E-Paper
Advertisement

Alcohol and Heart Health: మద్యం తాగేవారికి గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

Alcohol and Heart Health: మద్యం తాగేవారికి గుండెపోటు ప్రమాదం ఎక్కువా?
Advertisement

మన దేశంలో మద్యం సేవించే వారి సంఖ్య గత కొన్నేళ్లలో చాలా పెరిగింది. ప్రత్యేకంగా యువతలో ఈ అలవాటు మరింత ఎక్కువైంది. పార్టీలు, వేడుకలు, స్ట్రెస్ తగ్గించుకోవడానికి అంటూ చాలామంది మద్యం వైపు వెళుతున్నారు. అయితే మద్యం తాగడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తాయి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు వంటి సమస్యలు మద్యం ఎక్కువగా తాగే వ్యక్తుల్లో అక్కడక్కడ కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మద్యం గుండెపై ఎందుకు ప్రభావం చూపుతుంది?
మద్యం శరీరంలోకి వెళ్లిన వెంటనే రక్తనాళాలు, గుండె స్పందన, రక్తపోటుపై ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది. ఎక్కువ మోతాదులో తాగినప్పుడు రక్తపోటు తక్షణమే పెరుగుతుంది. అధిక బీపీ అంటే గుండెకు అదనపు పనిభారం పెరుగుతుంది. ఈ అదనపు ఒత్తిడి గుండెపోటు వచ్చే అవకాశాన్ని మరింత పెంచుతుంది.

Advertisement

మద్యం తాగే గుండెకు చేటు
ప్రతిరోజూ మద్యం తాగేవారిలో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువవుతుంది. గుండె స్పందన అస్థిరంగా మారుతుంది. గుండె కండరాలు బలహీనపడతాయి. ఈ కారణాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు సహజంగానే పెరుగుతాయి. కొంతమంది రోజుకి కొంచెం మద్యం తాగితే హానికరం కాదని భావిస్తారు. కానీ నిపుణులు చెబుతున్న ప్రకారం మద్యంలో సురక్షిత పరిమాణం అనే మాట లేదు. ఎంత తాగినా ప్రమాదకరమే. తక్కువ మోతాదులో మద్యం తాగడం వల్ల గుండెకు మంచిదనే వాదన కూడా ఉంది. కానీ వైద్యులు మాత్రం ఈ వాదనను ఒప్పుకోవడం లేదు.

రోజూ లేదా తరచూ మద్యం తాగే వారికి రక్తపోటు స్థిరంగా పెరుగుతూనే ఉంటుంది. కొవ్వు కాలేయం (ఫ్యాటీ లివర్) రావడం వల్ల శరీరంలోని ఇతర అవయవాలు కూడా ప్రభావితమవుతాయి. రక్తనాళాల గోడలు బలహీనపడతాయి. శరీరంలో వాపులు, ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువవుతుంది. ఈ పరిస్థితులు ఒకేసారి గుండె పనితీరును దెబ్బతీస్తూ చివరకు గుండెపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.

Advertisement

పొగతాగేవారు మద్యం తాగే వారిలో గుండె పోటు ప్రమాదం మరింత పెరుగుతుంది. పొగతాగడం వల్ల రక్తనాళాలు వెంటనే కుచించుకుపోతాయి. మద్యం రక్తపోటును పెంచుతుంది. ఈ రెండూ కలిస్తే గుండె మీద రెండింతల ఒత్తిడి పడుతుంది. వైద్యులు చెబుతున్నట్టు ఇలాంటి వీరిలో 35–40 శాతం ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయి.

యువతలో పెరుగుతున్న గుండెపోటులు
ఇటీవలి కాలంలో 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తుల్లో కూడా గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి మద్యం అధికంగా సేవించడం. రాత్రివేళల్లో పార్టీలు, స్ట్రెస్, మద్యం.. ఇవన్నీ కలిసినప్పుడు గుండెకు ప్రమాదం మరింత పెరుగుతుంది. మద్యం అలవాటు ఉన్నవారిలో గుండెపోటు వచ్చినప్పుడు లక్షణాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. తీవ్రమైన ఛాతి నొప్పి, భుజాల వరకు, చేతుల వరకు నొప్పి వ్యాపించడం, చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరుగుడు, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×