E-Paper
Advertisement

Benefits of Grapes: ఔషధాల కంటే మిన్నగా పనిచేసే ద్రాక్షపండ్లు.. గుండె నుంచి మెదడు వరకు ఫుల్ బెనిఫిట్స్!

Benefits of Grapes: ఔషధాల కంటే మిన్నగా పనిచేసే ద్రాక్షపండ్లు.. గుండె నుంచి మెదడు వరకు ఫుల్ బెనిఫిట్స్!
Advertisement

Benefits of Grapes: ఏ సీజన్‌లో అయినా ద్రాక్షపండ్లు సులభంగా దొరుకుతుంటాయి. పైగా ఈ పండ్లను ప్రతి ఒక్కరూ కొనేలా అందుబాటు ధరలోనే ఉంటుంది. అందుకే పేద నుంచి ధనిక వర్గాల వరకూ అందరూ వీటిని ఇష్టంగా తింటుంటారు. ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యం, మెదుడు చురుగ్గా పనిచేయడం వంటి లాభాలు పొందచ్చు. అయితే.. ఈజీగా దొరికే ఈ ద్రాక్ష పండ్లను కూడా చాలామంది తినకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ద్రాక్ష తినకపోతే ఎలాంటి బెనిఫిట్స్ మిస్ అవుతారో ఇప్పుడు చూద్దాం.

కణాలకు రక్షణ:

అన్ని కాలాల్లోనూ దొరికే ద్రాక్ష పండ్లలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులకు దోహదపడే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని సరిచేస్తాయి. అలాగే శరీరంలోని కణాలను రక్షించడంలో ద్రాక్షలు ఎంతగానో సహాయపడతాయి.

గుండె ఆరోగ్యం పదిలం:

Advertisement

రోజూ గుప్పెడు ద్రాక్ష పండ్లు తినడం వల్ల గుండె జబ్బులను అడ్డుకోవచ్చు. ఈ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన రక్తనాళాల పనితీరును ప్రోత్సహించడమే కాకుండా వాపులను తగ్గించే పనిని కూడా చక్కగా నిర్వహిస్తాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.

క్యాన్సర్‌కు అడ్డుకట్ట:

ద్రాక్షలో రెస్వెరాట్రాల్, క్వెర్సెటిన్ వంటి వివిధ సమ్మేళనాలు ఉండటంతో.. ఇవి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమ్మేళనాలు కణితుల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయని తాజా పరిశోధన ద్వారా వెల్లడైంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

Advertisement

గ్రేప్స్‌లో C, K విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఈ ద్రాక్ష మన శరీర రోగనిరోధక పనితీరుకు ముఖ్యమైనవి వైద్యులు చెబుతారు. అలాగే సీజనల్ ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో గ్రేప్స్ ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా వింటర్ సీజన్లు రోజూ గుప్పెడు ద్రాక్షపండ్లను మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

కంటి సమస్యలు రావు:

ద్రాక్షలో ఉన్న లుటిన్, జియాక్సంతిన్ వంటి వివిధ యాంటీఆక్సిడెంట్ల వలన కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అలాగే ఈ ద్రాక్ష పండ్లు వయసు సంబంధిత మాక్యులర్ క్షీణత, ఇతర కంటి వ్యాధుల నుంచి మన కళ్లను రక్షించడంలో సహాయపడతాయి. తరచూ ద్రాక్షపళ్లు తీసుకోవడం వలన కంటికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మెదడుకు పదును:

ద్రాక్ష పండ్లలోని రెస్వెరాట్రాల్.. మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని మన ఆహారంలో భాగం చేసుకుంటే ఆలోచన పనితీరును మెరుగుపరుస్తుందని, అలాగే అల్జీమర్స్ వంటి న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది.

 

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×