. పిల్లలకు క్రమం తప్పకుండా ఆకుకూరలు తినిపిస్తే.. వారి శారీరక ఎదుగుదల చాలా బాగుంటుంది.

Advertisement

Also Read: రోజూ ఉదయాన్నే క్యారెట్ జ్యూస్ తాగితే.. మొండి కొవ్వు కరగడమే కాదు, చర్మం కూడా మెరుస్తుంది!

⇒ ముఖ్యంగా సాల్మన్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, విటమిన్ బి సమృద్ధుగా దొరుకుతాయి. నాన్‌వెజ్ తినే పిల్లలకు చేపలు పెట్టడం వల్ల వారి కండరాలు దృఢంగా మారి, ఎత్తు పెరగడానికి కావాల్సిన శక్తి అందుతుంది.

Advertisement

⇒ ప్రొటీన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది కోడిగుడ్లు. ఒక్కో గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. దీనిలో ఉండే విటమిన్ డి వల్ల మనం తీసుకునే క్యాల్షియం ఒంటికి పడుతుంది. దీనివల్ల ఎముకలు గట్టిపడి, పిల్లలు వేగంగా ఎదుగుతారు.

⇒ చిన్నప్పటి నుంచి పాలు తాగడం ఎముకల ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే. పాలలో ఉండే క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం పిల్లల కండరాల ఎదుగుదలకు, ఎముకల పుష్టికి ఎంతో తోడ్పడతాయి. రోజువారీ అలవాటుగా పాలు ఇవ్వడం వల్ల వారి గ్రోత్ బాగుంటుంది.

⇒ బీన్స్‌లో కేవలం ప్రొటీన్ మాత్రమే కాదు.. ఫైబర్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కూడా ఎక్కువే. ఇవి శరీరంలో గ్రోత్ ఫ్యాక్టర్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఇది పిల్లల ఎత్తు పెరగడానికి చాలా ముఖ్యం. అలాగే దీనిలో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత వంటి సమస్యలు దరిచేరవు.

Also Read: గ్రీన్ టీతో బరువు తగ్గడం పక్కన పెడితే.. ఈ 4 అనారోగ్య సమస్యలు రావడం గ్యారెంటీ!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×