E-Paper
Advertisement

Banana Burfi: అరటిపండుతో బనానా బర్ఫీ చేశారంటే పిల్లలు లొట్టలు వేసుకొని తింటారు

Banana Burfi: అరటిపండుతో బనానా బర్ఫీ చేశారంటే పిల్లలు లొట్టలు వేసుకొని తింటారు
Advertisement
పిల్లలకు స్వీట్లు అంటే ఎంతో ఇష్టం. ప్రతిసారీ బయట అమ్మే స్వీట్లు పెట్టే కన్నా ఇంట్లోనే శుచిగా మీరే స్వీట్లు వండి పెట్టండి. వారికి కచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడ మేము బనానా బర్ఫీ రెసిపీ ఇచ్చాము. దీన్ని తీయటి అరటి పండ్లతో చేస్తారు. ఈ బర్ఫీ రెసిపీ చాలా సులువు. పైగా రుచిగా ఉంటుంది. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

బనానా బర్ఫీ చేసేందుకు కావలసిన పదార్థాలు
పండిన అరటి పండ్లు – మూడు
బాదం – గుప్పెడు
చిక్కటి పాలు – పావు కప్పు
బెల్లం తురుము – ముప్పావు కప్పు
పాలపొడి – ఒక కప్పు
నెయ్యి – మూడు స్పూన్లు
కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పు
యాలకుల పొడి – అర స్పూను

బనానా బర్ఫీ రెసిపీ
⦿ బాగా పండిన అరటి పండ్లను దీనికోసం తీసుకోండి. అవి తియ్యగా ఉంటాయి. కాబట్టి బనానా బర్ఫి కూడా చాలా రుచిగా ఉంటుంది.
⦿ ఇప్పుడు ఒక గిన్నెలో బాగా పండిన అరటి పండ్లను సన్నగా తరిగి వేయండి.
⦿ చేత్తోనే ఆ అరటిపండును గుజ్జులా చేయండి. దాన్ని పక్కన పెట్టుకోండి.
⦿ ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టి బెల్లం తురుము, పాలు వేసి బాగా కలపండి.
⦿ అందులో కొబ్బరి కోరును కూడా వేసి బాగా కలపండి.
⦿ ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా అవుతున్న సమయంలో నెయ్యిని వేయండి.
⦿ ఆ తర్వాత ముందుగా నలిపి పెట్టుకున్నా అరటిపండు గుజ్జును వేసి బాగా కలుపుకోండి.
⦿ అలాగే పాలపొడిని కూడా వేసి బాగా కలపండి. అందులోనే యాలకుల పొడిని కూడా వేసి బాగా కలుపుకోండి.
⦿ ఈ మొత్తం మిశ్రమంలో దగ్గరగా అయ్యేవరకు చిన్న మంట మీద కలుపుతూ ఉండండి.
⦿ అందులో జీడిపప్పులు, బాదం పప్పులు వంటివి వేసి కలపండి.
⦿ ఇప్పుడు ఒక పాత్రకు అడుగుభాగాన నెయ్యి రాసి ఈ మొత్తం మిశ్రమాన్ని సమానంగా పరచండి.
⦿ ఒక మూడు నాలుగు గంటల పాటు అలా వదిలేయండి. తర్వాత తీస్తే అది గట్టిగా బర్ఫీ లాగా అవుతుంది.
⦿ మీకు నచ్చిన ఆకారంలో దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేయండి. ఇది వారం రోజులు పాటు తాజాగా ఉంటుంది.
⦿ పిల్లలు కూడా దీన్ని బాగా ఇష్టంగా తింటారు.
⦿ ఇందులో మనము పంచదారకు బదులు బెల్లాన్ని వాడాము. కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే.

Also Read: ముఖం నల్లగా మారుతోందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే మెరిసి పోతారు

Advertisement

బనానా బర్ఫీ చేసేందుకు మనము బెల్లము, పాలు, కొబ్బరి, అరటిపండు, యాలకుల పొడి, నెయ్యి, పాలపొడి వంటివి వాడావు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలే చేస్తాయి. బెల్లానికి బదులు పంచదార వాడితే ఎలాంటి ఉపయోగం ఉండదు. బెల్లాన్ని వినియోగించాము కాబట్టి ఐరన్ అందుతుంది. కాబట్టి ఈ స్వీట్ ను ఇంట్లోనే చేసి పిల్లలకు తినిపించండి. ఇది కచ్చితంగా వారికి ఎంతో నచ్చుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×