E-Paper
Advertisement

Flask Bottle: ఫ్లాస్క్ బాటిల్స్ క్లీనింగ్‌లో ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి!

Flask Bottle: ఫ్లాస్క్ బాటిల్స్ క్లీనింగ్‌లో ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి!
Advertisement

Flask Bottle: ఇప్పుడంతా ఎక్కడికి వెళ్లినా వేడినీళ్లు, పాలు, టీ-కాఫీ.. వంటి పానీయాల్ని ఫ్లాస్క్ బాటిల్స్‌లో తీసుకెళ్లడం కామనైపోయింది. మనం తీసుకెళ్లే పదార్థాలను ఫ్లాస్క్‌లు ఎక్కువ సమయం వేడిగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే.. ఆ బాటిళ్ల శుభ్రం చేసేటప్పుడు మాత్రం కొన్ని విషయాలను మర్చిపోతుంటాం. ఆ ఫ్లాస్క్ బాటిళ్ల మూతలు గాలి చొరబడనంత బిగుతుగా ఉంటాయి. దీంతో తేమ నిలిచి ఉండి కొన్ని రోజులకు దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ తేమ కారణంగా ఫంగస్‌ పెరిగే ప్రమాదమూ ఉంది. కాబట్టి ఫ్లాస్క్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. ఫ్లాస్క్ బాటిల్స్ క్లీనింగ్ ఎలా చేయాలంటే?

వారానికోసారైనా:

ఫ్లాస్కులను రోజూ నీటితో కడిగినా సరే.. వారం లేదా రెండు వారాలకోసారైనా సబ్బు నీటితో కచ్చితంగా శుభ్రం చేయాలి. దీనికోసం ముందుగా బాటిల్‌లో వేడి నీళ్లు నింపి అందులో కొన్ని చుక్కల డిష్‌ సోప్‌ వేయాలి. ఆపై షేక్‌ చేసి కాసేపు పక్కన పెట్టాలి. నీళ్లు చల్లారాక సాధారణ నీటితో కడిగేస్తే సరిపోతుంది. అలాగే ఫ్లాస్క్‌ బాటిల్‌ నుంచి వచ్చే దుర్వాసనల్ని పోగొట్టాలంటే.. రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్‌ సోడాను ముందుగా బాటిల్‌లో వేసి.. వేడి నీళ్లను నింపాలి. అరగంట తర్వాత మృదువైన బ్రిజిల్స్‌ ఉన్న బ్రష్‌తో బాటిల్‌ గోడల్ని, అడుగు భాగాన్ని రుద్దుతూ శుభ్రం చేయాలి. ఆపై మరోసారి సాధారణ నీటితో శుభ్రపరిస్తే సరి.

ప్రభావంతమైన చిట్కా:

Advertisement

ఫ్లాస్క్ బాటిల్‌లో వేడి నీళ్లు, వెనిగర్‌.. ఈ రెండింటినీ సమపాళ్లలో తీసుకొని నింపాలి. దాన్ని గంటపాటు అలాగే వదిలేయాలి. ఆపై సాధారణ నీటితో కడిగేస్తే బాటిల్‌ శుభ్రపడుతుంది. అలాగే బేకింగ్‌ సోడా, వెనిగర్‌ని కొద్ది మోతాదుల్లో తీసుకొని బాటిల్‌లో వేయాలి. ఆపై నిండా వేడి నీటిని నింపి పది నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆపై మృదువైన బ్రిజిల్స్‌ ఉన్న బ్రష్‌తో బాటిల్‌ లోపలి గోడల్ని రుద్ది కడిగితే సరిపోతుంది.

మూతను మర్చిపోవద్దు:

కొన్నిసార్లు ఫ్లాస్క్ బాటిల్‌ను కడిగినంత శ్రద్ధగా దాని మూతను శుభ్రం చేయరు. కానీ దాని లోపలి భాగం కూడా కొన్నాళ్లకు జిడ్డుగా మారుతుంది. కాబట్టి.. బాటిల్‌ కడిగినప్పుడే దాని మూతనూ సోప్‌ వాటర్‌ ఉపయోగించి స్పాంజి లేదా బ్రష్‌ సహాయంతో క్లీన్‌ చేయాలి. అలాగే దానికి ఏదైనా రబ్బర్‌ సీల్‌ ఉంటే దాన్ని తొలగించి క్లీన్‌ చేయడం మంచిది. గిన్నెలు తోమే స్క్రబ్బర్లు, స్టీల్‌ స్క్రబ్బర్లు ఫ్లాస్క్‌ బాటిల్‌ కడిగేందుకు వాడకూడదు. దీనివల్ల బాటిల్‌ పైభాగంలో ఉండే స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఉపరితలం/గ్లాస్‌ లైనర్‌ దెబ్బతింటాయి. కాబట్టి ఫ్లాస్క్‌ బాటిల్‌ కడిగేందుకు బయట దొరికే ప్రత్యేకమైన బ్రష్‌లు ఉపయోగించడం మంచిది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×