E-Paper
Advertisement

బాడీ డిటాక్స్ కోసం ఆయుర్వేద ఫుట్ సోక్.. ఇంట్లో దొరికే వాటితోనే మ్యాజిక్!

బాడీ డిటాక్స్ కోసం ఆయుర్వేద ఫుట్ సోక్.. ఇంట్లో దొరికే వాటితోనే మ్యాజిక్!
Advertisement

Ayurvedic foot soak for detox: రోజంతా పని ఒత్తిడి, అలసటతో సతమతమవుతున్నారా? అయితే.. ఆయుర్వేద ఫుట్ సోక్ మీకు ఒక వరం లాంటిది. పాదాల ద్వారా శరీరంలోని టాక్సిన్స్ తొలగించి, డిటాక్స్ చేయడానికి ఇది బెస్ట్ పద్దతి. ఆయుర్వేదం ప్రకారం.. మన పాదాలలో అనేక ముఖ్యమైన నాడీ కేంద్రాలు ఉంటాయి. సరైన ఆయుర్వేద మూలికలను ఉపయోగించి పాదాలను నానబెట్టడం ద్వారా కేవలం అలసట మాత్రమే కాదు.. శరీరంలోని హానికరమైన వ్యర్థాలు కూడా బయటకు వెళ్తాయి. ఈ చిట్కాలను ఇంట్లోనే ఎలా ఫాలో అవ్వాలో అంతే కాకుండా ఎలాంటి పదార్థాలు అవసరమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆయుర్వేదం కేవలం అనారోగ్యానికి చికిత్స మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అందించే అద్భుత శాస్త్రం. మన శరీరంలో పేరుకు పోయిన మలినాలను వదిలించుకోవడానికి ‘ఫుట్ సోక్’ అనేది ఒక బెస్ట్, సింపుల్ డిటాక్స్ ప్రక్రియ.

Advertisement

ఆయుర్వేద ఫుట్ సోక్ ఎలా పని చేస్తుంది?
పాదాల ద్వారా శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపడం అనే ప్రక్రియను ‘పాద అభ్యంగన’ లేదా ‘పాద స్నానం’ అంటారు. పాదాల కింద ఉండే రంధ్రాల ద్వారా మూలికల సారం శరీరంలోకి వెళ్లి, రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా.. శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది.

డిటాక్స్ కోసం కావాల్సిన పదార్థాలు:
ఎప్సమ్ సాల్ట్
వేప ఆకులు
పసుపు
అల్లం పొడి లేదా ముక్కలు
సుగంధ నూనెలు

Advertisement

ఫుట్ సోక్ తయారీ, విధానం:
ముందుగా ఒక పెద్ద టబ్‌లో గోరు వెచ్చని నీటిని తీసుకోండి. తర్వాత అందులో ఒక కప్పు ఎప్సమ్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు పొడి, మరిగించిన వేప నీరు, కొద్దిగా అల్లం ముక్కలను వేయండి. తర్వాత మీకు ఇష్టమైన సుగంధ నూనెను 3-4 చుక్కలు కలపండి. మీ పాదాలను కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు ఆ నీటిలో నానబెట్టండి. చివరగా.. పాదాలను శుభ్రమైన తువ్వాలుతో తుడిచి, ఆముదం లేదా కొబ్బరి నూనెతో సున్నితంగా మసాజ్ చేయండి.

ప్రయోజనాలు:
ఒత్తిడి: రోజువారీ పని ఒత్తిడి తగ్గి, రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

రక్త ప్రసరణ: పాదాలకు రక్త ప్రసరణ పెరిగి, రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది.

చర్మ ఆరోగ్యం: పాదాల పగుళ్లు తగ్గి, చర్మం మృదువుగా మారుతుంది.

బాడీ డిటాక్స్: చెమట, నాడీ వ్యవస్థ ద్వారా శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లడానికి సహాయ పడుతుంది.

Also Read: జీన్స్ ఉతకడం విషయంలో.. చాలా మంది చేసే తప్పులు ఇవే !

జాగ్రత్తలు:
నీటి ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా లేకుండా చూసుకోండి.

మీకు డయాబెటిస్ లేదా ఏవైనా తీవ్రమైన చర్మ సమస్యలు ఉంటే.. డాక్టర్ సలహా తీసుకోవడం బెస్ట్.

ఫుట్ సోక్ తర్వాత పాదాలను పొడిగా ఉంచడం మర్చిపోవద్దు.

వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేయడం వల్ల మీ శరీరం తేలికగా అనిపిస్తుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ ఆయుర్వేద విధానాన్ని పాటించి.. మీ ఆరోగ్యానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వండి. కష్టమైన డిటాక్స్ డైట్ల కంటే, ఇలాంటి సింపుల్ పద్ధతులు మనకు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×