// // Moringa Oil Benefits: అందానికి మునగ నూనె.. అద్భుత ఫలితాలు! -->
E-Paper
Advertisement

Moringa Oil Benefits: సౌందర్య పోషణలో మునగ నూనె.. అందాన్ని రెట్టింపు చేయడంలో తోడ్పాటు!

Moringa Oil Benefits: సౌందర్య పోషణలో మునగ నూనె.. అందాన్ని రెట్టింపు చేయడంలో తోడ్పాటు!
Advertisement

Moringa Oil Benefits: నేచురల్‌ అందాన్ని పొందడానికి అమ్మాయిలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం వంటింట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాల్ని కూడా సౌందర్య పోషణ కోసం వాడుతుంటారు. అయితే, మనం రోజూ వాడే బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పాటు మోరింగా ఆయిల్‌ను కూడా వాడమని సలహా ఇస్తున్నారు నిపుణులు. చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో ఈ మునగ నూనె కీలకంగా పనిచేస్తుందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఈ నూనె కేవలం చర్మాన్ని రక్షించడమే కాకుండా.. మీ అందాన్ని రెట్టింపు చేయడంలో సమర్థంగా పనిచేస్తుంది.

ఒత్తిళ్ల నుంచి ఉపశమనం:

చర్మానికి మునగ నూనె రాసుకోవడం వల్ల పొల్యూషన్ ప్రభావంతో పాడైన మీ చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. దీంతోపాటు రోజువారీ పనుల వల్ల కలిగే అలసట, ఒత్తిళ్ల నుంచి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఈ నూనెను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారడమే కాకుండా ప్రకాశవంతంగానూ కనిపిస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.

తేమతో పాటు పోషణ:

Advertisement

శీతాకాలంలో చాలామందికి చర్మం పొడిబారిపోతుంటుంది. ఇలాంటి సమయంలో మునగ నూనె రాసుకుంటే ఎంతో మేలు. ఇది నేరుగా చర్మం లోపలి పొరల్లోకి ఇంకి తేమనందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెను పగిలిన పెదవులకు అప్లై చేసుకుంటే.. అవి తిరిగి మృదువుగా మారతాయని సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి తేమతో పాటు పోషణ కూడా అందిస్తాయట.

వృద్ధాప్య ఛాయలు కనిపించవిక:

మునగ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మోరింగ ఆయిల్‌లోని సి విటమిన్ కొలాజెన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేసి చర్మం ముడతలు పడకుండా సంరక్షిస్తుంది. కాబట్టి.. వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు. స్నానం చేసిన తర్వాత చర్మానికి ఈ ఆయిల్‌తో మర్ధన చేసుకోవడం వల్ల రోజంతా తేమ నిలిచి ఉంటుంది. మోరింగా నూనెలో యాంటీమైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి ముడతలు, నిర్జీవమైన చర్మం వంటి వృద్ధాప్య ప్రభావాలతో సహా అనేక చర్మ సమస్యలకు సహాయపడతాయని సలహా ఇస్తున్నారు నిపుణులు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×