// // Best Cooking Oils - వంటకు ఉత్తమ నూనెలు ఏవి? ఏ నూనెలు వాడకపోతే మంచిది? -->
E-Paper
Advertisement

Best Cooking Oils: వంటకు ఉత్తమ నూనెలు ఏవి? ఏ నూనెలు వాడకపోతే మంచిది?

Best Cooking Oils: వంటకు ఉత్తమ నూనెలు ఏవి? ఏ నూనెలు వాడకపోతే మంచిది?
Advertisement

మన రోజువారీ వంటలో ఉపయోగించే నూనె ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి సరైన నూనె ఎంపిక చాలా అవసరం. చాలా మంది రుచి కోసం ఏ నూనె దొరికితే అదే వాడుతుంటారు. కానీ అలా చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏ నూనె మంచిదో తెలుసుకొని వాడడం ఎంతో ముఖ్యం. సరైన నూనె వాడితే గుండె ఆరోగ్యం కాపాడుకోవచ్చు.

నూనెల్లో ఉండే కొవ్వులే అసలు విషయం. ప్రతి నూనెలో మూడు రకాల ఫ్యాట్లు ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాట్. వీటిలో మోనో మరియు పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాట్లు శరీరానికి మంచివి. ఇవి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. కానీ సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న నూనెలు ఆరోగ్యానికి హానికరం. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.

Advertisement

Also read: Multani mitti: ముఖానికే కాదు జుట్టుకు కూడా ముల్తాని మిట్టి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తెలుసా?

ఈ నూనెలు వాడితే బెటర్
కొలెస్ట్రాల్ తగ్గించడానికి కొన్ని నూనెలు మంచి ఎంపికగా భావిస్తున్నారు. ఆలివ్ ఆయిల్ అందులో ముఖ్యమైనది. ఇందులో ఉన్న మంచి కొవ్వులు గుండెను రక్షిస్తాయి. అలాగే కానోలా ఆయిల్, అవకాడో ఆయిల్ కూడా ఆరోగ్యానికి మంచివి. ఇవి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా సహాయపడతాయి. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. ఇవి క్రమంగా వాడితే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. మన దేశంలో వాడే కొన్ని నూనెలు కూడా ఆరోగ్యానికి మంచివే. వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, సారసప నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి నూనెలు మంచి కొవ్వులతో ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. ముఖ్యంగా రైస్ బ్రాన్ ఆయిల్ లో ఉండే కొన్ని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. ఈ నూనెలను పరిమితంగా వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Advertisement

Also read: Fatty liver: మద్యం తాగకపోయినా ఫ్యాటీ లివర్ వ్యాధి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే

ఇవి మాత్రం వద్దు
అయితే కొన్ని నూనెలను ఎక్కువగా వాడటం మంచిది కాదు. కొబ్బరి నూనె, పామ్ ఆయిల్ వంటి వాటిలో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా వాడితే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వనస్పతి వంటి పదార్థాలను తగ్గించడం మంచిది. ఒకే నూనెను ఎప్పటికప్పుడు వాడటం కంటే మారుస్తూ వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ నూనెతో వంట చేయడం, ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తగ్గించడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×