E-Paper
Advertisement

వ్యాక్సింగ్, షేవింగ్ లేదా లేజర్? చర్మానికి ఏది సేఫ్.. డెర్మటాలజిస్ట్ రేటింగ్స్ ఇవే!

వ్యాక్సింగ్, షేవింగ్ లేదా లేజర్? చర్మానికి ఏది సేఫ్.. డెర్మటాలజిస్ట్ రేటింగ్స్ ఇవే!
Advertisement

Waxing vs Shaving: అవాంఛిత రోమాలను తొలగించుకోవడం అనేది ఈ రోజుల్లో చాలామంది గ్రూమింగ్ రొటీన్‌లో ఒక భాగమైపోయింది. ఫంక్షన్లకు వెళ్లే ముందు వ్యాక్సింగ్ చేసుకోవడం, అర్జెంటుగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు రేజర్ వాడటం మనకు అలవాటే. అయితే, మనం వాడే ఈ పద్ధతులు మన చర్మంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనేది చాలామంది ఆలోచించరు. ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సందేష్ గుప్తా ఇటీవల సోషల్ మీడియాలో వివిధ హెయిర్ రిమూవల్ పద్ధతుల సేఫ్టీ, వాటి వల్ల కలిగే లాభనష్టాల ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన రేటింగ్స్ ఇచ్చారు.

వ్యాక్సింగ్, త్రెడింగ్:

చాలా కాలంగా వాడుకలో ఉన్న వ్యాక్సింగ్, త్రెడింగ్ పద్ధతులకు ఈ డాక్టర్ కేవలం 5/10 రేటింగ్ ఇచ్చారు. వ్యాక్సింగ్ చేయడం వల్ల చర్మంపై మొటిమలు, హెయిర్ ఫాలీకల్స్ వాపునకు గురయ్యే ప్రమాదం (ఫోలిక్యులిటిస్) ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ముఖంపై చేసే త్రెడింగ్ వల్ల చర్మాన్ని పదే పదే లాగడం వల్ల స్కిన్ అలర్జీలు, చికాకు వచ్చే అవకాశం ఉంది.

షేవింగ్, ట్రిమ్మింగ్:

Advertisement

షేవింగ్ చేసుకుంటే జుట్టు గట్టిగా వస్తుందనేది ఒక అపోహ మాత్రమేనని డాక్టర్ స్పష్టం చేశారు. దీనివల్ల చర్మానికి పెద్దగా నష్టం జరగదని చెప్తూ.. ఫలితాలు త్వరగా పోయినా ఇది సురక్షితమైనదేనన్నారు. ఇక ట్రిమ్మర్లకు ఆయన 6/10 రేటింగ్ ఇచ్చారు. రెగ్యులర్‌గా వాడుకోవడానికి, చర్మం దెబ్బతినకుండా ఉండడానికి ట్రిమ్మింగ్ ఒక మంచి ఆప్షన్.

Also Read: టీనేజర్లను నెమ్మదిగా కుంగదీస్తున్న ‘టెక్స్ట్ నెక్’ ముప్పు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నిపుణులు!

ఎపిలేషన్, క్రీములు:

Advertisement

జుట్టు తెల్లబడిన చోట లేజర్ ట్రీట్మెంట్ పనిచేయనప్పుడు ఎపిలేషన్ బాగా ఉపయోగపడుతుందని డాక్టర్ తెలిపారు. అయితే, హెయిర్ రిమూవల్ క్రీములకు మాత్రం ఆయన అత్యంత తక్కువగా 2/10 రేటింగ్ ఇచ్చారు. ఈ కెమికల్ క్రీములు వాడడం వల్ల చర్మం సున్నితంగా మారిపోవడమే కాకుండా, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.

లేజర్ ట్రీట్మెంట్:

ఈ జాబితాలో అన్నిటికంటే సురక్షితమైనదిగా లేజర్ ట్రీట్మెంట్‌ నిలిచింది. దీనికి డాక్టర్ 9/10 రేటింగ్ ఇచ్చారు. మంచి నాణ్యమైన మిషన్లతో, నిపుణుల సమక్షంలో చేయించుకుంటే ఇది చర్మానికి ఎలాంటి హాని చేయదట. పైగా జుట్టు ఎదుగుదలను శాశ్వతంగా తగ్గిస్తుంది. అయితే, మీ చర్మతత్వానికి ఇది సెట్ అవుతుందో లేదో ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

Also Read: ఐస్ రోలర్స్ నిజంగానే ముఖంపై రంధ్రాలను తగ్గిస్తాయా? డెర్మటాలజిస్ట్‌లు ఏమంటున్నారంటే?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×