E-Paper
Advertisement

Papaya: ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా ? ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసుకోండి

Papaya: ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా ? ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసుకోండి
Advertisement

Papaya: ప్రకృతి ప్రసాదించిన గొప్ప పోషకాహారం పండ్లు. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. ముఖ్యంగా బొప్పాయి ఒక రుచికరమైన పండు మాత్రమే కాదు..ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఫిట్‌గా ఉంచడంలోనూ సహాయపడుతుంది. శరీరానికి మేలు చేసే అనేక రకాల పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి.

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది:

Advertisement

బరువు తగ్గాలనుకునే వారు బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది అంతే కాకుండా ఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే, బొప్పాయిలో కేలరీలు తక్కువగా ఉంటాయి .ఇవి కొవ్వుపదార్థాలను కూడా కలిగి ఉండవు. అందుకే ఇది బరువు తగ్గడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

చర్మానికి ప్రయోజనకరమైనది:

Advertisement

బొప్పాయి చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. బొప్పాయిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుండి చర్మాన్ని రక్షిస్తాయి. అంతే కాకుండా ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.మీరు మీ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ప్రతిరోజు ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం చాలా మంచిది. గ్లోయింగ్ స్కిన్ సొంతం అవ్వాలంటే తరుచుగా బొప్పాయిని తినాలి.

Also Read: ఈజీగా బరువు తగ్గాలా ? అయితే ప్రతి రోజు ఈ డ్రింక్ తాగండి

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:

బొప్పాయిలో పుష్కలంగా ఫైబర్, పొటాషియం. విటమిన్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×