E-Paper
Advertisement

డీప్ ఫ్రై చేయడానికి బెస్ట్ వంట నూనెలు ఇవే.. డాక్టర్లు సూచిస్తున్న 4 ఆప్షన్స్!

డీప్ ఫ్రై చేయడానికి బెస్ట్ వంట నూనెలు ఇవే.. డాక్టర్లు సూచిస్తున్న 4 ఆప్షన్స్!
Advertisement

Best oils for deep frying: డీప్ ఫ్రై అంటే మనందరికీ ఇష్టమే..ముఖ్యంగా బజ్జీలు, సమోసాలు లేదా చికెన్ ఫ్రై..పేరు వింటేనే నోరూరిపోతుంది. అయితే.. డీప్ ఫ్రై చేయడానికి ఏ నూనె వాడుతున్నామనేది మన గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. తప్పుడు నూనెను ఎంచుకోవడం వల్ల అది అధిక ఉష్ణోగ్రత వద్ద విషపూరితంగా మారి, క్యాన్సర్ , గుండె జబ్బులకు దారితీస్తుంది.అందుకే.. డాక్టర్ల సిఫార్సు మేరకు డీప్ ఫ్రై చేయడానికి ఎలాంటి ఆయిల్స్ వాడాలి ? ఎందుకు ?అనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

డీప్ ఫ్రై చేయడానికి సురక్షితమైన 4 వంట నూనెలు:

Advertisement

మన వంటకాల్లో డీప్ ఫ్రై అనేది ఒక భాగం. కానీ, నూనెను మరిగించినప్పుడు అది దాని ‘స్మోక్ పాయింట్ దాటితే, అందులో ఫ్రీ రాడికల్స్ విడుదలవుతాయి. ఇవి శరీరంలో మంటను కలిగిస్తాయి. అందుకే డాక్టర్లు అధిక స్మోక్ పాయింట్ ఉన్న నూనెలను వాడాలని సూచిస్తున్నారు.

స్మోక్ పాయింట్ అంటే ఏమిటి?
ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే నూనె పొగలు కక్కుతూ, తనలోని పోషకాలను కోల్పోయి విషపూరితంగా మారుతుందో దానినే స్మోక్ పాయింట్ అంటారు. డీప్ ఫ్రై కోసం మనం ఎంచుకునే నూనె స్మోక్ పాయింట్ కనీసం 190°C నుండి 230°C మధ్య ఉండాలి.

Advertisement

డాక్టర్లు సిఫార్సు చేస్తున్న 4 బెస్ట్ నూనెలు:

1. వేరుశనగ నూనె:
మనలో చాలా మంది వంటకాల తయారీల్లో తరతరాలుగా వాడుతున్న నూనె ఇది. దీని స్మోక్ పాయింట్ చాలా ఎక్కువ (సుమారు 230°C). ఇది డీప్ ఫ్రై చేయడానికి చాలా స్థిరంగా ఉంటుంది. ఇది వంటకానికి మంచి రుచిని ఇస్తుంది. అంతే కాకుండా ఇతర ఆహార పదార్థాల వాసనను పీల్చుకోదు. ఇందులో విటమిన్-ఇ,యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.

2. రైస్ బ్రాన్ ఆయిల్:
తవుడు నుంచి తీసే ఈ నూనెను ‘హార్ట్ ఫ్రెండ్లీ’ ఆయిల్ అని పిలుస్తారు. ఇందులో ‘ఓరిజానోల్’ అనే పదార్థం ఉంటుంది. అంతే కాకుండా ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయ పడుతుంది. దీని స్మోక్ పాయింట్ 232°C వరకు ఉంటుంది. కాబట్టి పూరీలు, వడలు వండటానికి ఇది అద్భుతమైన ఆప్షన్. ఇది ఆహారంలోకి కూడా చాలా తక్కువగా ఇంకుతుంది.

3. ఆవ నూనె:
ముఖ్యంగా సౌత్ ఇండియా దీని వాడకం ఎక్కువ. గానుగ పట్టిన ఆవ నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. దీని స్మోక్ పాయింట్ 250°C వరకు ఉంటుంది. ఇది సహజమైన ప్రిజర్వేటివ్‌గా పనిచేస్తుంది మరియు బాక్టీరియాను దరిచేరనివ్వదు. అయితే, దీనికి ఘాటైన వాసన ఉంటుంది, ఇది అందరికీ నచ్చకపోవచ్చు.

Also Read: రాత్రిపూట మామిడి పండు తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి!

4. నెయ్యి:
మన సంప్రదాయ వంటకాల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. నెయ్యి స్మోక్ పాయింట్ 252°C. ఇది అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా సురక్షితంగా ఉంటుంది. ఇందులో షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి ఇవి జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అయితే.. దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పరిమితంగా వాడటం మంచిది.

ముఖ్యమైన చిట్కా:
ఏ నూనె అయినా సరే.. ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత దానిని మళ్ళీ మళ్ళీ వేడి చేసి వాడటం చాలా ప్రమాదకరం. రీ-హీటెడ్ ఆయిల్ ట్రాన్స్ ఫ్యాట్స్‌ను పెంచి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×