E-Paper
Advertisement

Bangles: స్త్రీలు అలంకరణ కోసమే గాజులు ధరిస్తారా?.. దీని వెనుకున్న అసలు రహస్యం ఇదే!

Bangles: స్త్రీలు అలంకరణ కోసమే గాజులు ధరిస్తారా?.. దీని వెనుకున్న అసలు రహస్యం ఇదే!
Advertisement

Bangles: చాలామందికి గాజులు అనేవి అలంకరణ వస్తువులుగా, ఆభరణాలుగా మాత్రమే తెలుసు. కానీ, మహిళలు ధరించే చేతి గాజులు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు. వాటి వెనుక జ్యోతిష్య, ఆధ్యాత్మిక, శాస్త్రీయ పరమైన ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నేటి ఆధునిక యుగంలో చాలామంది పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు మాత్రమే గాజులు ధరిస్తున్నారు. కానీ, ప్రతిరోజూ గాజులు ధరించడం వల్ల కలిగే అనూహ్యమైన ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ దోషం నుంచి ఉపశమనం:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గాజులు నవగ్రహాల్లో శుక్రుడితో నేరుగా ముడిపడి ఉంటాయట. శుక్రుడు సౌందర్యానికి, ఐశ్వర్యానికి, వైవాహిక జీవితంలో సుఖానికి కారకుడు. ఏ స్త్రీ జాతకంలోనైనా శుక్ర స్థానం బలహీనంగా ఉంటే.. గాజులు ధరించడం ద్వారా ఆ దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మహిళలు క్రమం తప్పకుండా చేతికి గాజులు ధరిస్తే.. శుక్రుడు బలపడి, వారి జీవితంలో విలాసం, ఐశ్వర్యం పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.

దంపతుల మధ్య ప్రేమకు చిహ్నం:

Advertisement

మన హిందూ సంప్రదాయం ప్రకారం.. పెళ్లయిన స్త్రీలు తమ చేతులను బోసిగా ఉంచుకోకూడదట. గాజులు అనేవి భర్త ఆయురారోగ్యానికి, దంపతుల మధ్య ప్రేమ, అనుబంధానికి చిహ్నంగా భావించబడతాయి. గాజుల ధరించడం వల్ల.. కుటుంబంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొంటుందట. గాజుల నుంచి వచ్చే శబ్దం చుట్టూ సానుకూల శక్తిని సృష్టించి, పరిసరాల్లోని ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని పండితులు నమ్ముతారు.

గాజుల్లో దాగున్న ఆరోగ్య రహస్యం:

గాజులకు కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు.. ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చేతి మణికట్టు నుంచి సుమారు 6 అంగుళాల వరకు కీలకమైన ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయని నిపుణులు చెబుతారు. గాజులు ఈ పాయింట్లపై నిరంతర ఒత్తిడిని కలిగించడం వలన స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. దీంతో పాటు మహిళలు గాజులు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందట. గాజులు మణికట్టు చుట్టూ రాపిడిని సృష్టించడం వల్ల.. రక్త ప్రసరణ స్థాయి మెరుగ్గా ఉంటుంది.

గర్భంలోని శిశువుకు మేలు:

Advertisement

ఏడు నెలల నిండిన తర్వాత గర్భిణీ స్త్రీలు గాజులు ధరించడం ఎంతో శ్రేయస్కరం. ఆ గాజుల శబ్దం తల్లికి ప్రశాంతతను ఇవ్వడంతో పాటు.. గర్భంలోని శిశువు మెదడు అభివృద్ధి చెందడానికి ఎంతగానో దోహదం చేస్తుందనే బలమైన విశ్వాసం ఉంది. కాబట్టి.. మహిళలు గాజులు ధరించడం కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా.. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పరిరక్షించే ఒక ముఖ్యమైన అలవాటుగా భావించాలి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×