E-Paper
Advertisement

Bed Rotting: మంచంపై దొర్లుతూ రీల్స్ చూస్తూ.. రిలాక్స్ అవుతున్నారా? అయితే, జరిగేది ఇదే!

Bed Rotting: మంచంపై దొర్లుతూ రీల్స్ చూస్తూ.. రిలాక్స్ అవుతున్నారా? అయితే, జరిగేది ఇదే!
Advertisement

Bed Rotting: నేటి యువతరం ఊపిరి పీల్చుకోకుండా అయినా ఉండగలదేమో కానీ.. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకుండా మాత్రం ఒక్క క్షణం కూడా ఉండలేకపోతోంది. గంటల తరబడి స్మార్ట్‌ఫోన్ చూడటం వల్ల కేవలం కళ్ల సమస్యే వస్తుందని అనుకుంటారు. కానీ.. అది మీ భ్రమ మాత్రమే! అతిగా ఫోన్ వాడటం వల్ల కలిగే నష్టాలు కేవలం కంటి చూపుతో ఆగిపోవు. అది నెమ్మదిగా మీ మానసిక స్థితిని అస్తవ్యస్తం చేస్తుంది. దీనివల్ల మీ ఆలోచనా విధానం మొద్దుబారిపోతుంది. అంతే కాదు.. జీవితంలో విలువైన సమయాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోతారు

ప్రస్తుతం చాలామంది యువత ఏ మాత్రం ఒంట్లో అలసటగా అనిపించిన.. ఎనర్జీ లేకపోయిన.. ఖాళీ సమయం దొరికినా వెంటనే ఫోన్ పట్టుకుని మంచం మీద వాలిపోతుంటారు. ముఖ్యంగా ఈ సోషల్‌ మీడియా యుగంలో(Generation Z) ఇదో కొత్త పేరుతో ట్రెండ్‌ అవుతోంది. దాని పేరే ‘బెడ్‌ రాటింగ్‌’ అంటే.. రోజులో ఎక్కువ సమయం బెడ్ మీదే పడుకోవటం. ఈ క్రమంలో సుదీర్ఘ కాలం బెడ్ మీద పడుకుని ఫోన్ స్క్రోలింగ్, రీల్స్ చూడటం వంటివి చేస్తే కలిగే నష్టాలేమిటో తెలుసుకుందాం.

బెడ్ రోటింగ్ అంటే?

Advertisement

సాధారణంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ.. రోజంతా లేదా ఎక్కువ సమయం బెడ్ మీద పడుకుని ఉండటం. అలాగే పడుకున్నంతసేపు ఫోన్ చూడటం లేదా నిద్రపోవడం వంటివి చేస్తూ.. ఎలాంటి శారీరక శ్రమ చేకపోవడం. దీనినే టిక్‌టాక్ ట్రెండ్, ఒత్తిడిని తగ్గించుకో వడానికి కొంతమంది దీన్ని సెల్ఫ్-కేర్‌గా భావించినా, కొందరు నిపుణులు ఈ పద్ధతి నిరాకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్య సమస్యలు:

⇒ రోజులో ఎక్కువ సమయం బెడ్ మీద పడుకుని రీల్స్ చూడటం వలన విశ్రాంతి తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది కానీ.. దీని వల్ల కండరాలు నొప్పులు, వెన్నునొప్పి, బరువు పెరగడం, గుండె జబ్బులు, మధుమేహం వంటి శారీరక సమస్యలు తలెత్తవచ్చని చెబుతున్నారు నిపుణులు.

Advertisement

⇒ అలాగే బెడ్ రాటింగ్ వలన ఒకే చోట కూర్చొని ఉండే జీవవనశైలికి అలవాటు పడిపోతారు. క్రమంగా ఈ అలవాటు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్లయకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు.

మానసికంగా నష్టపోతారు:

⇒ ఈ బెడ్ రోటింగ్ వలన కొన్నిసార్లు డిప్రెషన్, ఆందోళన చెందడం వంటి లక్షణాలు పెరుగుతాయట. ముఖ్యంగా ఒంటరిగా ఉండేందుకు అలవాటు పడటం, ఇతరులతో కలవకపోవడటం చేస్తూ.. ఒంటరిగా ఫీలవుతుంటారు.

⇒ గంటల కొద్దీ రీల్స్ చూస్తూ సమయం వృధా చేయడం వల్ల మీ జీవనశైలి పూర్తిగా మారిపోవచ్చు. అలాగే బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడం వంటి మానసిక సమస్యలను ఎదుక్కోవాల్సి ఉంటుంది.

⇒ బెడ్ రోటింగ్ కొద్దిసేపు విశ్రాంతి కోసం మంచిదే అయినా.. దీన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×