E-Paper
Advertisement

Influencer: ఇల్లు అద్దెకు దొరకడం లేదని.. రోజుకో అబ్బాయి ఇంట్లో గడుపుతున్న అమ్మాయి, అదెలా?

Influencer: ఇల్లు అద్దెకు దొరకడం లేదని.. రోజుకో అబ్బాయి ఇంట్లో గడుపుతున్న అమ్మాయి, అదెలా?
Advertisement

Australian Influencer Emily Webb: ఎమిలీ వెబ్.. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌ కు చెందిన 25 ఏళ్ల యువతి.  సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టిక్‌ టాక్, ఇన్‌ స్టాగ్రామ్‌ లో  100,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఓన్లీ ఫ్యాన్స్ యాప్ లో కంటెంట్ షేర్ చూస్తూ డబ్బులు సంపాదిస్తుంది. సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే ఆదాయాన్ని పొందుతుంది. కానీ, ఏడాది క్రితం తన ఆదాయం ఇంటి అద్దె చెల్లించడానికే సరిపోయేది. 2024లో ఆమె ఉండేందుకు కొత్త అద్దె ఇల్లు దొరక్కపోవడంతో అకస్మాత్తుగా రోడ్డు మీదికి రావాల్సి వచ్చింది.

ఆస్ట్రేలియాలో అద్దె ఇళ్ల సంక్షోభం

ఆస్ట్రేలియాలో అద్దె ఇళ్ల సంక్షోభం ఎక్కువగా ఉంది. చాలా మందికి అద్దె ఇళ్లు దొరకడం కష్టంగా మారింది. ఇళ్ళు, అపార్ట్‌ మెంట్‌లు చాలా ఖరీదైనవిగా మారాయి. ఎమిలీ అద్దె ఇంటి కోసం చాలా ప్రయత్నం చేసింది. ఏడాది రెంట్ ముందుగానే ఇస్తానని చెప్పింది కూడా. కానీ, ఎవరూ ఆమెకు అద్దె ఇల్లు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఆమె తన పాత ఇంటిని ఖాళీ చేసిన తన వస్తువులన్నింటినీ కారులో పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వారానికి నాలుగు రోజుల పాటు తన ఫ్రెండ్స్ ఇళ్లలో పడుకునేది.  వారం అంతా వారికి ఇబ్బంది కలిగించ కూడదని నిర్ణయించుకుంది.

మిగతా మూడు రోజులు ఏం చేసేదంటే?

Advertisement

వారంలో నాలుగు రోజులు ఫ్రెండ్స్  ఇళ్లలో ఉండగా, మిగతా మూడు రాత్రులు.. ఆమె హింజ్ లాంటి డేటింగ్ యాప్‌లను ఉపయోగించింది. అబ్బాయిలతో డేటింగ్‌కు వెళ్లి వారి ఇళ్లలో ఉండేది. కొన్నిసార్లు ఆమె కొద్ది రోజుల వరకు వారితోనే ఉండేది. ఎమిలీ దీనిని లైఫ్ హ్యాక్ అని పిలిచేది. డేటింగ్ లో ఉన్నప్పుడు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చేది. ఆమె చూడ్డానికి కూడా చాలా అందంగా ఉండటంతో ఆమెతో డేటింగ్ చేసేందుకు చాలా మంది ఇష్టపడేవారు.

డేటింగ్ చేసే యువకులతో ఆమె ఏం చెప్పేదంటే?

ఎమిలీ మొదట్లో తనకు ఇల్లు లేదని చెప్పేది కాదు. అలా చెప్తే, ఎదుటి వారు ఎలా రిసీవ్ చేసుకుంటారోననని భావించేది. కానీ, కొంతమంది పురుషులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. కానీ, ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఎవరూ ఏమీ అనలేదు. తాను డేటింగ్ కు వెళ్లిన యువకులు కూడా చాలా మంచివారని చెప్పుకొచ్చింది.

నెటిజన్లు ఎలా రియాక్ట్ అయ్యారంటే?  

Advertisement

ఎమిలీ వ్యవహారం 2024లో బాగా వైరల్ అయ్యింది. కొంత మంది ఆమె చక్కగా ఆలోచించిందని చెప్తే, మరికొంత మంది మాత్రం ఆమె చాలా రిస్క్ చేసిందన్నారు. అపరిచితులతో ఉండటం ప్రమాదకరం.. ఒంటరిగా ఉన్న స్త్రీలు తమ భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరికొంత మంది ఆమె చేసిన పనిని అన్యాయం అన్నారు. తన అవసరాల కోసం పురుషులను వాడుకుందని విమర్శించారు. కానీ, కొద్ది రోజుల తర్వాత ఆమెకు అద్దె గది దొరకడంతో హ్యాపీగా అందులో నివసిస్తుంది. ఆస్ట్రేలియాలో అద్దె ఇళ్ల  సంక్షోభం ఎంత దారుణంగా ఉందో ఎమిలీ కథ చూపించింది.

Read Also: రోజూ 5 గంటలే నిద్రపోతున్నారా? అయితే, మీరు సూపర్ హీరోలే, ఎందుకంటే?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×