E-Paper
Advertisement

Rose Water: మెరిసే చర్మం కోసం 7 రోజుల రోజ్ వాటర్ ఛాలెంజ్.. మీరు సిద్ధమా?

Rose Water: మెరిసే చర్మం కోసం 7 రోజుల రోజ్ వాటర్ ఛాలెంజ్.. మీరు సిద్ధమా?
Advertisement

Rose Water: ప్రతి ఒక్కరూ అందమైన, మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. అయితే.. మారుతున్న వాతావరణం, కాలుష్యం, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా.. చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ముఖం మన వ్యక్తిత్వంలో అతి ముఖ్యమైన భాగం. దానిపై మొటిమలు , మచ్చలు, పొడిబారడం వంటివి కనిపించినప్పుడు, ఆత్మవిశ్వాసం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. సహజమైన, సురక్షితమైన పద్ధతులను ఉపయోగించడం మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి వాటిలో రోజ్ వాటర్ ఒకటి. ఇది శతాబ్దాలుగా అనేక చర్మ సమస్యలకు ఎంతగానో మేలు చేస్తుంది. దీనిని

రోజ్ వాటర్ టోనర్‌ను సరిగ్గా, క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మచ్చలు , మొటిమలు తొలగిపోవడమే కాకుండా, చర్మాన్ని ఉపశమనం చేస్తుంది. అంతే కాకుండా ఇది చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. ముఖాన్ని కూడా తాజాగా ఉంచుతుంది. అందుకే రోజ్ వాటర్ స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా ఉపయోగిస్తున్నారు. 7 రోజుల పాటు రోజ్ వాటర్ ను వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

రోజ్ వాటర్ ప్రయోజనాలు: 

సహజంగా శుభ్రపరచడం:
రోజ్ వాటర్‌ను 7 రోజుల పాటు ఉపయోగించడం వల్ల చర్మ రంధ్రాలను ఇది లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా దుమ్ము, చెమటతో పాటు అదనపు నూనెను తొలగిస్తుంది. తద్వారా బ్లాక్ హెడ్స్ , వైట్ హెడ్స్ వచ్చే అవకాశాలను కూడా ఇది చాలా వరకు తగ్గిస్తుంది.

Advertisement

చర్మం యొక్క pH స్థాయి:
ఇది చర్మం యొక్క జిడ్డుదనం లేదా అధిక పొడిబారడం సమస్యను తొలగించడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది.

మొటిమల నుంచి ఉపశమనం:
మొటిమలు తరచుగా చర్మాన్ని ఎర్రగా మారుస్తాయి. అంతే కాకుండా వీటి వల్ల కొన్ని సార్లు ముఖంపై గుంటలు కూడా ఏర్పడతాయి.తరచుగా రోజ్ వాటర్ వాడటం వల్ల మీ చర్మానికి ఉపశమనం లభిస్తుంది. మొటిమలు ఎండిపోయి నయం అవుతాయి.

కంటి సంరక్షణ:
అలసట లేదా డార్క్ సర్కిల్స్‌తో బాధపడుతుంటే.. చల్లటి రోజ్ వాటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని చుక్కల చల్లటి రోజ్ వాటర్ తీసుకొని మీ చేతివేళ్లతో మీ కళ్ళ కింద సున్నితంగా అప్లై చేయండి. ఇది తక్షణ చల్లదనాన్ని , ఉపశమనాన్ని అందిస్తుంది. ఫలితంగా మీ కళ్ళు తాజాగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

వృద్ధాప్య వ్యతిరేక ప్రభావం:
రోజ్ వాటర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి. అంతే కాకుండా ముడతలు, ఫైన్ లైన్స్ రూపాన్ని తగ్గిస్తాయి. రోజ్ వాటర్ టోనర్ వాడటం వల్ల తక్షణ తాజాదనం, మెరుపు లభిస్తుంది. ఇది ముఖానికి ఆరోగ్యకరమైన, సహజమైన మెరుపును తెస్తుంది.

Also Read: ఇది ఒక్క సారి వాడితే.. జన్మలో తెల్ల జుట్టు రాదు

రోజ్ వాటర్ ఎలా ఉపయోగించాలి ?
రోజ్ వాటర్ ముఖానికి వాడటం చాలా సులభం. ముందుగా.. మీ ముఖాన్ని ఫేస్ వాష్ తో పూర్తిగా శుభ్రం చేసుకుని, మురికి , నూనె అంతా తొలగించండి. తరువాత.. ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని, దానిపై కొద్దిగా రోజ్ వాటర్‌ను తడిపి, మీ ముఖం , మెడ అంతటా.. ముఖ్యంగా ఎక్కువ నూనె ఉత్పత్తి అయ్యే ప్రదేశాలలో సున్నితంగా అప్లై చేయండి. తర్వాత ముఖాన్ని ఆరనివ్వండి. తద్వారా అది మీ చర్మంలోకి బాగా పీల్చుకుంటుంది. ఉదయం, రాత్రి రోజ్ వాటర్ వాడటం వల్ల మీ చర్మం శుభ్రంగా, తాజాగా ,ప్రకాశవంతంగా ఉంటుంది. రోజ్ వాటర్ అనేది మీ చర్మాన్ని ఎలాంటి రసాయనాలు లేకుండా ఆరోగ్యంగా, మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచడానికి ప్రభావవంతమైన మార్గం. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీరు మరింత ప్రకాశవంతంగా యవ్వనంగా కనిపిస్తుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×