E-Paper
Advertisement

Liver Health: ఇలాంటి అలవాట్లు ఉంటే మీ కాలేయం కుళ్లిపోతుంది జాగ్రత్త

Liver Health: ఇలాంటి అలవాట్లు ఉంటే మీ కాలేయం కుళ్లిపోతుంది జాగ్రత్త
Advertisement

ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ అనే కాలేయ వ్యాధి వేగంగా పెరుగుతోంది. ఇది కేవలం మద్యం సేవించే వారికే వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ వైద్యుల చెబుతున్న ప్రకారం ఇది పూర్తిగా తప్పు. మనం ప్రతిరోజూ చేసే చిన్న చిన్న అలవాట్లు కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఆధునిక జీవనశైలిలో ఎక్కువగా ప్యాకెట్‌ ఫుడ్, జంక్‌ ఫుడ్, పంజాబీ, చైనీస్, ఫ్రైడ్‌ వంటివి తినడం ఒక పెద్ద ట్రెండ్‌గా మారింది. వీటిలో ఉండే ప్రాసెస్ చేసిన ఆయిల్స్, అధిక చక్కెర, ట్రాన్స్‌ఫ్యాట్‌లు కాలేయంపై నేరుగా ప్రభావం చూపుతాయి. దీనితో పాటు శారీరక వ్యాయామం చేయకపోవడం, చెడు జీవనశైలి, గంటల తరబడి కూర్చుని ఉండటం.. ఇవన్నీ కలిసి ఫ్యాటి లివర్‌కి దారితీస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ అలవాట్లు మానేయండి
ఫ్యాటి లివర్ ఏర్పడటానికి ఆహారపు పద్ధతులపాటు నిద్రలేమి కూడా ఒక ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. రాత్రులు ఎక్కువసేపు మేల్కొని ఉండటం, మొబైల్‌ ఫోన్, ల్యాప్‌టాప్‌ ముందు గంటల తరబడి గడపడం, ఉదయం ఆలస్యంగా లేవడం… ఇవన్నీ శరీరంలోని హార్మోన్‌ల తీరు మార్చి, మెటాబాలిజాన్ని తగ్గిస్తాయి. దీని వలన శరీరం తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం కాక, కొవ్వుగా నిల్వ అవుతుంది. ఈ నిల్వ కాలేయంలో చేరడం ప్రారంభమైతే ‘ఫ్యాటి లివర్’ సమస్య ఏర్పడుతుంది. అదనంగా, చిన్నపాటి జ్వరం, తలనొప్పి కోసం తరచూ పెయిన్‌కిల్లర్లు వాడటం, అవసరం లేకుండా సప్లిమెంట్లు తీసుకోవడం, యాంటీబయాటిక్స్‌ను అధికంగా కొనడం వంటి అలవాట్లు కూడా కాలేయాన్ని బలహీనపరుస్తాయని వైద్యులు తెలిపారు.

Advertisement

ఈ లక్షణాలు కనిపిస్తే
ఈ వ్యాధి మొదటి దశల్లో సాధారణంగా లక్షణాలు కనిపించవు. అందువల్ల చాలా మంది దీన్ని గుర్తించలేరు. కానీ కొన్నిసార్లు నిరంతర అలసట, పొట్ట కుడి వైపున ఒత్తిడి అనిపించడం, జీర్ణక్రియ లోపించడం, ఆకలి తగ్గడం, నిద్రలో అంతరాయం లాంటివి కనిపిస్తాయి. కాలేయంలో కొవ్వు ఎక్కువైతే ఇది ‘స్టీయాటోహెపటైటిస్’ గా మారి కాలేయ కణాలు నాశనం కావడం ప్రారంభమవుతుంది. మరింత ఆలస్యం అయితే ఫైబ్రోసిస్ అనే గాయాలు ఏర్పడతాయి. చివరికి కాలేయ సిరోసిస్‌ వరకు వెళ్లే ప్రమాదం ఉంది. కనుక చిన్న లక్షణాలు ఉన్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఫ్యాటి లివర్‌ను నివారించాలంటే జీవనశైలి మార్పులు తప్పనిసరి. అధిక చక్కెర, ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్‌ను వదిలేయాలి. తాజా కూరగాయలు, పండ్లు, ధాన్యాలు తినడం, రోజూ అరగంట పాటూ నడక లేదా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. అలాగే రాత్రికి రాత్రి సరైన నిద్రపట్టేలా పద్ధతి మార్చుకోవాలి. రోజుకు 7–8 గంటలు నిద్రపోవడం కాలేయానికి ఎంతో ఉపయోగకరం. మందులను వైద్యుల సలహా లేకుండా వాడకూడదు. రోజంతా తగినంత నీరు తాగడం కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. ఫ్యాటి లివర్ అనేది నివారించగలిగిన వ్యాధి. మన అలవాట్లను మార్చుకుంటే కాలేయాన్ని రక్షించుకోవడం పూర్తిగా మన చేతుల్లనే ఉంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×