E-Paper
Advertisement

Sprouts: ఆ టైంలో మొలకెత్తిన పెసర్లు తిన్నారో.. బరువు తగ్గి నాజూగ్గా కనిపించడం పక్కా!

Sprouts: ఆ టైంలో మొలకెత్తిన పెసర్లు తిన్నారో.. బరువు తగ్గి నాజూగ్గా కనిపించడం పక్కా!
Advertisement

Sprouts: మొలకలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరమవుతుందన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. మొలకలు తింటే బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. మొలకల్లో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఎ, ప్రోటీన్ వంటి అనేక ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ క్రమంలో బరువు తగ్గాలనుకునే వారికి, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం వంటి అనేక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ మొలకలు మంచి బూస్ట్‌గా పనిచేస్తుంది. నిపుణుల ప్రకారం రోజూ మొలకెత్తిన పెసర్లు తీసుకోవడం ద్వారా బరువును సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు చెబుతున్నారు. అయితే, ఏ సమయంలో తీసుకుంటే మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

అద్భుత ప్రయోజనాలు..

మొలకెత్తిన పెసర్లను పోషకాల గనిగా చెప్పవచ్చు. ఇందులో ప్రొటీన్, ఫైబర్‌తో పాటు విటమిన్ ఎ, సి, బి కాంప్లెక్స్ వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. అందుకే మొలకెత్తిన పెసర్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పెసర్లలో కేలరీలు చాలా తక్కువ. అంతేకాదు.. ఇందులో ఉండే అధిక ఫైబర్, ప్రోటీన్ కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉంచుతాయి. దీనివల్ల ఆకలి తగ్గి, ఆహారం తక్కువగా తీసుకుంటారు, తద్వారా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది. అధిక ఫైబర్ ఉండటం వలన ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచి, జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా, ఈ మొలకలను తరచూ తీసుకోవడం వలన చర్మానికి మేలు జరిగి, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

ఎప్పుడు తీసుకుంటే బెటర్..

Advertisement

మొలకెత్తిన పెసర్లను ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత తీసుకోవడం ఉత్తమం. రాత్రి భోజనంలో వీటిని తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన పెసర్లను నేరుగా తినవచ్చు లేదా వాటికి కొద్దిగా నిమ్మరసం, నల్ల ఉప్పు, మిరియాల పొడి కలిపి రుచికరమైన సలాడ్‌గానూ తయారు చేసుకుని తినొచ్చు. కూరగాయలు లేదా ఇతర సలాడ్లలో కూడా వీటిని కలుపుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు వీటిని రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×